దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి
దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి
ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో మొదటి తొమ్మిది రొజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు . ఈ తొమ్మిది రోజులలో చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయ దశమి . విద్యార్దులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్ల పూజ , క్షత్రియులు అయుద పూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు . దేవీ మహిషాసుర మర్ధినిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాదించిన స్పూర్తితో , పూర్వం రాజులుఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో చెప్పబడింది . కొన్ని ప్రాంతాల్లో దసరాకు ఒక వేడుకగా బొమ్మల వేడుకగా బొమ్మల కొలువు పెట్టె ఆచారం ఉంది .
దుర్గాష్టమి
దుర్గా దేవీ "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతీ వచ్చింది అని చెప్తారు . ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ . దుర్గతులను తొలిగించేది దుర్గ.ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది . 'దుర్గ"లోని ' దుర్ ' అంటే దుఖం , దుర్భిక్షం , దారిద్యం మొదలైనవి .'గ'అంటే నసింపచేసేదని దైవజ్ఞులు వివరణచెప్తూ ఉంటారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షసుల బాధలు దరిచేరావు . అందువల్లనే మొదటి మూడురోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతీ రూపాన్ని ఆరాదించి జ్ఞానాన్ని , ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు . ఈ రోజు దుర్గసహస్రనామ పారాయణము చేస్తారు . దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పుజిస్తారు . "ఈ దుర్గష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము" అని అంటారు .
మహర్నవమి
మానవకోటిని పునీతులను చేయుటకు భగిరధుడు గంగను భువి నుండి దివికి తెచ్చినది ఈనాడే . ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో అంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును . కావున సిద్దదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరుకు వారు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలూచేస్తూ ఉంటారు . అలా వ్రత సమాప్తి గావించిన వారికి సర్వ సిద్దులు , సర్వా భిష్ట సంసిద్ది కలుగును . ఇక క్షత్రియులు , కార్మికులు , వాహనా యజమానులు , ఇతర కులవృత్తుల వారు అందరూ ఆయుధ పూజ నిర్వహిస్తారు .
విజయ దశమి
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .
'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .
"శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు .
తెలంగాణా ప్రాంతమందు శమీపుజ అనంతరం 'పాల పిట్ట'ను చూచే ఆచారం ఉన్నది .
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు .
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||
పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదొష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి .
ఈ విజయదశమి రోజునే " శ్రీ షిర్డి సాయి బాబా" పరమపదించెను (సమాది చెందుట). ఈ విజయదశమి రోజు షిర్డీలో ఉత్సవాలు జరుగుతాయి .

No comments:
Post a Comment