What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 September 2013

ఆర్యభట్టు

ఆర్యభట్టు


ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతనుఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొ జ్యా" గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ (Arduverius) అనీ, అరబ్బులు అర్జావస్ (Arjavas) అని వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్ ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
పుట్టు పూర్వోత్తరాలు
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహురుడికి సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తుంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేక పోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయినా గానీ ఆ పుస్తకంలో లోతైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో చాలా విశేషాలతో పాటు, ఒకదానికొకటి ఎదురుగానూ, ఒకే దిశలోనూ సంచరించే గ్రహాలు కలుసుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని లెక్కగట్టడానికి కొన్ని సూత్రాలు కూడా ప్రతిపాదించాడు. సంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ కృషిచేశాడు.
రచనలు
ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం , గణిత శాస్త్రం లో అనేక రచనలు చేశాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని అలభ్యం. అతని ముఖ్యమైన రచన ఆర్యభట్టీయం గణిత, ఖగోళ శాస్త్రాల సంగ్రహము. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తారంగా ప్రస్తావించడమే కాకుండా ఈ రచన కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని అష్మకతాంత్ర అని పిలిచే వాడు. ఆర్యశతాష్ట (108 శ్లోకాలు కలిగినది అని అర్థం)అని కుడా వ్యవహరించబడేది.
1. గీతికాపాద
2. గణితపాద
3. కళాక్రియపాద
4. గోళపాద

ఈ ఆర్యభట్టీయం అనే రచనకు ఆయన స్వయంగా పేరేమీ పెట్టలేదు. ఇది తరువాత భాష్యకారులు చేసిన పదప్రయోగమే. అత్యంత క్లుప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు రాసి విస్తరించాడు.
గణిత శాస్త్రం
పై (π)విలువను కనుక్కోవడానికి కృషి చేశాడు.
క్షేత్రగణితం, మరియు త్రికోణమితి
ఆరవ గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట ఈ విధంగా వివరించాడు.
త్రిభుజస్య ఫాలాశరీరం సమదలకోటి భుజార్ధ సంవర్గం
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.
బీజ గణితం
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.

and

ఖగోళ శాస్త్రం
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం(elliptical shape)లో పదుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్య భట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయం లో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.

భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.
భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరే పెట్టారు.
ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మాద, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.[1]
వారసత్వం
ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లామిక్ స్వర్ణ యుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డాయి. అల్-ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనల్లో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తావించారు.
https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-prn2/1240593_656354554388955_261101697_n.jpg

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML