What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 19 September 2013

కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం

కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం

 హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతులందరూ ధనుర్మాసం రాగానే ఆనందిస్తారు. ఉదయానే్న లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తీర్చి వాటిని కుంకుమ, పూలతో అర్చిస్తారు. తోటి వారినందరినీ కలుపుకుని అఖిలాండకోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడానికి సిద్ధమవుతారు. అలనాడు విష్ణుచిత్తుని కూతురైన గోదాదేవి రంగస్వామిని ఎలా స్మరిస్తుండేదో, అనుక్షణమూ ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో అలానే ఇపుడు కృష్ణ్భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసంకోసం ఎదురుచూస్తారు. ఉదయానే్న లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడిచూసిన ఈ సమయంలో గోదాదేవిని, కృష్ణపరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలకు కలిగిస్తుంటారు.
ఈ ధనుర్మాసంలో తిరుప్పావై- ‘తిరు’’ అంటే శ్రేష్టమైన అనీ- ‘పావై’ అంటే వ్రతమని అర్థం. ప్రాచీన ‘పావై’ అనే తమిళ కవితా పద్ధతికి చెందిన ‘తిరప్పావై’ని రచించినవారు- ‘‘గోదాదేవి’’. ఈమెనే ‘ఆండాళ్’ అని పిలుస్తుంటారు. ‘‘శ్రీవిల్లిపుత్తూరు’’అనే గ్రామంలో విష్ణ్భుక్తుడైన- ‘విష్ణుచిత్తుడు’ ప్రతిరోజూ తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవాడు. ఆ విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాబ్దిలో మునిగి తేలుతుండేవారట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంలో ‘‘పెరియాళ్వార్’’ అనే పేరు స్థిరపరిచారట.
       


స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కనులు తెరవని చిన్నారి కనిపించిందట. ఆ పాపకు ‘కోదై’ అనే పేరు పెట్టుకొన్నాడు. ఆమె గోదాదేవి. ఈ గోదా చిన్నప్పటినుంచి తండ్రి మాదిరి విష్ణు భక్తురాలైంది. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయ రంగనికి పంపించేదట. ఓ రోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో.. ఎంత తప్పు జరిగిపోయందని వాపోయాడు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగని అర్చనకోసం తీసుకెళ్లాడు. కాని ఆ మాలలు రంగడు స్వీకరించలేదు.
         దానితో మరింత కుంగిపోయాడు విష్ణుచిత్తుడు. కాని ఆ రోజు రాత్రి చిత్తాన్ని రంగనికర్పించి నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కనిపించి ‘‘ఓయా నీ గోదా చేసే పని నాకిష్టమైందే, ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతిపాత్రాలు అని చెప్పాడు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయవయ్యా’’ అరి అడిగాడట. రంగని మనసెరిగిన విష్ణుచిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయంచాడు. రంగడిని తన నాధుడిని చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. ధనుర్మాస వ్రత మహత్యం బ్రహ్మాండ, ఆదిత్య, భాగవత పురాణాలతో పాటు- నారాయణ సంహితలోనూ ఉంది.
ధనుర్మాస వ్రతంకోసం విష్ణువు విగ్రహాన్ని ధనుర్మాస ప్రారంభదినంనాడు పూజామందిరంలో మధుసూదనుడు అనే పేరుతో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదు ఘడియలముందే, సంధ్యావందనాది అనుష్టానాలను ముగించుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. మధుసూదనుడికి ప్రతిరోజూ ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మొదటి పదిహేను రోజులూ ‘చక్కెర పొంగలి’ లేదా ‘పులగం’ను, తర్వాతి పదిహేను రోజులూ ‘దద్ద్యోజనం’ను సమర్పించాలనేది శాస్తవ్రచనం. ఈ విధంగా చేయడంతోపాటూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాశీ, రామేశ్వరం, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో వందలకొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒక్క రోజు బ్రాహ్మణుడికి అన్నదానం వల్ల కలుగుతుందని పెద్దలంటారు. ఈ విధంగా మధుసూదనుడితోపాటు ప్రతిరోజూ బృందావనంలో తులసిని పూజించాలి. ఇలా ధనుర్మాసంలో వ్రతాన్ని చేయడం పూర్తయ్యాక మధుసూదనస్వామి విగ్రహాన్ని విప్రుతోత్తమునికి దానం ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం నెల రోజులపాటు చేయలేనివారు కనీసం ఒక్కరోజు అయినా ఆచరిస్తే మంచిది. వేయి సంవత్సరాలపాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసిన వ్రతంవల్ల లభిస్తుంది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML