What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label వ్రతములు. Show all posts
Showing posts with label వ్రతములు. Show all posts

Thursday, 19 September 2013

మార్గళివ్రతం

ఆధ్యాత్మికతకు దారిచూపే మార్గళివ్రతం


మాసానాం మార్ఘశీర్షోహాం- అని గీతలో భగవానుడు పేర్కొన్నాడు. భగవంతుని చేరుకోవడానికి, అతని సాక్షాత్కారం పొందడానికి ఈ మాసం ఎంతో ఉపయుక్తమయినదని పురాణాలు చెబుతున్నాయి. సర్వజనుల అభ్యుదయానికి దోహదకారి అవుతూ, సంపత్ సౌభాగ్యాలకు మార్గదర్శకంగా నిలుస్తుందీ మాసం. మానసిక బలంతో ఆధ్యాత్మిక మార్గాన వికసించగల మన స్థైర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మృత్యుతత్వం నుంచి అమృత తత్వంవైపు, ఐహిక సుఖాలనుంచి పారమార్థిక తత్వంవైపు, భగవంతుడివైపు పయనింపచేసే మాసమే ‘్ధనుర్మాసం’. లక్ష్మి అంశగా అవతరించి జీవిని పరమాత్మతో అనుసంధింపచేయడానికి జన్మించిన తల్లి ‘ఆండాళ్’ లేక గోదాదేవి. ఆ తల్లి తనని ఓ గోపికగా ఊహించుకుని ఈ వ్రతం సాగించింది. గోదాదేవి తన వ్రతానికి అనువైన మాసంగా ఈ మాసాన్ని ఎంచుకుంది. భక్తిని మాలగా అల్లి సువాసనా భరితమైన పుష్పాలతో ఆ భగవానుడిని సేవించి ముక్తిపొందవచ్చని గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రతం రుజువుచేసింది. ఇది ఇహలోక సంపదను, భగవదైశ్వర్యాన్ని అందిస్తుంది. ఆ కారణంగానే ఆ తల్లి ఉపనిషత్తుల రహస్యాన్ని నాలుగు వేదాల సారాన్ని, గీతామృత సారాన్ని తన తిరుప్పావై ప్రబంధంలో జోడించి అందించింది. తిరుప్పావై ప్రబంధంలో మొత్తం 30 పాశురాలున్నాయి. ఇవన్నీ భక్తుడు, భగవంతుని సులువుగా చేరడానికి ఉద్దేశించినవి. ధనుర్మాసంలో వైష్ణవులు ఆచరించే మార్గశీర్ష స్నాన వ్రతం, కన్యలు ఆచరించే కాత్యాయనీ వ్రత విధానాన్ని ‘తిరుప్పావై’ గ్రంథంలో ఆండాళ్ వివరించింది. తిరుప్పావై గ్రంథంలో ఆండాళ్, తానొక ద్వాపరయుగ గోపికగా, కలియుగ గోదాదేవిగా ద్విపాత్రాభినయం చేసి అద్వైతాన్ని దర్శించింది. మధుర గానంచేసి ‘పాడిక్కొడుత్తాళ్’గా భగవానుని మెప్పించి శ్రీరంగనాధుని దేవేరి అయ్యింది. శ్రీవిల్లిపుత్తూరు ఆధ్యాత్మిక సంపత్తిని, పాడి సమృద్ధిని ఉపమానాలతో తిరుప్పావైని దృశ్యకావ్యంగా మలచి ‘ఆండాళ్’గా ప్రసిద్ధిపొందింది. మార్గశిర మాసం మోక్ష కాలమని, పరమపద సాధనానికి ఈ మాసం అనువైనదని శ్రీవైష్ణవ ధర్మాన్ని తెలిపిన ఆళ్వారులు, ఈ మాసాన్ని ధనుర్మాసంగా ప్రత్యేకంగా భక్తితో ప్రవర్తనా విధానాన్ని అనుసరించారు. దీనినే ‘మార్గళి’ వ్రతంగా గోదాదేవి అభివర్ణించి తిరుప్పావై రూపంలో భగవానుడ్ని కీర్తించింది. ఈ మార్గశిర మాసంలోనే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడని, అర్జునికి విశ్వరూప దర్శనమిచ్చాడని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగా ఈ మాసం పరమాత్మ విశ్వరూప దర్శనానికి అనువైన మాసంగా కొనియాడబడుతోంది. ఈ క్రమంలోనే గోదాదేవి రచించిన తిరప్పావై పాశురాలను దేవాలయాల్లో పారాయణం చేయడం సంప్రదాయంగా వచ్చింది. ఇలా పరమపవిత్రమైన మార్గశిర మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు. భీష్ముడు వంటి మహాయోగులు సైతం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంకోసం వేచి ఉండి తమ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు తాను ఈ వ్రతాన్ని ఆచరించి భగవత్ సాయుజ్యం పొంది, మనం కూడా దానిని పొంది తరించాలని ప్రబంధరూపంగా ‘తిరుప్పావై’ని అందించింది. మార్గశిర మాసాన్ని కృష్ణ సమాగమవాంఛను ఫలింపచేసిన కాలం కూడా పురాణాలు చెబుతున్నాయి. సాక్షత్తు గోపికాస్ర్తిలు ఈ మాసంలోనే శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి, స్వామి కరుణకు పాత్రులయ్యారంటారు. ఈ వ్రతాన్ని ముప్పై రోజులు ఆచరించలేనివారు, ఉత్తరాయణ పుణ్యకాలంలోనైనా శ్రీహరిపై మనస్సును లగ్నంచేసి తిరుప్పావై పాశురాలను గానామృతం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ధనధాన్యాలు అక్కర్లేదు. వజ్రవైడూర్యాలు, ఐశ్వర్యాలు అవసరం లేదు. అయితే కావాల్సిందల్లా నిండైన భక్తి. భక్తి విశ్వాసాలతో తమ హృదయాలనే పువ్వుగానో, పత్రంగానో చేసి భగవంతుడికి అర్పిస్తే దయామయుడైన ఆ జగత్‌పతి సంతోషించి, ముక్తిమోక్షాలను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా జగత్ కళ్యాణకారకుడైన ఆ శ్రీమన్నారాయణుడు తనను నమ్మిన భక్తుల్ని ఆదరించి అక్కున చేర్చుకుంటాడు. భక్తుల అభీష్టాలను నెరవేర్చి, వారిని ఆదుకుంటాడు.
Read More

కలినాశకరం. కాలభైరవాష్టమి వ్రతం

కలినాశకరం. కాలభైరవాష్టమి వ్రతం


మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి- ‘‘కాలభైరవాష్టమి’’. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు – కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి’’ పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.
కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది.
        బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి – ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో… మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే – శ్రీకాలభైరవుడు.
ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా- ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -
‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు… కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.
దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే – నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’. తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ… కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.
ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ… సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించవలెను. ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే!

Read More

కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం

కృష్ణ భక్తులకు ఇష్టం.. ధనుర్మాసం

 హేమంతంలో వసంతం వచ్చినట్లుగా పడతులందరూ ధనుర్మాసం రాగానే ఆనందిస్తారు. ఉదయానే్న లేచి వాకిళ్లను అందంగా రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఆవుపేడతో గొబ్బెమ్మలను తీర్చి వాటిని కుంకుమ, పూలతో అర్చిస్తారు. తోటి వారినందరినీ కలుపుకుని అఖిలాండకోటి నాయకుడైన శ్రీకృష్ణ భగవానుని కొలవడానికి సిద్ధమవుతారు. అలనాడు విష్ణుచిత్తుని కూతురైన గోదాదేవి రంగస్వామిని ఎలా స్మరిస్తుండేదో, అనుక్షణమూ ఆయన మెప్పును పొందాలని ఎలా తహతహలాడేదో అలానే ఇపుడు కృష్ణ్భక్తులు, గోదాదేవి భక్తులు ఈ మాసంకోసం ఎదురుచూస్తారు. ఉదయానే్న లేచి శుచులై తిరుప్పావై గానం చేస్తారు. ఏ గుడిచూసిన ఈ సమయంలో గోదాదేవిని, కృష్ణపరమాత్మను వేడుకొనే జనసందోహం ఆశ్చర్యానందాలకు కలిగిస్తుంటారు.
ఈ ధనుర్మాసంలో తిరుప్పావై- ‘తిరు’’ అంటే శ్రేష్టమైన అనీ- ‘పావై’ అంటే వ్రతమని అర్థం. ప్రాచీన ‘పావై’ అనే తమిళ కవితా పద్ధతికి చెందిన ‘తిరప్పావై’ని రచించినవారు- ‘‘గోదాదేవి’’. ఈమెనే ‘ఆండాళ్’ అని పిలుస్తుంటారు. ‘‘శ్రీవిల్లిపుత్తూరు’’అనే గ్రామంలో విష్ణ్భుక్తుడైన- ‘విష్ణుచిత్తుడు’ ప్రతిరోజూ తులసి మాలలు కట్టి రంగడికి సమర్పించి పూజలు చేస్తుండేవాడు. ఆ విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టుగా స్వామి నామగానంలో తన్మయుడై ఆనందాబ్దిలో మునిగి తేలుతుండేవారట. అందుకే ఆయనను భక్తులందరికన్నా పెద్దవారు అనే అర్థంలో ‘‘పెరియాళ్వార్’’ అనే పేరు స్థిరపరిచారట.
       


స్వామి కైంకర్యానికై ఆయన స్వయంగా తులసి వనాన్ని పెంచేవారట. ఒకనాడు ఆ వనంలో తులసి కోస్తుండగా ఓ కనులు తెరవని చిన్నారి కనిపించిందట. ఆ పాపకు ‘కోదై’ అనే పేరు పెట్టుకొన్నాడు. ఆమె గోదాదేవి. ఈ గోదా చిన్నప్పటినుంచి తండ్రి మాదిరి విష్ణు భక్తురాలైంది. ఈ గోదాదేవి స్వామి కోసం మాలలు కట్టి తాను ధరించి ఎలా ఉందో చూసుకొని తాను మురిసిపోయ రంగనికి పంపించేదట. ఓ రోజు ఎప్పటిలా మాలానందాన్ని పొందుతున్నప్పుడు ఆ విష్ణుచిత్తుడు చూశాడు. అయ్యో.. ఎంత తప్పు జరిగిపోయందని వాపోయాడు. ఖిన్నుడై వేరుగా మాలలు కట్టి రంగని అర్చనకోసం తీసుకెళ్లాడు. కాని ఆ మాలలు రంగడు స్వీకరించలేదు.
         దానితో మరింత కుంగిపోయాడు విష్ణుచిత్తుడు. కాని ఆ రోజు రాత్రి చిత్తాన్ని రంగనికర్పించి నిద్రిస్తున్న విష్ణుచిత్తునికి కలలో కనిపించి ‘‘ఓయా నీ గోదా చేసే పని నాకిష్టమైందే, ఆమె ధరించిన పూలమాలలే నాకు ప్రీతిపాత్రాలు అని చెప్పాడు. ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయవయ్యా’’ అరి అడిగాడట. రంగని మనసెరిగిన విష్ణుచిత్తుడు ఆనందంగా గోదాదేవిని రంగనికిచ్చి పెళ్లి చేయంచాడు. రంగడిని తన నాధుడిని చేసుకోవాలని గోదా చేసిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడు. ధనుర్మాస వ్రత మహత్యం బ్రహ్మాండ, ఆదిత్య, భాగవత పురాణాలతో పాటు- నారాయణ సంహితలోనూ ఉంది.
ధనుర్మాస వ్రతంకోసం విష్ణువు విగ్రహాన్ని ధనుర్మాస ప్రారంభదినంనాడు పూజామందిరంలో మధుసూదనుడు అనే పేరుతో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదు ఘడియలముందే, సంధ్యావందనాది అనుష్టానాలను ముగించుకుని తర్వాత ధనుర్మాస వ్రతాన్ని చేయాలి. మధుసూదనుడికి ప్రతిరోజూ ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత తులసీ దళాలు, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించాలి. తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మొదటి పదిహేను రోజులూ ‘చక్కెర పొంగలి’ లేదా ‘పులగం’ను, తర్వాతి పదిహేను రోజులూ ‘దద్ద్యోజనం’ను సమర్పించాలనేది శాస్తవ్రచనం. ఈ విధంగా చేయడంతోపాటూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాశీ, రామేశ్వరం, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల్లో వందలకొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన కలిగే ఫలితం ఈ మాసంలో ఒక్క రోజు బ్రాహ్మణుడికి అన్నదానం వల్ల కలుగుతుందని పెద్దలంటారు. ఈ విధంగా మధుసూదనుడితోపాటు ప్రతిరోజూ బృందావనంలో తులసిని పూజించాలి. ఇలా ధనుర్మాసంలో వ్రతాన్ని చేయడం పూర్తయ్యాక మధుసూదనస్వామి విగ్రహాన్ని విప్రుతోత్తమునికి దానం ఇవ్వాలి. ధనుర్మాస వ్రతం నెల రోజులపాటు చేయలేనివారు కనీసం ఒక్కరోజు అయినా ఆచరిస్తే మంచిది. వేయి సంవత్సరాలపాటు నిత్యం వివిధ దేవతలను ఆరాధించినంత ఫలం ధనుర్మాసంలో ఒక్కరోజు చేసిన వ్రతంవల్ల లభిస్తుంది.

Read More

Monday, 12 August 2013

మంగళ గౌరీ వ్రతం మరియు కథ

మంగళ గౌరీ వ్రతం మరియు కథ

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి

పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం :

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.

మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మంగళగౌరీ వ్రత విధానం :

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః జనార్ధనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః

శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః శ్రీ శచిపురంధరాభ్యం నమః

శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః శ్రీ సీతారామాభ్యం నమః

సర్వేభ్యో దేవేభ్యో నమః మాతృభ్యో నమః, పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే , శుభ తిథౌ, శుక్రవాసరే, శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం – శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :

ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి

ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.

తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :

పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.
Read More

మంగళ గౌరీవ్రతము

మంగళ గౌరీవ్రతము

గణపతిపూజ
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
ప్రాణాయామము:
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:
(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).
శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే ; ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి| హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః| అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.
మంగళగౌరి వ్రత పూజ:
ధ్యానం:
శ్లో: సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం ; సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం
అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం ; జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం.

శ్లో: దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం; బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం
శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం ; శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి.

శ్లో: కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని; ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె
రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే ; చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్లో: ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం; బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం
చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం; తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.

శ్లో: ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం ; పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై
శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం ; కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

శ్లో: లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన; ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై
గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై ; స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.

శ్లో: హ్రీంకారఅంకిత మంత్రలక్షితతోనో హేమాచాలాత్స చిన్తై; రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం

శ్లో: కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై; జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి
ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం; దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లో: హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం ; హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే
మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం ; నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న మయాభరనాని సమర్పయామి.

శ్లో: సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం; కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం; కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.

అధాంగ పూజ:

వుమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జన్ఘి పూజయామి
పార్వత్యైనమః జానునీ పూజయామి
జగన్మాత్రేనమః ఊరూ పూజయామి
జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి
మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి
అమ్బికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్నాయై నమః స్థనౌ పూజయామి
శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంభు కంట్యై నమః కంఠం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రే పూజయామి
రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి
సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి

మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

అష్ట్తోత్తర శతనామావళి

ఓంమంగలగౌర్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం గిరిజాతనుభావాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం వీరభద్ర ప్రసువే నమః
ఓం విశ్వరూపిన్యై నమః
ఓం కష్ట దారిద్రషమన్యై నమః
ఓం శామ్భావ్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భాద్రదాయిన్యై నమః
ఓం సర్వ మంగలాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మంత్రారాధ్యై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం నారాయణంశాజాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం అమ్బికాయై నమః
ఓం ముని సంసేవ్యాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కన్యకాయై నమః
ఓం కలిదోష నివారిన్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
ఓం గుహామ్బికాయై నమః
ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః
ఓం విశ్వా వ్యాపిన్యై నమః
ఓం అష్టమూర్తాత్మికాయై నమః
ఓం శివాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం భావాన్యై నమః
ఓం మాంగల్య దాయిన్యై నమః
ఓం మంజు భాశిన్యై నమః
మహా మాయాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం హేమవత్యై నమః
ఓం పాప నాశిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం మ్రుదాన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కలార్చితాయై నమః
ఓం క్రుపాపూర్నాయై నమః
ఓం సర్వమయి నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అమ్రుతెశ్వర్యై నమః
ఓం సుఖచ్చిత్పుదారాయై నమః
ఓం బాల్యారాదిత భూతదాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః
ఓం సర్వ భోగాప్రదాయై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం కర్మ బ్రమ్హ్యై నమః
ఓం ఓం వాంచితార్ధ యై నమః
ఓం చిదంబర శరీరిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మార్కందేయవర ప్రదాయి నమః
ఓం పున్యాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం శశాంక రూపిన్యై నమః
ఓం భాగాలాయై నమః
ఓం మాత్రుకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం సత్యై నమః
ఓం కల్యాన్యై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం అమ్బాయై నమః
ఓం భానుకోటి సముద్యతాయై నమః
ఓం పరాయి నమః
ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
ఓం సర్వ కాల సుమంగళ్యై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం వేదాంగ లక్షణా యై నమః
ఓం కామ కలనాయై నమః
ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః
ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః
ఓం కామేశ్వర పత్న్యై నమః
ఓం మురారి ప్రియార్దాన్గై నమః
ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః
ఓం పురుషార్ధ ప్రదాయి నమః
ఓం సర్వ సాక్షిన్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చంద్యై నమః
ఓం భాగామాలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః
ఓం దాక్షాయిన్యై నమః
ఓం సూర్య వస్తూత్తమాయై నమః
ఓం శ్రీ విద్యాయై నమః
ఓం ప్రనవాద్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దీక్షాయై నమః
ఓం శివాభిదానాయై నమః
ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః
ఓం నాద రూపాయి నమః
ఓం త్రిగునామ్బికాయై నమః
ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

శ్లో: హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై ; రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం
తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ ; న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దూపమాగ్రాపయామి

శ్లో: లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే ; మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై
చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై; ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి

శ్లో: హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం; దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా
దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం; మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి

శ్లో: సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై ; ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై
ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై ; పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

శ్లో: కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త ; పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి
తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం ; మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.

శ్లో: పరాంకుషౌ పాశామభీతి ముద్రం ; కరైర్వహన్తీం కమలాసనస్తాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం ; భజేహ మంబాం జగదీశ్వరీం తాం.

శ్లో: సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ; శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

శ్లో: హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి ; వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే
సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే ; సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

మంగళ గౌరీవ్రతకథ
1. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.
2. పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .
3. చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు .. ఎన్ని నోకులు నోచినా , ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము . చివరికి పరమేస్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది ... పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు. జయపాలుి భార్య పెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది . జరిగినదంతా భర్తకు వివరించింది . రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు . మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భ్క్ష వేయబోవడం జరిగింది . ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక . సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి ... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశైంచండి " అని వేడుకోగా .. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి. నీల వస్త్రాలను ధరించి , నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి , ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను . అక్కడ అరణ్యం లో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను . ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు . ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు . స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు . జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు . నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు .. అప్పుడు అమ్మవారు" ధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు , సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు". అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు . అప్పుడాదేవి ఆ రాజుని ' తన పార్శమున ఉన్న గణపతినాభియందడుగు వైచి , చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను . జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .
4. ఈ విందంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది . ఆ కుర్రవాడికి వయసొచ్చింది . వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామ తో కాశీకి పంపించారు . త్రోవలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వరిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను " ముండ , రండ " అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు , రండలు - ఉండరు అంది కోపంతో. జయపాలుడు కుమారుడు -శివుడు అంతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు . తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు . " మా ఇంట్లో ముండలు , రండలు ఎవరు ఉండరు . మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది ." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది . సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు . మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ..ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురు కి తగిన భర్త అని దేవుని వాక్యము గా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడు ల వివాహము జరిగిఫోతుంది.
5. పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలఓ కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రి తో ఆతని ఆయువు చెల్లింది . ఈ దోషము నకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను . " కొద్ది సేపట్లో ఒక కృష్న సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది . వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు ... అప్పుడ పాము ఆ ఘటం లోకి పవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

పూజావిధానం : ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు .
Read More

సరస్వతీ వ్రతం:

సరస్వతీ వ్రతం: సాధారణంగా 'సరస్వతీ వ్రతం'అనగానే ... కేవలం విద్యాభివృద్ధి కోసం మాత్రమే చేసేదని అనుకుంటారు. కానీ ఈ వ్రతం విద్యా విషయంగానే కాకుండా, అనుకున్నది సాధించడానికీ ... ఆయురారోగ్యాలను ప్రసాదించడానికి చెప్పబడుతోంది.ఈ వ్రతం చేయడం వల్ల అజ్ఞానంతో చేసిన పాపాలన్నీ తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పాండిత్యం సిద్ధిస్తుంది. ఆ వ్రతవిధానమిది.
ఈ వ్రతానికి మాఘశుద్ధ పంచమి లేదా ఏ మాసమైనా శుక్లపక్ష పంచమి, పూర్ణిమ తిధులు శ్రేష్ఠం. సంకల్పం చెప్పుకున్న శుభముహూర్తాన ఉదయం పూట శుచిగా సరస్వతిని పూజిస్తామని సంకల్పించుకోవాలి. స్నానాదికాలు, నిత్యకృత్యాలు అయిన పిదప కలశ స్దాపన చేయాలి. గణపతిని పూజించి, కలశంలో దేవిని అవాహాన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవికి ధవళ వస్త్రాలను సమర్పించి, తెల్లని నగలు అలంకరించాలి. తెల్లని పూలు, అక్షరాలతో, మంచిగంధంతో, ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించిన అనంతరం పాయసం నివేదించాలి. పూజానంతరం కధ చెప్పుకుని అక్షంతలు శిరస్సున ధరించి పాయస ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. ఈ విధంగా 5 వారాలు చేసిన తదుపరి ఉద్యాపన చేయాలి.

పూర్తి ఫలితం కోసం వ్రతము అయ్యాక ఉద్యాపన కుడా చెయ్యవచ్చు
ఉద్యాపన విధానం:
ఐదుగురు పిల్లలను గణపతి ప్రతిరూపాలుగా భావించి, పూజించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారిని చదివించాలి. లేదా వారి చదువుకయ్యే ఖర్చు భరించాలి. ఎవరైనా తమకిగానీ, తమవారికిగానీ అసాధారణ విద్య అబ్బాలనుకున్నా, ఉన్నత విద్యాప్రాప్తి, లేదా పదోన్నతి కావాలనుకుంటే ఈ వ్రతం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు. శ్రావణమాసం లేదా ఫాల్గుణ మాసాలు ఈ వ్రతమాచరించడానికి శుభప్రదం.
Read More

శ్రావణ మంగళవార వ్రతం :

శ్రావణ మంగళవార వ్రతం :

శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.

అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.

ఉద్యాపన

అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.

కథ

అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేనికూతురు కావాలా?” అని అడిగాడు.

అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది.

తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు.

అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార ''అమ్మా, నాన్నా'' అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు.

ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది.

తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.

విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.

అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి...ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా,ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెండ్లి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది.అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెండ్లి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్లి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెండ్లివారి నుండి కబురు అందుతుంది.

వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును... నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.

ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.

కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.

అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది.

ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి'' అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది.

అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.

ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.

అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె.

అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు
 
Read More

Monday, 5 August 2013

"ఐదోతనం" కోసం శ్రావణ శుక్రవారం పూజ చేయండి

"ఐదోతనం" కోసం శ్రావణ శుక్రవారం పూజ చేయండి

శ్రావణ శుక్రవారం పూట మహిళలు అమ్మవారిని నిష్ఠతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఆ రోజున దుర్గాదేవిని ఆలయాల్లో సందర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

శ్రావణ శుక్రవారం ఉదయమే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, పసుపు, కుంకుమలు, పుష్పాలతో దివ్యసుందరంగా అలంకరించుకోవాలి. మహిళలు అమ్మవారి ఫోటోకు గానీ, ప్రతిమకు గానీ మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను సమర్పించాలి. అనంతరం చక్కెర పొంగలి, అటుకుల పాయసంను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు సమర్పించుకోవాలి.

పూజకు పిమ్మట మాంగల్యసూత్రములోని పసుపు తాడును మార్చుకోవడం చేస్తే ఐదోతనం ప్రాప్తించి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు. అంతేగాకుండా శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని వారు చెబుతున్నారు.

అందుచేత శ్రావణ శుక్రవారమైన నేడు అమ్మవారి దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం. ఇంకా మహిళలు పసుపు, కుంకుమలను ముత్తైదువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
Read More

Sunday, 21 July 2013

పసుపుగౌరి నోము కథ

పసుపుగౌరి నోము కథ
పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది. పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది. ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది. ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు. తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు. తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు. ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది. రాను రాను అతనికి మరణ భయం పెరిగింది. యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి. పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.

ఒకనాడు భర్త భయాందోళనలతో సొమ్మసిల్లి పడిపోయాడు. కదలికలేని భర్తపై బడి తల్లీ! మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్. అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు. నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు . ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది. లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు. తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి. అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు . అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది. నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది. ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.
ఉద్యాపన: కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి. ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి.
Read More

Thursday, 11 July 2013

శమీ గౌరీ వ్రతము 13 07 2013

శమీ గౌరీ వ్రతము 13 07 2013
దంపతుల మధ్య అన్యోన్యతకు ప్రేమ అనురాగములు వృద్ది కలుగుటకు ఆషాఢ శుక్ల పంచమి నాడు శమీ గౌరీ వ్రతమును అనుష్టించ వలెను. ఈ రోజు శమీ వృక్షము క్రింద పార్వతి పరమేశ్వరుల పటము పెట్టి షోడశోపచార ఉపచారములతో పూజించి శమీ వృక్షమును ౨౧ ఇరువదిఒక్క మార్లు ప్రదక్షిణము చేసిన దంపతుల మధ్య అన్యోన్యత ప్రేమ అనురాగములు వృద్ది పొంది సుఖ సంతోషములతో వుందురు. శమీ వ్రుక్షమువద్దకు వెళ్లి పూజించ లేని వారు శమీ కొమ్మను ఇంటికి తీసుకొనివచ్చి పార్వతి పరమేశ్వరులను పుజించినాను అదేఫితము పొంద గలరు పుజకు శమీ పత్రములను కుడా వాడవచ్చును
Read More

Thursday, 4 July 2013

వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం
మహిళలకు మంగళప్రదమైందీ, శుభదాయకమైందీ ఈ వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ముత్తయిదువులందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీదేవి, స్త్రీలకు సకలసంపదలూ ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

శ్రావణమాసంలోని శుభశుక్రవారం నాటి వరలక్ష్మివ్రతం తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ప్రతిబింబించే పర్వదినం. భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన వరలక్ష్మిదేవిని మనం వరాలు కోరుకోవాలంటే ముందుగా ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఈ వ్రతం చేస్తారు.

వరలక్ష్మి వ్రతంరోజున మహిళలు తెల్లవారే నిద్రలేచి ఇళ్ళు , వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలంకరించాలి. గడపలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరుచుకోవాలి.ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు , మామిడి తోరణాలతో అలంకరించాలి.మండపానికి పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి.

మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్నిగానీ, విగ్రహాన్నీగానీ వుంచాలి. బంగారు, వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరుచుకోవాలి. కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పరుచుకోవచ్చు.లేదా బంగారు లేక వెండి ముఖాన్నికూడా కలశంపై పెట్టుకోవచ్చు.

మల్లెలు, మొల్లలు, సంపెంగలు , మొగలి పువ్వులతో కలశాన్ని,మండపాన్ని అలంకరించాలి. పలురకాల పువ్వులు,పండ్లు, పసుపు కుంకుమలు-అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.

వరలక్ష్మి వ్రతంనాడు తొమ్మిది రకాల పిండివంటలు చేసి,ఆ దేవికి నైవెద్యం పెట్టాలని పెద్దలు చెపుతారు. తొమ్మిది రకాలు చేయలేని వారు, తమకు చేతనైనన్ని చేసుకోవచ్చు.

కలశం ఏర్పరచిన తరువాత వరలక్ష్మి దేవిని ఆవాహన చేయాలి.

శ్లో!! పద్మాసనే పద్మకరే - సర్వలోకైక పూజితే

నారాయణప్రేమేదేవీ - సుప్రీతాభవసర్వదా

అంటూ వరలక్ష్మిదేవిని ప్రార్ధించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ఆవాహయామి

ఓం శ్రీ వరలక్ష్మీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ గంధం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు. ఆ తరువాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ధూపం ఆఘ్రాపయామి - అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

ఈ విధంగా పూజించిన తరువాత చెప్పుకోవాలి.

వరలక్ష్మి వ్రతకథ

పూర్వం మగధ దేశంలోని కుండినం అనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ వుండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయ విధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవిస్తూండేది. ఆమె వినయ విధేయతలకు మెచ్చిమహాలక్ష్మిదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, వరలక్ష్మివ్రతం ఉపదేశించి, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చెకూరుతాయని చెపుతుంది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మివ్రతం ఆచరించి సకల శుభాలు , సౌభాగ్యాలు పొందుతుంది .

ఈ విధంగా వరలక్ష్మివ్రతం కథ చెప్పుకుంటూ తొమ్మిది దారల నూలు దారాలను పువ్వులతో తొమ్మిది ముడులు వేస్తూ ' తారం ' తయారుచేసుకొని , కుంకుమబొట్టు పెట్టుకుని, చేతిలో కొబ్బరిచిప్ప కట్టుకుని ముత్తయిదువ చేత తారం కట్టించుకోవాలి. ఆ తరువాత దేవికి హారతి ఇచ్చి, పిండి వంటలను బ్రాహ్మణనీకు దానం ఇచ్చి ఉద్యాపనం చేయాలి.

సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, నానబోసిన సెనగలతో బాటు తాంబూలం ఇచ్చి అక్షింతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం పొందాలి. వచ్చిన పేరంటాలు...అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి. ఈ విధంగా చేసినవారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

శ్లో!! కళ్యాణి కమల నిలమే కామతార ప్రదాయిని

మానవత్వం పూజయిష్యామి శుభదే సుస్థిరాభవ !!

కమల నిలయ, కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి
Read More

Saturday, 22 June 2013

వట సావిత్రీ వ్రతం

వట సావిత్రీ వ్రతం
ఈ వ్రతము సుమంగళి స్త్రీలకు చాల ఉత్తమమైన వ్రతము. బీదైన సంపన్నురాలైన వివాహిత కోరుకొనేది తన భర్త అయురరోగ్యములతో వర్దిల్లలనేది మొదటిది. ఈ వ్రతమును సావిత్రి అనుష్టించి తన భర్త సత్యవంతుని యమధర్మరాజుతో పోరాడి జీవిమ్పచేసుకున్న వ్రత విధానం.
జ్యేష్ట మాస పౌర్ణమి నాడు అనగా 23-06-2013 అనుష్టించ వలెను. ఈ రోజు ప్రొద్దుననే తలకు స్నానము చేసి మీ గృహమునకు దగ్గరగా వుండే దేవాలయములో మఱ్ఱి చెట్టుకు ఒక కుండ నీళ్ళు వేరు దగ్గర పోసి మఱ్ఱి చెట్టును మూడు సార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించ వలెను. అప్పుడు చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి
ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.
మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము
మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను
౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే
౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే
౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని
౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే
౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే
౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే
౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని
తర్వాత ఒక కొత్త వెదురు చాటకు పసుపు పూసి కుంకుమ పెట్టి అందులో సౌభాగ్య ద్రవ్యములు పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దం కాటుక సక్త్యానుసారం చీర లేకుంటే రవిక బట్ట తాంబూలం పెట్టి వయోవ్రుద్దురాలైన సుమంగలిని ఆహ్వానించి కాళ్ళకు పసుపు పూసి కుంకుమ పెట్టి వాయనము ఇచ్చి అక్షతలు ఆవిడకు ఇచ్చి దీర్ఘ సుమంగళిగా అస్సేర్వదించమని ప్రార్తించాలి
దీనివల్ల భర్తకు ఎటువంటి అపమృత్యు దోషములు వున్నాను అవి తొలగి మీరు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు
Read More

Monday, 17 June 2013

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి
కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు.

ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రములో వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. నియమాలేంటి ?
మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది.
నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును.
దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.

బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యముగా సమర్పించాలి.

వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనము చేయాలి.

మంగళ వారములు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆ పై వారము జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి ) వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదము పొందాలి

ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీరుసగము పోయాలి.

అమ్మ వారి విగ్రహము (ఉన్నచో ) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయవలెను.

బియ్యం పైన రాగి చెంబు కానీ , ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి.

సాయం కాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన చాలా మంచిది.
Read More

Saturday, 8 June 2013

సంతానం లేని వారికి పరిష్కార మార్గం

గణపతి పురాణంలో పూర్వం కృతవీరుడు అనే ఒక మహారాజు సకల భోగ భాగ్యాలతో,సకల సిరి సంపదలతో మరియు అందమైన భార్యతో సంతోషంగా రాజ్యం ఏలు తుండేవాడు.ఎంత కాలమైన అతనికి సంతానం కలగలేదు.ఎన్ని పూజలు,హోమాలు,యజ్ఞాలు చేసినా ఎన్ని వ్రతాలూ చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సంతానం కలుగలేదు.ఒకనొక రోజు నారదున్ని కలిసి తనకు సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని అడుగుతాడు.
నారదుడు తగిన తరుణోపాయం వెదుకుచు కృత వీరుని పిత్రులోకాలకు వెళ్లి అక్కడ కృతవిరుని తండ్రి,తాత,ముత్తాతలు నరక భాదలు అనుబావిస్తూ ఉండడం చూసి కృత వీరుని తండ్రితో ఇలా అన్నాడు. భూలోకంలో నీ కుమారుడు సంతానం లేక త్రివమైన మనో వేదనను అనుబావిస్తునాడు,నీ కుమారునికి సంతానం కలుగుటకు తగిన తరుణోపాయం తెలపమని నారదుడు అడుగుతాడు.అప్పడు కృత వీరుని తండ్రి నారుదునితో ,నా కుమారున్ని మహాగణపతి యూక్క సంకష్ట్టి వ్రతం చేయమని ,అలా వ్రతం చేస్తే తన కుమారినికి సంతానం కలుగుటే కాక,తనకు,తన తండ్రి ,తాత ముత్తాతలకు నరకలోక భాదలనుండి విముక్తి లబించగలదు అని తెలుపుతాడు.
నారదుడు భూలోకం వెళ్లి కృతవీరునితో శ్రీ మహాగణపతి  యొక్క సంకష్ట్టి వ్రతం చేయమని,ఈ వ్రతం చేయమని నీ తండ్రి తెలిపాడు అని కృతవీరునితో అన్నాడు.అప్పడు కృత వీరుడు ఎంతో సంతోషించి ఈ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలో తెలుపామని నారదుణ్ణి అడుగుతాడు
 ఈ వ్రతం శ్రావణ బహుళ చవితి రోజుగాని మాఘ బహుళ చవితి రోజు మంగళవారం నాడు చంద్రోదయం పూట తలస్నానం చేసీ ఉపవాసం వుండి,సంకల్పం చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం చేసుకొని తిరిగి స్నానం ముగించుకొని  గణపతి ని ప్రాద్దిoచాలి.అదర్వ శీర్షంతో గణపతి ని అభిషేకించాలి .శ్రీ గణపతి మహామంత్రాన్ని జపించాలి.శ్రీ మహా గణపతికి  బెల్లంతో  చేసినా వంటకాలు,లడ్డులు,మోదకలు సమర్పించాలు.ముఖ్యంగా ఈ పూజలో తెల్ల జిల్లేడుతో పూలను,తుమ్మి పూలను పెట్టాలి అలాగే గరికను తప్పని సరిగా పెట్టాలి.గరికను పెట్టక పోతే వ్రతం నిష్పలం అవుతుంది.అని నారదుడు కృతవీరుని తో అన్నాడు.

  కృత వీరుడు ఈలా ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం వరకు జరిపించి, సంతానం పొందాడు అని,అలాగే తన పితృ,తాత,ముత్తతలు నరకం నుంచి తప్పించాడని గణపతి పురాణంలోని ఈ ఒక కధ చెబుతుంది

  ఎలాంటి విఘ్నాలు ఉన్న,చదువు రావాలన్న,సిరి సంపదలు కావాలన్నా ,ఆరోగ్యం కావాలన్నా,ముఖ్యంగా సంతానం కావాలని కోరుకొనే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం ఈ సంకష్ట్టి వ్రతం.
Read More

Monday, 8 April 2013

వరలక్ష్మీ వ్రతం, మరియు విసిస్టత

వరలక్ష్మీ వ్రతం

(Varalakshmi Vratam)

మహిళలకు మంగళప్రదమైందీ, శుభదాయకమైందీ ఈ వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ముత్తయిదువులందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీదేవి, స్త్రీలకు సకలసంపదలూ ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

శ్రావణమాసంలోని శుభశుక్రవారం నాటి వరలక్ష్మివ్రతం తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ప్రతిబింబించే పర్వదినం. భాగ్యదాయిని, సౌభాగ్యదాయిని అయిన వరలక్ష్మిదేవిని మనం వరాలు కోరుకోవాలంటే ముందుగా ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఈ వ్రతం చేస్తారు.

వరలక్ష్మి వ్రతంరోజున మహిళలు తెల్లవారే నిద్రలేచి ఇళ్ళు , వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలతో అలంకరించాలి. గడపలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పరుచుకోవాలి.ఆ మండపాన్ని అరటిపిలకలు, పువ్వులు , మామిడి తోరణాలతో అలంకరించాలి.మండపానికి పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి.

మండపంలో వెనుకవైపుగా లక్ష్మీదేవి చిత్రపటాన్నిగానీ, విగ్రహాన్నీగానీ వుంచాలి. బంగారు, వెండి లేదా ఇతర లోహపు చెంబును శుభ్రంగా తోమి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీనిపై కలశం ఏర్పరుచుకోవాలి. కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టి, కొత్త రవిక గుడ్డ కప్పి కలశం ఏర్పరుచుకోవచ్చు.లేదా బంగారు లేక వెండి ముఖాన్నికూడా కలశంపై పెట్టుకోవచ్చు.

మల్లెలు, మొల్లలు, సంపెంగలు , మొగలి పువ్వులతో కలశాన్ని,మండపాన్ని అలంకరించాలి. పలురకాల పువ్వులు,పండ్లు, పసుపు కుంకుమలు-అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.

వరలక్ష్మి వ్రతంనాడు తొమ్మిది రకాల పిండివంటలు చేసి,ఆ దేవికి నైవెద్యం పెట్టాలని పెద్దలు చెపుతారు. తొమ్మిది రకాలు చేయలేని వారు, తమకు చేతనైనన్ని చేసుకోవచ్చు.

కలశం ఏర్పరచిన తరువాత వరలక్ష్మి దేవిని ఆవాహన చేయాలి.

శ్లో!! పద్మాసనే పద్మకరే - సర్వలోకైక పూజితే

నారాయణప్రేమేదేవీ - సుప్రీతాభవసర్వదా

అంటూ వరలక్ష్మిదేవిని ప్రార్ధించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ఆవాహయామి

ఓం శ్రీ వరలక్ష్మీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ గంధం సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ వరలక్ష్మీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు. ఆ తరువాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి.

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ధూపం ఆఘ్రాపయామి - అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ వరలక్ష్మీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

ఈ విధంగా పూజించిన తరువాత చెప్పుకోవాలి.

వరలక్ష్మి వ్రతకథ

పూర్వం మగధ దేశంలోని కుండినం అనే పట్టణంలో చారుమతి అనే మహాసాధ్వి అయిన బ్రాహ్మణ స్త్రీ వుండేది. ఆమె సత్ప్రవర్తన కలిగి, వినయ విధేయతలతో భర్తను, అత్తమామలను సేవిస్తూ జీవిస్తూండేది. ఆమె వినయ విధేయతలకు మెచ్చిమహాలక్ష్మిదేవి ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, వరలక్ష్మివ్రతం ఉపదేశించి, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు చెకూరుతాయని చెపుతుంది. ఆ ప్రకారం చారుమతి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మివ్రతం ఆచరించి సకల శుభాలు , సౌభాగ్యాలు పొందుతుంది .

ఈ విధంగా వరలక్ష్మివ్రతం కథ చెప్పుకుంటూ తొమ్మిది దారల నూలు దారాలను పువ్వులతో తొమ్మిది ముడులు వేస్తూ ' తారం ' తయారుచేసుకొని , కుంకుమబొట్టు పెట్టుకుని, చేతిలో కొబ్బరిచిప్ప కట్టుకుని ముత్తయిదువ చేత తారం కట్టించుకోవాలి. ఆ తరువాత దేవికి హారతి ఇచ్చి, పిండి వంటలను బ్రాహ్మణనీకు దానం ఇచ్చి ఉద్యాపనం చేయాలి.

సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, నానబోసిన సెనగలతో బాటు తాంబూలం ఇచ్చి అక్షింతలు ఇచ్చి నమస్కరించి ఆశీర్వాదం పొందాలి. వచ్చిన పేరంటాలు...అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి. ఈ విధంగా చేసినవారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

శ్లో!! కళ్యాణి కమల నిలమే కామతార ప్రదాయిని

మానవత్వం పూజయిష్యామి శుభదే సుస్థిరాభవ !!

కమల నిలయ, కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి.

శ్రావణమాసం నోముల్లో అనేక అర్ధాలు, పరమార్ధాలు వున్నాయి. పసుపు కుంకుమలు శుభప్రదాలేగాక ఆరోగ్యదాయకాలు కూడా. పసువు పవిత్రతకూ , శుభానికి చిహ్నం. పసువు అందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంపొందింపజేస్తుంది . పసుపులో క్రిమిసంహారక లక్షణాలు, ఔషద గుణాలు పుష్కలంగావున్నాయి.

శ్రావణమాసంలో వర్షాలు ఎక్కువగా వుంటాయి. వర్షపు నీటిలో తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల, స్త్రీల పాదాలకు ఫంగల్ ఇన్ ఫెక్షన్ సోకే అవకాశం వుంది. కాబట్టి పాదాలకు పసుపురాసుకుంటే ఫంగస్ ను నిర్మూలిస్తుంది. ముఖానికి పసువు రాసుకోవడం వల్ల ముఖానికి ఛాయ పెరుగుతుంది. మొటిమలు, పొక్కులు పోతాయి.

శ్రావణమాసంలో నోములు నోచుకునే వారు, నానబోసిన సెనగలను...ఇరుగు పొరుగువారికి, పిల్లలకు, పేరంటాలకు పంచుతారు. మొలకెత్తే సెనగల్లో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. వీటిలో " విటమిన్ - ఎ ", “ విటమిన్ -బి కాంప్లేక్స్", “ విటమిన్ - సి ", “ విటమిన్ - ఇ " వుంటాయి. ఈ విధంగా శ్రావణమాసం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది.....

Read More

అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్ప స్వామి దీక్ష


మానవ జన్మకి పరమార్ధం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డుతగిలితే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాన్ని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

మాల ధరించుట

భక్తులు కార్తీక మాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

స్వామియందు నిశ్చలమైన భక్తిభావములు కలిగి, శబరిమలకు 3, 4 సార్లు వెళ్ళొచ్చి, బ్రహ్మచర్య వ్రతమును పాటించేవారిని గురుస్వామిగా ఎన్నుకొని, వారిచేత మాలను ధరించాలి.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలాధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువ కూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.

నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.

దీక్షావిధి

దీక్ష తీసుకోదలచినవారు ముందుగా గురుస్వాముల ద్వారా ముద్రమాల ధారణ చేయించుకోవాలి.
ఇందుకు సామాగ్రి: నల్లరంగు లుంగీలు, నల్లరంగు చొక్కాలు, నల్లరంగు తువ్వాళ్లు, ఇంకా అవసరమైన బనీనులు, డ్రాయర్లు వంటివి కూడా రెండురెండు చొప్పున తీసుకోవాలి. నల్లని దుప్పటి ఒకటి తీసుకోవాలి. దీక్షాకాలం 41రోజులు ఈ వస్త్రాలనే వినియోగించాలి.
తులసిమాల, రుద్రాక్షమాల, గంధంమాల, తామరగింజలమాల, స్ఫటికముల మాల. వీటిలో మీకు నచ్చిన రెండు మాలలు మరియు అయ్యప్పస్వామి ముద్ర (డాలరు) తీసుకోవాలి.
పై సామాగ్రితో బాటు ఒక కొబ్బరికాయ, 6 అరటిపండ్లు, 100గ్రాముల నువు్వలనూనె, అగరువత్తులు, ఒక గంధపు పొడి డబ్బా, వీభూతి పొడి, కొద్దిగా కుంకుమ, కొన్ని పువు్వలు, కొద్దిగా జీడిపప్పు, కిస్‌మిస్‌, పంచదార, కర్పూరం.
పైన చెప్పిన సామాన్లు తీసుకొని గురుస్వాముల వద్దకు వెళ్ళి "దీక్షామాల'' వేయవలసినదిగా ప్రార్ధించగా వారు తెల్లవారుజామున మీరు శిరస్నానం చేసిన తర్వాత, మీరు తెచ్చిన సామాగ్రితో అయ్యప్పస్వామికి పూజచేసి, ముద్రమాలను మీ మెడలో వేసి దీక్షను ప్రారంభిస్తారు.

దీక్షలో పాటించవలసిన నియమాలు

ప్రతిరోజూ ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సంధ్యలలో తప్పనిసరిగా చన్నీటితో శిరస్నానం చేయాలి.
అప్పటివరకూ కట్టి విడిచిన బట్టలను తామే తడిపి ఆరేసి రెండవ జత పొడి దుస్తులను ధరించాలి.
విభూతి దానిపై గంధము, కుంకుమ-దీక్షా తిలకంగా దిద్దుకోవాలి.
దేవాలయంలోగానీ, పూజగదిలోగానీ దీపం వెలిగించి శరణు ఘోషలు చేయవలెను.
ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, అయ్యప్పస్వామికి హారతులిచ్చి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. శక్తిమేరకు సాత్వికమైన అల్పాహారం తీసుకోవాలి. అంతటితో ఉదయం కార్యక్రమం పూర్తవుతుంది.
మధ్యాహ్నం చన్నీటి స్నానం చేసి, స్వామికి శరణుఘోషలు చెప్పి, సాత్విక ఆహారాన్ని భుజించాలి.
సాయంసంధ్యలో కూడా చన్నీటి స్నానమాచరించి, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, భజనలు చేసి అల్పాహారమునే స్వీకరించాలి.
వెల్లుల్లి, నీరుల్లి, మద్యపానం, తాంబూలం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.
దీక్షలో ఉన్నంతకాలం కటిక నేల మీదనే పడుకోవాలి.
బహిష్ఠులైన స్త్రీలను చూడడం, వారితో మాట్లాడడం చేయకూడదు. స్త్రీలతో లైంగిక సంబంధాలు కూడదు.
పాదరక్షలు ధరించకూడదు. అసభ్యకర సంభాషణ, కోపం అసలు పనికిరావు.
ప్రతిరోజు మూడు పూటలూ శరణు ఘోష చేయవలెను.

పూజాద్రవ్యములు
స్వామి రూపముతో కూడిన తులసిపూసల మాల, తామరపూల దండ, దీపస్తంభాలు, సాంబ్రాణీ కడ్డీలు, కలశపాత్ర, అక్షింతలు, విడిపూలు, ఒక మూల పూలదండ, ఆవుపాలు, పన్నీరు, మంచినూనె, రెండు టెంకాయలు, రెండు కిలోల బియ్యం, పంచపాత్ర, ఉద్ధరిణి, నలుపు లేక కాషాయ వస్త్రాలు.

పూజా విధానము
శ్రీ అయ్యప్ప పటమునకు ముందు ఒక దీపస్తంభం, పటమునకెదురుగా మరొక దీపస్తంభం, అరటి ఆకుపై బియ్యం పోసి దానిమీద ఒక దీపస్తంభం ఉంచవలెను. నాలుగు వైపుల 4 తమలపాకులు రెండేసి వక్కలు, ఒక టెంకాయను వుంచవలెను. మాలను ధరించువారు స్నానం చేసి, నీలవస్త్రమును ధరించి, తమ తల్లిదండ్రులకు నమస్కరించి, జగద్గురువుకు మొక్కి, అయ్యప్పను మనసార స్మరించి, ఆచారప్రకారం విబూదిని ధరించి గురువుకు నమస్కరించి మాలను ధరింప సిద్ధముగా ఉండవలెను.

ఇంటివద్ద పూజలు
తమ ఇళ్ల వద్ద పూజలు జరిపించదలుచుకున్న స్వాములు అయ్యప్ప పటములను ఉంచి పూజించవచ్చు. అష్టోత్తర పూజలు, భజనలు, లింగాష్టకం, ఉయ్యాలపాట మొదలగువాటిని 18 ప్రమిదలతో కర్పూర హారతి వెలిగించి ఇవ్వాలి. ఇంటికొచ్చిన స్వాములకు పాద నమస్కారములు చేసి వారికి సగౌరవంగా ఫలహారములు ఏర్పాటు చేయవలెను. ఈ విధంగా పూజలు నిర్వర్తించుకుని - స్వామి దర్శనమునకై ఇరుముడితో సన్నిధికి యాత్ర చేయవలెను.

ఇరుముడి సామాన్లు

రెండు అరలతో కూడిన ఒక పెద్దసంచి
రెండు చిన్న సంచులు, ఒక దుప్పటి
8 కొబ్బరికాయలు, ఒక కిలో బియ్యం, 6 అరటిపండ్లు, కర్పూరం, అగరువత్తులు, ప్యాకెట్‌చందనం, ఒక తేనె సీసా, ఒక జాకెట్‌గుడ్డ.
పసుపు, కుంకుమ, కిస్‌మిస్‌, జీడిపప్పు, పటిక, పంచదార, అటుకులు, పేలాలు, మిరియాలు, అప్పడం, రోజ్‌వాటర్‌, తమలపాకులు, వక్కలు మొదలగునవి.

శబరిమాల యాత్రా మార్గములు కొట్టాయం వరకూ రైలులో వెళ్లిన తర్వాత అక్కడ నుంచి 86 కి.మీ దూరంలో వున్న ఎరుమేలి, పంబలకు బస్సులోగానీ, కారులోగానీ వెళ్లవలెను. `పంపా' నదిలో స్నానం చేసిన పిదప శబరిమలైలోని స్వామి సన్నిధికి కాలినడకన వెళ్లవలెను.

దీక్షా విరమణ
నియమ నిష్ఠలతో శబరిమల యాత్ర పూర్తయ్యాక మాల విసర్జన చేయవలెను.

Read More

Saturday, 15 December 2012

శ్రీ మార్గశిర మహా లక్ష్మీ వ్రతము




శ్రీ మార్గశిర మహా లక్ష్మీ వ్రతము
విఘ్నేశ్వర ప్రార్ధన

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణంచతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నో పశాంతయే ||

ఆచమ్య || ఓం భూర్భువః సువరోమ్, మమ ఉపాత్త సమస్త దుర తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, శుభాభ్యాంశుభే, శోభ నేముహూర్తే, అద్య బ్రహ్మణః ద్వీతీయ పర్దార్దే, శ్వేతవరాహల్పే, వైవ స్వత మన్వంతరే, కలియుగే ప్రధ మపాదే, జంబూ ద్పీపే, భరత వర్షే, భరత ఖండే, అస్మిన్ వర్త మాన, వ్యవ హారిక చాంద్ర మాన, సంవత్సరే, ఆయనే బుతౌ, పక్షౌ, తిధౌ, శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ, ఏనం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిధౌ శ్రీమతి ( పేరు) గోత్ర స్యనామ ధోయస్య అస్మాకం సుకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారో గ్యైశ్వర్యాభి వృద్ద్యర్ధం ధర్మార్ద కామ మోక్ష చతుర్విధ ఫలపురుశార్ధ సిద్యర్ధం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్ధం వారే వారే ప్రయుక్త గురువారే లక్ష్మి ముద్దశ్య లక్ష్మీ ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశో పచార పూజాం కరిష్యే, శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం సిద్ధి వినాయక పూజాం కరిష్యే ||
విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రితాః, మోలే త్రత స్థితో బ్రహ్మా, మధ్యే మాతృ గణాస్మ్రతాః, కుక్షౌతు సాగరా స్సర్వెస్సప్త ద్వీపా సుంధరాః(కలశ పూజచేసి) మహాలక్ష్మీ ప్రాణ ప్రతిష్టాపనం, కరిష్యే (లక్ష్మీదేవి ప్రాణ ప్రతిష్టాపన జేసి పూజ ఆరంభించ వలెను)

శ్రీ మహాలక్ష్మి పూజా ప్రారంభం
శ్లో || పద్మా సనే పద్మకరే సర్వ లోకైక పూజితా
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా
క్షీరో దార్ణ వసంభూతే కమలే కమలాలయే
సుస్థి రాభ వమే గేహే సురాసుర నమస్క్రతే ||
శ్రీ లక్ష్మీ దేవతాం ధ్యాయామితా||
పద్మాసన మందు కూర్చున్నగానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు సర్పజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహ మందు శాశ్వతముగా ఉండుము (అని మనసులో ధ్యానించివలెను)

శ్లో || సర్వమంగళ మాజ్గల్యే విష్ణువక్ష సధ లాలయే,
ఆవాహయామి దేవీత్యాం సుప్రీతా భవ సర్వదా,
శ్రీ లక్ష్మి దేవతా మవాహయామి.
తా || సకల శుభ కార్య ములందు విఘ్నములు లేకుండా శుభములు కలుగ జేయు దానా! విష్ణువక్ష స్థలమందు నివసించు ఓ లక్ష్మీ దేవీ! నిన్ను ఆవాహన చేయుచున్నాను.గాన, నా మీద దయకలిగి ఉండ వేడెదను.

శ్లో || సూర్యాయుత నిభస్పూర్తే స్పురద్రత్న విభూషితే
సంహా సన మిదం దేవీ స్వీయతాం సుర పూజితే
శ్రీ లక్ష్మి దేవతాయై నమః రత్నసింహీసనం సమర్పయామి.

తా|| సూర్యా కాంతివలె ప్రకాశించు దానా! నానారత్న ములతో పొదగ బడి ధగ ధగ మెరయుచున్న బంగారు ఆసన మిది గో వెస్తున్నాను. సర్వలోక వాసులచే పూజింపబడే లక్ష్మీ దేవీ! దయచేసి ఇంగు కూర్చోనుము.

శ్లో || శుద్దోద కంచ వాత్ర స్థంగన్ద పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
తా || ఓ లక్ష్మీ దేవీ ! పరిశుభ్ర మైన జలముతో గంధం పుష్పములు, సువాసన ద్రవ్యములు కలిపనీకు అర్ఘ్యం నిచ్చుచున్నాను. నన్ననుగ్రహించుము.

శ్లో || సువాసిత జలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం,
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి.
తా || దేవత లందరి చేతను కీర్తింప బడిన దానా! అన్ని నదులనుండి గొన వచ్చిన సుగంధ ఉద కంతో నీకు పాద్యం యిచ్చుచున్నాను. అందుకొనుము.

శ్లో || సువర్ణ కలశానీ తం చంద నాగరు సంయుతం
గృహేణాచ మనం దేవీ మయాదత్తం శుభ ప్రదే,
శ్రీలక్ష్మీ దేవతాయై నమః ఆచ మనీయం సమర్పయామి
తా|| సకల శుభములు కలుగ జేయుదానా! బంగారు గిన్నెలో సుగంధ ద్రవ్యములు కూర్చి ఆచ మనీయము సమర్పించు చున్నాను స్వీకరింపుము.

శ్లో || పయోదధి ఘ్రతో పేతర శర్కరా మధు సంయుతం
పంచా మృత స్నాన మిదం గృహాణీ కమలాలయే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పంచా మృత స్నానం సమర్పయామి.
తా|| శ్రీ లక్ష్మీ దేవి! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారా కలిపి పంచామృత ముతో నిన్ను స్నానము చెయించుచున్నాను. నస్ననుగ్రహింపుము.


శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరః స్థితః
శుద్దో దక స్నాన మిదం గృహాణ విధు సోదరీ,
శ్రీ లక్ష్మీ దేవతాయైనమః స్నానం సమర్పయామి.
శ్రీ లక్ష్మీ దేవతాయైనమః శుద్దో దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
తా|| పాల సముద్ర మున పుట్టిన ఓ లక్ష్మీ దేవీ! నీవు స్నానము చేయుటకు శంకరుని తలనుండి వచ్చిన గంగాజలమును తెచ్చినాను. ఈ పవిత్ర జలముతో స్నానము చేయుము.

శ్లో || సురార్చి తాంఘ్రిగ యుగళే దూకూలవ సన ప్రియే
వస్త్ర యుగ్మం ప్రదాస్వామి గృహణ హరివల్ల భె
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి
తా|| సుర లచే సదా పూజింపబడు సుకుమార పాదముల గలదాన! తెల్లని పట్టుచీర కట్టుకున్న ఓ దేవి! నీకు పట్టుబట్టలు కట్ట బెట్టెదను స్వీకరింపుము.

శ్లో || కేయూర కంకణైర్ధ వ్యైర్షార నూపుర మేఖలాః
విభూషణానద్య మూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః ఆభరణాని సమర్పయామి.
తా|| మునీశ్వరు లందరిచేత వ్రళంసించబడిన ఓ లక్ష్మీ నీకు బంగారు కడియాలు, వంకీలు, అందెలు, దండలు సకలా భరణములు ఇచ్చుచున్నాను. వీటి నిధరింపుడు.

శ్లో || హేతప్త మకృతం దేవీ బ్రహ్మవిష్ణు శివకృతం
ఉపవీత మిదం గృహాణత్వం శుభ ప్రదే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి.
తా || ఓ దేవీ! బంగార పుత్రాడుతో ముత్యాలు గ్రుచ్చిన ఈ యజ్జో పవీతమును ధరింపుము.

శ్లో || కర్పూరాగ రుక స్తూరీ రోచ నాది భిరన్వితం,
గగ ధందాస్యామ్య వాందేవీ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః గంధాన్దార యామి.
తా || ఓం సింధు పుత్రికా! కర్పూరము, అగరు, కస్తూరీ వంటి సువాసున వస్తువులు కలిపినా ఈ గంధము స్వీకరింపుము.

శ్లో || అక్ష తాన్ ధవళాన్ ది వ్యాన్ శాలీ యంస్తండులాన్ శుభాన్
హరిద్రా కుంకు మోసేతాన్ గృహాయాబ్ది సుపుత్రికే
శ్రీ లక్ష్మీ దేవతా యైనమః అక్ష తాన్ సమర్పయామి,
తా || క్షీ రాబ్ధి పుత్రికా! పసుపు, కుంకుమ కలిపిన అక్ష తలము సమర్పించు చున్నాను స్వీకరించుము.

శ్లో || మల్లికా జాజికుసు మైశ్చంపకైర్వకుల్తే రపి,
శత పత్రైశ్చజకల్షారై: పూజయామి నారి ప్రియే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి పూజయామి.
తా|| ఓనారాయణ ప్రియే! మల్లెలు, మొల్లలు, జాజి, సంపెంగ, తామర, కలువ పూలతో నిన్ను భక్తి శ్రద్దలతో పూజించుచున్నాను. ఈ పూజను గైకొని ఆనందించుము.

మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః ఓం మహాలక్ష్మి దేవ్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
మహాలక్ష్మీ పూజా కల్ప లక్ష్మి అష్టోత్తర శత నామావళి : సంపూర్ణం
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

శ్రీ మహాలక్ష్మీ వ్రతము దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం, ధూపం గాస్యామితే దేవి శ్రీ లక్ష్మీ గృహాణత్వం, ధూపం సమర్పయామి ఘ్రతాన్త వర్తి సంయుక్త మంధ కార వినాశకం, దీపం దాస్యామితే దేవి గృహాణ ముది తాభవ, దీపం సమర్పయామి. నైవేద్యం షడ్ర సోపేతం దధ మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలో పేతం గృహాణ హరి వల్లభె, నైవేద్యం సమర్పయామి. మన సార సుగంధే నమిశ్రితం పుష్పవాసితం, పానీ యంగృ హ్యతాం దేవీ శీతలం సుమనో హరం, పానీయం సమర్పయామి, పూగీ ఫల సమాయుక్తం, నాగ వల్లి దలైర్యుతం, కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి, నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణు వల్లభే, నీరాజనం సమర్పయామి. పద్మాసనే పద్మకరె సర్పలో కైక పూజితే, నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా,
మంత్ర పుష్పం సమర్పయామి. యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే, ప్రదక్షిణం సమర్పయామి. నమస్తే లోక జననీ నమేస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే శ్రీలక్ష్మీ నమో నమః శ్రీ లక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి. కమలాయై నమః ప్రధమ గ్రంధ పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంధం పూజయామి. లోక మాత్రే నమః తృతీయ గ్రంధర పూజయామి, విశ్వజన న్యైనమః షష్టమ గ్రంధం పూజయామి, హరి వల్లబాయై నమః నవమ గ్రంధం పూజయామి తొర బందన మంత్రః || బధ్నామిద క్షీణ హస్తే నమ సూత్రం శుభప్రదం. పుత్ర పౌత్రాభి వృద్దంచ సౌభాగ్యం దేహిమేరమే|| ఈ మంత్రము పటనము చేయుచు తోరము కట్టుకోవలసింది || వాయస విధః|| ఏనం పూజ్య కళ్యాణీం లక్ష్మీం స్వశక్తతః దాతవ్యం ద్వాద శారూపం వాయనం హిద్విజాలయే. వాయన దాన మంత్రం ఇందిరా ప్రతి గృహ్నతు ఇందిరా వైద ధాతిచ, ఇందిరా తార కోభాభ్యా మింది రాయై నమోనమః" పూజా విధానము సంపూర్ణము లక్ష్మీ పురాణము కధా ప్రారంభము పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచార మునకు బయలు దేరినారు. వారట్లు భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు, ఆసమయంలో ఆగ్రామవాసులు బ్రాహ్మణ వైశ్యక్ష
త్రియ శూద్ర జాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంలో అలికి లక్ష్మీ దేవి పాదములు ముగ్గులు పెట్టిరి. స్త్రీలంద రూతలంటు స్నానములు చేసి క్రొత్త బట్టలు ధరించి మహాలక్ష్మి పూజచేయు చుండిరి. ఆరోజు గురువార మగుటచే అన్ని జాతులవారు కడు నిష్టతో లక్ష్మీదేవిని గానంచేయుచు పూజలు చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్దలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునిశతో " మహర్షి ! బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తున్నారు కదా మీరు చేస్తున్న వ్రత మేది? వివరించ కోరుచున్నాను" అని పలుకగా పరాశముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగిరి. " నారద! యీ దినము గురువారము గదా! గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అనెదరు. సంవత్సరంలోని పన్నెండు మాసములలో మార్గశిర మాసం శ్రేష్ట మైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మివారం(గురువారం) లక్ష్మీ దేవికీ చాల యిష్ట మైన రోజు. శుక్ల పక్ష దశమీ గురువారం అయిన యెడల ఆ దినము సుద శావ్రత మనెదరు. ఈ వ్రతం శ్రీమహాలక్ష్మీ దేవికి మిక్కిలి ఇష్టమైనది." అని పరాశరముని బోధంపగా- బ్రాహ్మ మానస పుత్రుడగు నారదుడది ఆలకించి " మహనీయా! మున్నుయూ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలములు పొంది నారు! ఆ చరిత్రముకూడ వివరింపు " డని వేడగా పరాశరుడిట్లు చెప్పదొడంగెను. " నారదా, నీవ దృష్ట మంతుడవు. పూర్వంయీ లక్ష్మీవ్రత మాచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియజేయుదును శ్రద్దగా ఆలకించి ఆనందింపుము" అని చెప్పసాగేను.
ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు సేవలు చేస్తు నాధా! యీదినం నా వ్రతం ఆచరించు గురువారం గాన మీరు ఆజ్ఞ యిచ్చినచో నగరంలో సంచ రించి వత్తును " అని ప్రార్దంచెను. లక్ష్మీ కోర్కెను మన్నించి విష్ణువు ముసలి అటులే పోయిరమ్మనెను.లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ స్త్రీరూపం ధరించి ఒక యింటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో " ఓ అవ్వా! ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రతదినము కదా! ఇల్లు గోమయముతో అలికి ముగ్గులు పెట్టలేదేమి? అని ప్రశ్నించెను. అంత ఆ యవ్వ " అమ్మా! ఆ వ్రతము ఎట్లు చేయవలెను. ఎవరిని పూజ చేయవలెను? వివరించుతల్లి! అని అనగా, లక్ష్మిదేవి మంద హాసముతో " అవ్వా! వ్రతం చేసేవి ధానము చెప్పెదను వినుము. మార్గశిర మాసములో మొదటి లక్ష్మీవారము అనగా గురువారమునాడు ప్రాతః కాలమునే నిద్రలేచి గోమయంతో ఇల్లూ వాకిలీ అలికి లక్ష్మిదేవి పాదములు గల ముగ్గులు పెట్ట వలయును, క్రొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండ బెట్ట వలెను దానిని వివిధ రకాల బొమ్మల తోను, ముగ్గుల తోను వస్త్రములు కట్టుకొని శుచిగావుండి ఒక బల్ల కడిగి, దానిమీద క్రొత్త ధాన్యము ( ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి ) కొద్దగా వేయవలెను. మరి కొంచెము క్రొత్త కొలత పాత్రలో వేయవలెను. ఆ పాత్ర పైన మూడు పోక చెక్కలు పసుపు నీటితో కడిగి వుంచవలెను. తెల్ల ధాన్యము ఈ నెలు తీసుకొనివచ్చివాటిని జడ వలె అల్లి మనసులోని కోరిక తలచుకొని వాటిని జటవలె వుంచాలి దాని పై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు వుంచవలెను. లక్ష్మీదేవిని తలచుకొని పువ్వులు, గంధము, ధూప దీపములు సమర్పించవలెను. మొట్ట మొదట పాలు నైవేద్యముచేసి, అన్నము పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టవలెను. ఇది ఒక పద్దతి ఇక రెండొ పద్ధతి సుద శావ్రతము. అదెట్లు అనగా మార్గ శిర మాసంలోని శుక్ల దశమీ గురువారమునాడు యీ వ్రతమును చేయవలెను. ఆ దినము ఉదయమున నిద్ర లేచి గోమయమంతో యిల్లు అలికి, వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు లక్ష్మీదేవి పాదములాంటి ముగ్గులు పెట్ట వలెను. తదుపరి స్నానము చేసి ఆసనమును శుభ్రము చేసి ముగ్గులు గీసి, ఇంటిలో తూర్పు దిశగావుంచి, లక్ష్మీదేవి పూజ నిమిత్తము పోక చెక్కను పసుపు నీళ్ళతో శుభ్రముగా కడిగి దానిని పంచామృతముతోను, శుద్దోదకముతొను, స్నానము చేయించి, ఆసనము పై వుంచి గంధము వ్రాసి, పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ పది ముళ్ళు వేయవలెను. ఐది నాడులు గల దర్భ గడ్జిలో దానిని కప్పవలెను. లక్ష్మీ చిత్రమును వ్రతడోరియాలు వుంచి ధూపం వేయవలెను. తరువాత నైవెద్యం నిమిత్తం వండిన పదార్ధ ములన్నిటినీ సమర్పించవలెను. ముఖ్యముగా పచ్చిబియ్యంకొంత నాన బెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయవలెను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్ధాలు అన్నీ పది రకముల వరకూ వుంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలెను. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచవలెను. అట్లు పంచని యెడల వారికి లక్ష్మీ కటాక్షము లేక సిరి కలుగదు . గురువారమునాడు నూనెతో వంటను గాని, పిండి వంటలుగాని చేయ కూడదు. గురువారము పూజచేయు వారాలు చేప - మాంసం తినకూడదు. తలకు నూనే వ్రాసుకో కూడదు అంతియేకాదు. ప్రత్తితో ఒత్తులు చేసినా, ఆనపకాయ గాని - నీచు కూరలుగాని తినినా మంచం పై పండుకొనినా, రాత్రులు పెరుగన్నం తినినా లక్ష్మీ ఇంటనుండదు ఇంగా దరిద్రులగుదురు. గురువారము నాడు, ప్రాతః కాలమున లేచి, పొయ్యిలోని కాలిన బూడిద తీయక పోయినా, వీధీ వాకిలి తుడవక పోయినా, యింట లక్ష్మి నిలవదు. గురువారము నాడు ఏ స్త్రీ శుచియైన తెల్లని వస్త్రము కట్టుకొనునో వారి యింట లక్ష్మి ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారము నాడు పిల్లలను తిట్టుట కొట్టుట చెయునో ఇల్లు వాకిలి శుభ్రము చేయదే, వంట సామానులు అంట్లుతో మదో సాయం సమయమున గుమ్మము దగ్గర సంధ్యదీపము వుంచదో ఆ స్త్రీ యింట ఒక్కక్షణ మైనను లక్ష్మీ వుండక పోగా ధన హాని సంతాన హాని కలుగ జేయును. అటులనే గురువారం రోజున ఉడకని పదార్ధములు తినుట అమిత నిద్ర, అమావాస్యా సంక్రాంతి తిధులలో అశుభ్రముగావుండి విహరించుట అత్త మామలను సేవింపక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీలయింట లక్ష్మీదేవీ పాదము నిలవదు. ఇంకను భోజన మునకు ముందూ తరువాతా కాళ్ళు చేతులు ముఖమూ ఏ స్త్రీ కడుగు కొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడు నప్పుడు చీటికి మాటికీ నవ్వు చుండునో, ఏ స్త్రీ బూడిద గుమ్మడి కాయను కొయునో అలాంటి స్త్రీలు నీచ బుద్ది గలవారలై అన్న వస్త్రములకు దూరమై పోదురు. ఏ వనిత గురువారము నాడు ధర్మములు చేయక పూజలు చేయక పురుష సాంగత్యమునే సదా కోరునో ఆమె పాప కుపమునకు పోవుటయేగాక బ్రతికి నన్ని రోజులూ తిండికి మొఖము వాయును. గురువారము అమావాస్య- సంక్రాంతి తీధీ యందు నిషిద్ద పదార్ధములను ఏ స్త్రీ భుజించునో ఆమె అవసాన గాలమున అనెక బాధలు పడి చనిపోయిన తర్వాత యమ కింకరులతో నానా బాధలు పడును. జ్ఞానవంతు లైన స్త్రీ ఆ మూడు దినమునతో భక్తిలో దైవ సేవలు ఒక పూట భోజమును, కలిగి నంత లో దాన ధర్మములు చేసిన యెడల అట్టి నారీ మణికి ధన ధాన్యములు కలుగుటయేగాక పుత్ర సంతానము, సంతానాభి వృద్ది కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్య కృత్యములను బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముఖము కడుగు కొనవలెను. అట్లు కడుగు కొనిన స్త్రీ ముఖము చూచినను పాత కములు కలుగుటయే గాక, ఏ కార్యము తలపెట్టినను జయము కలుగదు. స్త్రీ భుజించునప్పుడు దక్షిణం వైపు ముఖము పెట్టుకొని ఏ పదార్ద మూ భజుంచ కూడదు. దీపము లేని చీకటి ఇంట భుజించ కూడదు. చీకటి పడిన తరువాత నూనె వ్రాసుకొనుట చేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడం - భర్త ఆజ్ఞ లేనిదే తనే యిష్ట మొచ్చినట్లు తిరగడం - భర్త మాటలు వినక ఎదురు చెప్పడం - దైవ కార్యములందు, దేవ బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసము లేక యుండుట చేయనో, దాన ధర్మములు చేయదో - అట్టి వనిత గృహము రుద్ర భూమితో సమానము గానెంచి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త అనుజ్ఞ ప్రకారం నడుచు కొనవలెను. అతిధి సత్కరములు జరుపుచు అత్త మామల సేవలు విడువకుండ ఆచరించుచు, తన బిడ్డా అనే వివక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించ వలెను. భర్త సుఖమే తన సుఖమని భర్త కష్టమే తన కష్టమనే భావముతో మెలగినచె లక్ష్మిదేవి సంతోషించి కలకాలము ఆ యింట నుండ గలదు. నారదా! ఈవిధంగా మహాలక్ష్మీ ఆ వృద్ద బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతము ఆచరించి విధానము చెప్పి, ప్రతివీధికి ప్రతియింటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడ నిదుర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరిబోసుకొని వంటి మీద సట్ట సరిగాలేక గుర్రుపెట్టి నిద్ర పోతున్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూచి అసహ్యించుకొని ఒక మాలపల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూలా ఒకానొక బీద హరి జన స్త్రీ ఉండెను. ఆమె ప్రతి దినము ప్రాతః కాలము లేచి గోమయము తెచ్చి యిల్లు వాకిలి శుభ్రము చేసుకొని, బియ్యపు పిండితో మగ్గులు పెట్టి లక్ష్మి పాదముచెత దీపములు పెట్టి బియ్యం వుంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి, పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళు సరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మీ సంతసించినది. ఆ పరిశుభ్ర స్థలమున తన రెండు పాదములుంచి ఆమెతో " ఓ భక్తు లారా ! నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి సంత సించితిని. నీ కేమి కావలయునో రుకొనుము" అని అనగా శ్రీమహాలక్ష్మీ సాక్షాత్ దర్శనము చూడగానే ఆమెనోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక యినది. మరల లక్ష్మిదేవి ఇలా అన్నది. నీవు బ్రతికి నాన్నళ్లు అష్ట ఐశ్వర్యములతొ తులతూగుదువు. జన్మాంతరమున నీవు వైకుంట మునకు వచ్చెదవు గాక! నా వ్రతమును చేయుచుండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడ కలుగును " అని చెప్పెను. మహాలక్ష్మీ చెప్పిన ప్రకారముగా ఆ హరి జన స్త్రీ కడునిష్టతో ధ్యానము చేయు చుండెను. లక్ష్మీదేవి పాదముల యందే మనస్సులగ్నము చేసి యున్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి, ఆమెవున్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి నాలుగుమూలలా ధన రాశులున్నవి. దాని వలన ఆమె భాగ్యవంతురాలగుటచే గాక అయిదుగురు పుత్రులును కలిగిరి. ఓ నారదా! ఇది వినుము. ఆ హరి జన స్త్రీకీ లక్ష్మీదేవి వలన ఐశ్వర్యమును కలిగి నదంతయు బలరాయుడు తనే దివ్య దృష్టి వలన తెలుసుకొని మహా కోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి" లక్ష్మిదేవి మాల పల్లెకుపోయి అంటరానిమాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చినందున
మహానేరము చేసినది గాన లక్ష్మిని నీ మందరిము లోనికి రానీయ " వద్దని చెప్పినాడు. అంతలో గ్రామసంచారము చేసుకొని లక్ష్మీదేవి విష్ణుమందిరము లోనికీ ప్రవేశించు చుండగా బలరాముడు ద్వారమున అడ్డముగా నిలబడి లోనికి రావద్దని శాసించెను.ఆ సమయములో అతని కండ్లు శరీరము ఎర్రబడి పోయెను. పళ్లు పటపట కొరుకుచుండెను. " శ్రీ హరీ! నీవు ఈమె ముఖము చూడ వద్ద" నెను. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మీని విడిచి పెట్టుటకు హరి ఒప్పుకొనెను. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించివున్న బంగారునగను తీసివేసి పట్టుచీర విడచి, చిరిగిపోయిన వస్త్రములు ధరించి, ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరి చారికలు ఎంత బ్రతిమాలి ననూ," మరల వచ్చెద" నని చెప్పి వెడలి పోయెను. బలరాముడు, శ్రీహరి - మందిరము లోపల ప్రతిగదినీ చూశారు. ఆ మందిరములోని ఏ గది చూచినని వెలవెల పోయివున్నది. ధనాగారంలో ధనములేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్ధములులెవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి.ఆఖరికి త్రాగడానికి పాత్ర కాని, నీరుకాని లేకపోయి నందున దాహముతో ఉపవాసముండి నిద్ర పోయినారు. మరునాడు ప్రాతః కాలమున ముఖము కడుగు కొనుటకైనను నీరు దొరకలేదు. ఇక వారి కేమియు తోచలేదు.పిచ్చి ఎత్తి నట్లయింది. అంత బలరాముడు, అంత బలరాముడు, జగన్నాధుడగు విష్ణుమూర్తితో " తమ్ముడూ! మనము నిన్నటి దినమున ఆహారం తీసుకోలేదు చాలా నీరస పడి పోయియున్నాము. ఈ దిన మైనను తిండి తినక పోతె ఎలాబ్రతకగలం? అన్నీ కొరత గానున్న విగాన మనము బిచ్చమెత్తి అయినా ప్రాణములను నిలబెట్టుకోవాలి. గనక
ఇద్దరము బయలుదేరు దమురమ్ము" అని అనగా, జగన్నాధుడు అంగీకరించి యుద్ధరూ సాధు వేషములు వేసుకొని భిక్షాటనకు బయలు దేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగనను వారు కపట సన్నాసులు, చోరులని ఒక్కరూ భిక్షం పెట్టలేదు. కసరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుచు ఒక షావుకారు యింటికి వెళ్ళి " భిక్షాందేహి" అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండ బెట్టి భోజన పదార్దలు తెచ్చుటకులోనికి పోయిచూడగా పదార్ధములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరక నందున బలరాముడూ, విష్ణుమూర్తి ఆకలిబాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళి నారు, ఆ కొలనునిండా పద్మములు విర పూసియున్నవి" సరే వీటి తూడు కాయలను తిని ఇప్పటి ఆకలిబాధ తీర్చుకుందా" మని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండి పోయెను. యింక చేయునది లెక నిరాశతో వెళ్ళిపోయినారు. అటుల వెళ్ళగా ఒక తపః శ్మాలి కుటీరము కనబడి నది. అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. మునితాను తినుటకు వుంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము, పాలు మాయమైపోయినవి. ఇంక వారు చేయునది లేక ఇద్దరూ సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించిగా అచ్చటకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటులేదు. ఎవ్వరైనా ఆశ్రమములో ఎన్నిది నములుండి నను ఎంత భుజించినను అక్షయపాత్ర వలె తరగదు. కాని బలరామ జగన్నాధ స్వాములు అకడకు వెళ్ళగానే లక్ష్మీ దేవి ఏ పదార్ధమూ లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడి పోయెను. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను . అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ మరియొక భవనము చేరుకున్నారు. అది లక్ష్మిదేవి నివసిస్తున్న భవనం చాలా దినములనుండి తిండి లేక నీరసించివున్న వారిద్దరినీ లక్ష్మిదేవి చూచినది. జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనము తయారుచేసి దాసీల చేత వారికి స్నానమునకు నీరు పెట్టించి, చెలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపునిండా భుజించి బయటనున్న అరుగుమీద విశ్ర మించారు. కాని వారికి నిద్ర పట్టలేదు. ఆ యిల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్ని వింతగా తోచినవి ఆలోచిస్తున్నారు.అంత ఒక చెలికత్తె వచ్చి " ఓ స్వాములారా! మీదే గ్రామము? ఎందుండి ఎక్కడకు పోవుచున్నారు! మీకు భార్యా బిడ్డలు వున్నారా ! ఎలాగు ఎందుకు తిరుగుతున్నారు! అని అడుగగా - ఏమి చెప్పవలెనో తోచక వారు ఒకరి మొక మొకరు చూచుకొనుచు శ్రీ హరి ఇట్లు చెప్పినాడు. " ఈతడు నా అన్నయగు బలరాముడు. నేను శ్రీహరిని. మాతొందర పాటువలన నాయిల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెడలగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీవలన అష్ట ఐశ్వర్యములు కల్గునో, ఏ నారీ మణి కరుణా కటాక్షము వలన వంశాభి వృద్ద కలుగునో, ఏ వనితామణి ఎల్ల వేళలందు తననునమ్మి కొలిచినవారి ఇండ్లలొ మెలగుచుండునో అటువంటి లక్ష్మిదేవి మమ్ముల్ని విడిచి వెళ్ళిపోయినది అప్పటి నుండి మాకు దరిద్రమూ కష్టాలూ కలిగినవి " అని చెప్పెను. ఆ దాసీవలన ఆ యిల్లు లక్ష్మీదేవి మందిరమే అని తెలిసికొని, చాలా ఆనందించినారు.
బలరాముడు విష్ణువుతో " సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించ మని చేతులు పట్టుకొని అర్ధించుము" అని చెప్పిలోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి, నీళ్ళతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొని పువ్వులతో పూజించి, ఇటుల పలికెను. " నాధా! మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళ గొట్టినారు గదా! యిప్పుడెలా నాయింట భుజింనారు. ఛండాలపుదాని ఇంటికెలా వచ్చినారు? ప్రాణాలు పోసినప్పుడు జాతి, భేదములు అడ్డుకూడదా" అని నిష్టూర ములాడెను. శ్రీహరి చిరునవ్వుతో " ప్రియా! మేమిద్దరము భిక్ష మెత్తు కోవడం అంతా తెలుసుకున్నారు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంటము చిన్నభోయినది. నిన్నువదిలినందున మాకు అన్నీ లోపములె జరిగినవి. గాన, మా వెంటరమ్ము వైకుంటానికి పోవుదము " అని పలుకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి యింట అడుగు పెట్టగానే అన్నీ యధా ప్రకారముగా మారిన విధ నాగార మంతా ధనముతో, బంగారముతో నిండినది. వస్తు వాహనాలతో, దాసీజన ములతో భక్త కోటితె వైకుంటము కలకలలాడెను. కాన ఓ నారదా గురువారము నాడు లక్ష్మి పూజచేసి ఈ పురాణము చదివినను, లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలొ చేసిన పాపములు నశించి మోక్షము కలుగుటయేగాక లక్ష గొదానములు చేసినంత ఫలితముకలిగి అష్ట ఐశ్వర్యములతో తులతూగుదురు. ఈ లక్ష్మీ పురాణము పటనము ప్రతీ మానవుడు ముక్తి నొందుటకు మార్గ దర్శకము కాగలదు. అని, పరాశర ముని నారదునకు లక్ష్మీ పురాణమును వివరింనాడు.

మంగళ హారతి
లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా - ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా - దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి - తీ పైన పండ్లు
కన్నతల్లి - కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ
మల్లె పుష్పాలు - మందార పూలు
తెల్ల గన్నేరు - చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి - దయ సేయమ్మా || లక్ష్మీ
భక్తితో గొలిచేటి - నీ భక్త వరులం
నిజముగా - నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు - చేకూర్చు మాతా || లక్ష్మీ
లక్ష్మి పురాణము సమాప్తము

Read More

Powered By Blogger | Template Created By Lord HTML