ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ అనే శబ్దాన్ని
వినడంతోనే నీలో విద్యుత్తరంగ ప్రవాహంతో లభించే మహత్తర శక్తిభావం కలిగితేనే
నీవు నిజమైన హైందవుడవు; ఏ దేశానికి చెందినవాడైనా, ఏ భాషకు చెందిన వాడైనా
"హిందువు" అనగానే అతడు నీకు ఆప్తుడు, ప్రేమపాత్రుడు అయినప్పుడే నీవు
నిజమైనా హైందవుడివి; హిందువుడనే పేరుగల ఎవరు కష్టాల్లో ఉన్నా, నీ స్వంత
కుమారుడే అలా ఉన్నట్లుగా నీహృదయం వ్యధచెందినప్పుడే నీవు నిజమైన హైందవుడవు.
గురుగోవిందసిం హునివలే హిందువులకోసం సమస్తబాధ్యతను స్వీకరించగలిగినపుడే
నీవు నిజమైన హైందవుడివు. హిందుధర్మ రక్షణ
కోసం తన రక్తన్ని ధారవోసి, రణరంగంలో తన కన్నబిడ్డలసైతం కోల్పోయిన ఆ
మహాకేసరి- తన సర్వస్వాన్ని ఏ హిందువు సమాజాంకై ఒడ్డాడో , ఆ కృతఘ్న హిందూ
సమాజం చేతనే త్యుజించబడినపుడు నిశ్శబ్దంగా రంగమ్నుండి విరమించి, దక్షిణ
భారతంలో తనువు చాలించాడేగాని, అతని నోటినుండి పల్లెత్తు పరుషవాక్యం రాలేదు !
ఇది మరువకండి ! మీ దేశానికి మీవల్ల ఏదైనా ఉపకారం జరగాలంటే, మీలో ప్రతిఒక్కరు ఆ గురుగోవింద్ సిమ్హునివలె కావాలి. మీ దేశీయులలో వేలాది లోపాలుండొచ్చు. కాని వారి హిందూ రక్తన్ని గుర్తించండి. వారు మీ హృదయాలను గాయపరచినాసరే, వారిలోని ప్రతిఒక్కరు మిమ్ము నిందించినా సరే-వరే మీ మొదటి ఆరాధ్య దైవాలు కావలని మరువకండి. ఆత్మీయంగానే వారితో వ్యవహరించండి. వారు మిమ్ము గెంటివేస్తే, ఆ మహాకేశరి గురుగోవింద్సిమ్హునివలె నిశ్శబ్దంగా నిష్క్రమించండి. అట్టివరే హిందు అనేపేరుకు అర్హులు. అట్టి ఆదర్శమే సదా మన ముందుండాలి. సంకుచితభావాలను పాతిపెట్టి అనంతప్రేమను వ్యాపింపజేయాలి. -స్వామీ వివేకానంద

No comments:
Post a Comment