What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 20 September 2013

అమ్మవారికి సమర్పించిన చీరను (శేష వస్త్రం) ధరించవచ్చా ?

అమ్మవారికి సమర్పించిన చీరను (శేష వస్త్రం) ధరించవచ్చా ?

అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి చీర ధరించిన తరువాత, ఆ పవిత్రతను కాపాడటం కోసం తప్పని సరిగా కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. తిథి - వర్జ్యం చూసుకుని 'శుక్రవారం' రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.

ఈ చీరను ధరించినంత సేపు ప్రశాంతంగా ... పవిత్రంగా వుండాలి. మంచి ఆలోచనలు చేస్తూ ... మంచి విషయాలను గురించి మాత్రమే మాట్లాడవలసి వుంటుంది. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించ కూడదు, ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది. పుణ్యక్షేత్రాల్లోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా, మారుమూల గ్రామంలోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా పవిత్రత విషయంలో ఒకే విధమైన నియమాలను పాటించవలసి వుంటుంది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML