What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

ॐ.

ॐ.
మహిళలు తలచుకుంటే కూలిపోయిన రాజ్యాన్ని నిలబెట్టగలరు,దుష్ట రాజ్యాన్ని కూలగొట్టనూగలరు.
మంచి కార్యం ఎప్పుడు సఫలం అవుతుంది.
జై భవాని.
Please take time to read this and Share this Friends

రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లో " ఓ నలుగురు సభ్యులు " నిస్సిగుగా, నిర్లజ్జగా స్త్రీల గురించి చాలా అసహ్యంగా పోస్ట్ లు, కామెంట్ లు పెడుతూ దాదాపి 8 గంటలపాటు చర్చించారు. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఇలా........ వాళ్ళకేమి తేడా లేదు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పదమైన పోస్ట్ పెట్టకపోతే వాళ్ళకి మనసు ఊరుకోదు. అలా చేయడం తప్పు అని చెబితే ఇక చెప్పినవారి పనైపోయినట్టే. వారిని విమర్శిస్తూ మెసేజిలు పెట్టడం, పోస్ట్ లు పెట్టడం చేస్తారు.

వాళ్ళకి ఒక కులం రంగు పులుముకుని, ఒక రాజకీయ పార్టీ రంగు పులుముకుని, ఇతర కులాలను, వర్గాలని, ఉద్యమాలను ఉద్దేశించి వివాదస్పదమైన వ్యాఖ్యాలు చేస్తారు.

ఒకసారి మన గ్రంధాలు స్త్రీల గురించి ఏమి చెబుతున్నాయో చూడండి.

ॐ ఓ స్త్రీ! నీవు అందరిని ప్రాభావితం చేసి ముందుకు నడిపించు. ఋగ్ వేదం 10.85.46

ॐ ఓ స్త్రీ! నీవు తెలివితేటలతో ఈ లోకంలో అలుముకున్న చీకట్లను తొలగించు. ఋగ్ వేదం 4.14.3

ॐ రాజ్యపాలనలో స్త్రీపురుషులకు సమాన హక్కు ఉంది. యజుర్వేదం 20.9

ॐ ఓ స్త్రీ! నీవు రాయి అంత దృడమైన దానివి. నీవు సూర్యప్రభల వంటి దివ్యమైన జ్ఞానం సంపాదించి,ఈ సమాజ శ్రేయస్సు కోసం దీర్గకాలం జీవించి ఉండాలి. అధర్వణ వేదం 14.1.47

ॐ ఏ కుటుంబంలో పురుషుల చేష్టలవల్ల స్త్రీ బాధపడుతుందో, ఆ కుటుంబం సర్వనాశనమవుతుంది. అలా కాక ఏ కుటుంబంలో స్త్రీ ఆనందంగా జీవనం గడుపుతుందో ఆ కుటుంబం శాంతి సౌఖ్యాలతో వర్దిల్లుతుంది. మనస్మృతి 3.57

ॐ కూతురికి మాత్రమే తల్లి ఆస్తి పొందే హక్కు ఉంది. మనుస్మృతి 9.131

ఇలా స్త్రీ గొప్పతనాన్ని హిందూ ధార్మిక గ్రంధాలు నొక్కి చెబుతున్నాయి. ఎవరో కొందరు మార్చేసిన పుస్తకాలు పట్టుకుని స్త్రీలు ఇంట్లోనే కూర్చోవాలి, వాళ్ళకి చదువుసంధ్యలు అనవసరం, బాల్యంలోనే వివాహం చేయాలంటూ వాదిస్తూ భారతీయ ధర్మాన్ని తప్పుగా అర్ధం చేసుకుని వాదిస్తున్నారు. కుల వివక్ష గురించి, స్త్రీల వివక్ష గురించి ఏవైతే మనస్మృతిలో ఉన్నవని వాదిస్తున్నారో, అవన్ని తప్పని, కాలక్రమంలో చేర్చబడినవని మహర్షి దయానంద సరస్వతి గారు నొక్కి చెప్పి, ఆయా వాక్యాలను ఖండించారు. దళితులకు కూడా వేదాన్ని అధ్యయనం చేసే అధికారముందని,దళితులకు ఉపనయనం చేసి వేదాలను నేర్పించారు ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతి.

దళితులంటే ఎవరో కాదు, విదేశి దండయాత్రల సమయంలో వీరోచితంగా పోరాడి, ఓడిపోయిన వారిని విదేశీయులు సమాజానికి దూరం చేయగా వచ్చిన ఏర్పడిన వారే దళితులు అంటూ అనేక మంది చరిత్రకారులు చెబుతున్నారు.

అనేక మహానుభావులు పుట్టిన ఈ గడ్డ మీద ఏ ఉద్దేశ్యంతో చేశారో కాని, ఆ డర్టీ గ్యాంగ్ చేసిన కామెంట్ లు మొత్తం ఫేస్ బుక్ లో ఖాతాలున్నవారికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉన్నాయి. మన భారతీయ సమాజానికి, స్త్రీ జాతికి కళంకం తెచ్చేవిధంగా ఉన్నాయి.

ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిద్దాం. వారికి తగిన శిక్ష పడాలని ఆశిద్దాం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML