What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 24 September 2013

తిరుమలేశునికి గద్వాల పంచె

తిరుమలేశునికి గద్వాల పంచె

ప్రతి ఏటా అశ్వియుజ మాసంలో జరిగే తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల మొదటిరోజు జరిగే అంకురార్పణ ఉత్సవానికి గద్వాల ఏరువాడ జోడుపంచెలను వెంకటేశ్వర స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 130 సంవత్సరాల నుంచి శ్రీవారితో ఉన్న ఈ అనుబంధం వల్లే ఇక్కడి చేనేత పరిశ్రమ ఖండాంతర ఖ్యాతిని అర్జించిందని కార్మికుల నమ్మకం. స్వామివారి అలంకరణకు గద్వాల చేనేత కార్మికులు 15రోజులుగా నామాల మగ్గంపై పంచెను నేయడం ప్రారంభించి మంగళవారం పూర్తి చేశారు. ఐదుగురు చేనేత కార్మికులు నిష్టతో జోడుపంచెల నేత పనిని పూర్తిచేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 26న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అధికారికి జోడుపంచెలను అందించనున్నట్లు మహంకాళి కరుణాకర్ తెలిపారు..@ బహుజనబంధు.
 https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-prn1/s403x403/558056_222646494566647_1326450281_n.jpg

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML