What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 20 September 2013

శ్రీఉమా అగస్తేశ్వర స్వామి దేవస్థానము : (తాపేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, మండపేట )

శ్రీఉమా అగస్తేశ్వర స్వామి దేవస్థానము :
(తాపేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, మండపేట )
ద్వారపూడి-మండపేట దారిలో మండపేటకు ఒక కిలోమీటరుదూరంలో ఈ గ్రామం వున్నది
తాపేశ్వరము కాజాలకన్న ముందుగా ఇక్కడ వున్న శ్రి అగస్తేశ్వరస్వామి వారి వలన ప్రసిద్ధి చెందినది.ఈగుడిలోని మూలవిరాట్‌ఈశ్వరునుని అగస్తేశ్వరుడను తాపసి(ఋషి)ప్రతిస్టించుటచే ఈ గ్రామం తాపసి ఈశ్వర గ్రామంగా పిలువబడీ క్రమంగా తాపేశ్వరం గా మారిందని కొందరి అభిప్రాయం.అయితే తాపేశ్వరం మొదటి పేరు'వాతాపి పురమని'క్రమంగా ప్రజల నానుడిలో తాపేశ్వరంగా మారిందని మరికొందరి అభిప్రాయం.
స్థలపురాణం:అగస్త్య మహర్షి వాతాపి,ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి,ఆ బ్రహ్మహత్య దోషంలనుండి పరిహరంచెంది,నివృత్తి వేసుకొనుటకై ఇచ్చట ఈశ్వర ప్రతిస్ట చేశాడు.ఈ గ్రామంలోనే కాకుండా సమీపంలోని ఆర్తమూరు,మండపేట,వల్లూరు,మరియు చెల్లూరు గ్రామాలలో కూడా ప్రతిస్టీంచినట్లు తెలుస్తున్నది.ఇచ్చట స్వామి వారు పశ్చిమ ముఖంగా వున్నారు,మరియు తుల్యభాగనది ఉత్తరముఖముగా ప్రవహిస్తువుండుటచే కాశీ క్షేత్రంను దర్శిస్తె కలిగే పుణ్యఫలం ఈస్వామి వారిని దర్శిస్తే కల్గుతుందని విశ్వాసం.ఈ విషయం పండితులచే,పీఠాథిపతులచే శాస్త్రార్త్ధంగా దృవీకరించబడినది.కాశీ క్షేత్రంను దర్శిస్తే కలిగే ముక్తీ ఈ తాపేశ్వ్రం లోని అగస్తేశ్వర స్వామి వారిని దర్శిస్తే కల్గుతుందని శాస్త్రార్త్ధం.శ్రీ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుపుతారు.
 
https://fbcdn-sphotos-a-a.akamaihd.net/hphotos-ak-ash3/s403x403/1239798_681466688549190_211555926_n.jpg

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML