What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 11 April 2013

ఆధ్యాత్మిక చింతనలో... 'దామోదర్' (ఇప్పుడున్న SC , ST నాయకుల అందరిలోకి ఉన్నతుడు , రాజనరసిమ్హుడు )

అందోలు నుంచి రాష్ట్ర శాసన సభకు ప్రాతినధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు దైవభక్తి అధికం. తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతుగా ఇతోధికంగా ధన, మన సాయాలు అందిస్తున్నారు. మొదటి నుంచి దామోదర్‌కు దైవభక్తి బా గానే ఉన్నా, 10 ఏళ్లలో అది రెట్టింపయ్యిం ది. హిందూ ఆయాలతోపాటు హైందవ మఠాలు, ఆశ్రమాలకు తరచూ వెళ్తూన్నా రు. తనకంటే భక్తి పరాయణురాలైన సతీమణి పద్మినితో కలిసి తరచూ ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇష్ట దైవం యాదగిరి లక్ష్మీనరసింహ స్వా మిని తరచూ (పెళ్లిరోజునాడు తప్పనిసరిగా) దర్శించుకునే దామోదర్ కలియుగ వైకుంఠం తిరుపతితోపాటు శ్రీశైలం, జిల్లాలోని ప్రముఖ ఆలయాలను తరచూ ద ర్శించుకుంటూ ఉంటారు. ఇక, దైవభక్తితో పాటు ఆయనకు సెంటిమెంట్ కూడా ఎక్కువే. ప్రతిసారి ఎన్నికలవేళ తన నియోజవకర్గంలోని మునిపల్లి మండలం అం తారం గ్రామంలోని శ్రీజీవన్ముక్త పాండురంగ విఠలేశ్వర మందిరాన్ని దర్శించుకుని నామినేషన్ పత్రాలను దేవుడి విగ్రహం ఎదుట ఉంచిన తర్వాతే నామినేషన్ దాఖ లు చేయడం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. గెలిచాక మొదటి  దర్శనం అక్కడనే చేసుకుంటారు. ఆయన తరచుగా ఆ శ్రమాల సందర్శన చేస్తూ, స్వాముల ఆధ్యాత్మిక ప్రవచానాలను శ్రద్ధగా వినడమేగాకుండా ఆచరించే ప్రయత్నం చేసుస్తన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే, కేవలం దైవభక్తి మా త్రమ కాకుండా దైవిక కార్యక్రమాల నిర్వహణకు కూడా ఆర్థిక సాయమందించడం, విరాళాలను ఇవ్వడం చేస్తూ తన వితరణ శీలతను చాటుకుంటున్నారు. ఇటీవలే నియోజకవర్గలోని టేక్మాల్ మండ ల కేంద్రంలో తలపెట్టిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు తన కుటుం బం తరపున రూ.5లక్షలను విరాళంగా అం దజేసిన దామోదర్ అంతటితో ఆగకుండా, ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన రూ. కోటిలో సింహ భాగాన్ని (సుమారు రూ.80 లక్షలను) ప్రభుత్వం తరపున సీజీఎఫ్ నిధుల ద్వారా అందజేసేందుకు హా మీనిచ్చారు. పుల్కల్ మండలం గొంగ్లూర్‌లోని ఓ ఆలయ పునర్నిర్మాణానికి కూడా రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఇక జో గిపేటలోని శ్రీజోగినాథస్వామి ఆలయం లో రథోత్సవ నిర్వహణకు తన వంతుగా యేటా రూ.50 వేలను ఇస్తున్నారు. తాను గెలిచినా, ఓడినా ఈ విరాళాన్ని ఆపేది లే దని కూడా ఆయన ప్రకటించడం విశేషం. ఐదేళ్ల క్రితం సంగారెడ్డిలో లక్ష్మీవేంకటేశ్వర కల్యాణాన్ని సొంత ఖర్చులతో ఆయన జరిపించారు. ఇటీవల సంగారెడ్డిలోని వైకుంఠపురంలోనూ తనవంతుగా ఆర్థిక సహాయా న్ని అందజేసిన ఆయన ఒకరోజు మొత్తం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఆలయాల నిర్మాణం, విగ్రహాల ప్రతిస్ఠాపన త దితర దైవిక కార్యక్రమాలు జరిగినా విరాళాలివ్వడం పరిపాటిగా మారింది. రోజూ తన నివాసంలో ఉదయం సుమారు గంటకుపైగా పూజ, ధ్యానాధికాలను ఆ యన చేస్తూ ఉంటారు. ఆయనకు ఇటీవల అయ్యప్పమాలపై ఆసక్తి పెరిగింది. నాలుగేళ్ళుగా అయ్యప్పమాలను ధరిస్తూ నియమనిష్టలతో మండలకాలంపాటు దీక్ష చేస్తున్నారు. ఏదేమైనా ఉప ముఖ్యమంత్రి దామోదర్‌లో దైవభక్తి మెండుగానే ఉన్నదని చెప్పవచ్చు.
http://www.newscommando.com/damodar-raja-narsimha.jpg

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML