What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

ఓం గురుభ్యోం నమః.

ఓం గురుభ్యోం నమః.
హరి ఓం.
మిత్రులారా,
భాగవతం అనేది ఒక పెద్ద జలాశయం లాంటిది ఆ జలాశయంలో కొన్ని లక్షలరకాల జీవరాశులు అనేకం జీవిస్తుంటాయి.ఒక పూర్ణ జలాశయం ఎంత కరువు సమయంలో అయినా పూర్తిగా నీటితో నిండి ఉండి ప్రాణాధారం అవుతుందో.అలాగే భాగవతం అనే నదీ జలాశయం ఎంత చెప్పిన ఇంకా మిగిలే ఉంటుంది.కనుక భాగవతమును ఈ వేదికమీద పూర్తిగా వివరించలేము.కనుక భాగవతం మీద అవగాహన మాత్రము తీసుకుని వచ్చే ప్రయత్నము చేస్తాము.ఆ ప్రయత్నంలో మా వివరణ మీకు ఉపయోగపడుతుంది అనే అనుకుంటున్నాము.మీకు అర్ధం అయ్యే విధముగానే మీకు చెప్తాము(చెప్పే ప్రయత్నమూ చేస్తాము).
మీకు పూర్తిగా అర్ధం అయ్యే విధముగా పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు వారి వ్యాఖ్యానాలను మీ ముందుంచుతున్నాము.
భక్తి జ్ఞాన వైరాగ్యములే మోక్షానికి మార్గము.
ఆర్తికి సమాధానమే భాగవతం.
భాగవతానికి మూలం ఆర్తి.
తెలుసుకోవాలనే కోరికకు సాకారమే భాగవతం.
భాగవతం తెలుసుకున్న వాడు లోకంలో దేనిని కోల్పోడు.చిన్న చిన్న విషయాలు అర్ధం చేసుకున్న వాడవుతాడు.జ్ఞాని అవుతాడు.లోకాన్ని అర్ధం చేసుకుంటాడు,సంతోషాన్ని,మహదానందాన్ని పొందుతాడు.పరమాత్మలో లీనం అవుతాడు.అందరికి (కుటుంభానికి) సరైనమార్గ దర్శకం అవుతాడు.
(ఇక్కడ "డు" అను పదం లింగ భేదం లేనిది). కాబట్టి పోతన భాగవతం చదివే ప్రయత్నం చేయ్యండి.చదవండి.సనాతన హిందూ ధర్మాన్ని మీ తరువాతి తరాలకు అందించండి.
చాగంటి వారి వ్యాఖ్యానం వినండి.
ఓం నమః శివాయ.
http://www.youtube.com/watch?v=_jfezfuB_BE

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML