What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 23 September 2013

మనం చేసే పాపాలు, మనకి ఉన్న శాపాలు పిల్లలకి వస్తాయి అనడానికి చిన్న ఉదాహరణ.. మీకు ఇప్పుడు చెప్పబోయేది సరిగ్గా సింక్ కాకపోవచ్చు కాని యదార్ధం.

మనం చేసే పాపాలు, మనకి ఉన్న శాపాలు పిల్లలకి వస్తాయి అనడానికి చిన్న ఉదాహరణ.. మీకు ఇప్పుడు చెప్పబోయేది సరిగ్గా సింక్ కాకపోవచ్చు కాని యదార్ధం.

మాకున్న శాపాలు ఏంటి ? కాలంలో కూడా శాపాలు ఉంటాయా? అని అనుకోవచ్చు కాని ఉంటాయి.
చిన్న చిన్న జీవులని చంపడం, ఎదుటివారిని దూషించడం, కొట్టడం, వీటివల్ల వాళ్ల మనస్సు కలతపడి క్షోబిస్తుంది. ఆ క్షోభ మిమ్మల్ని కచ్చితంగా వెంటాడుతుంది. కంటికి కనపడలేదు కనుక ఏమి కాదు అనుకోవచ్చు. కంటికి కనపడలేదని లేదు అనుకోవద్దు. (మనకి ప్రాణవాయువు ఇచ్చె గాలి కనపడదు గుర్తుపెట్టుకోండి.). ఆడపిల్లల్ని అసలు బాధపెట్టకండి. వాళ్ళు స్వతహాగా పవిత్ర మూర్తులు. కాకపోతే కలి మాయ వల్ల ఉద్యోగాల పేర్లతో అడ్డమైన చాకిరి చేయిస్తున్నారు, ఎదుటి వాళ్ళకి వంగి సలాం కొట్టేలా తాయారు చేస్తున్నారు. ఆడదాని ఏడుపు సర్వ అనర్ధలకి మూలం. మనసులో కానీ, మాటలో కాని చేతలో కాని ఎవ్వరికి ఏ హాని కలిగించకండి.

ఈ మద్య కొత్తగా రక్తం తాగే రాకాసి ''తలసీమియా'' అనే వ్యాధి రూపంలో చిన్న పిల్లల్లో హిమోగ్లోబిన్ శతం తగ్గించేసి రక్తహీనత కలిగిస్తుంది. (పిల్లల పేర్లు చెప్పి అడ్డగోలుగా సంపాదించిన సంపద రోగాల పాలు. ఏమిచేసినా పిల్లల కోసమేనండి.). ఈ జబ్బు బారిన పడిన వారు కనీసం 10, 15 రోజులకొకసారి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి.
మనం తినే తిళ్ళు, పిల్చె గాలి, చేసే పనులు, ఇలా అన్ని కలిపి వారికి శాపంగా పరిణమిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
ఈ రోగం సంక్రమించేది తల్లి తండ్రి జన్యువుల వల్ల మాత్రమే. మీలో కనపడకపోవచ్చు కాబట్టి లేదు అనుకోకండి. ప్రస్తుతం జన్మిస్తున్న పిల్లల్లో పుట్టుకతోనే 25% మంది వ్యాదిగ్రస్తులై జన్మిస్తున్నారు. నెలల పిల్లల నుంచే రక్తం అవసరం అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో 6కోట్లకు పైనే పిల్లలు ఈ వ్యాధితో భాధ పడుతున్నారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML