పచ్చని ప్రకృతి మధ్య అందమైన ఉద్యానవనం...పక్కనే కొలువుదీరిన
వెంకటేశ్వరాలయం.. కాలక్షేపానికి గ్రంథాలయం, టీవీ, ఆట వస్తువులు... వీటిని
ఆనుకునే అందంగా రూపు దిద్దుకున్న నారాయణవనం...ఇవన్నీ హైదరాబాద్‌కు
80కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌రహదారిలో విరాజిల్లుతున్నాయి. చూడబోతే ఇదేదో
పెద్ద కార్పొరేట్ కంపెనీ అథితి గృహంలా వుందే అనుకుంటారేమో? అదో
వృద్ధాశ్రమం. ఎందరో వృద్ధులకు కొత్తఊపిరులు ఊదుతున్న సేవాకేంద్రం.
కనిపెంచిన వారి ఆదరణ కరువైనవారు కొందరు, తమ పిల్లలు జీవితమనే పరుగుపందెంలో
తీరికలేకుండా మారితే దిక్కుతోచని వారు మరికొందరు, ఆస్తిపాస్తులను ధారపోసి
పిల్లల్ని బాగా చదివించి విదేశాలకు పంపితే, వాళ్లకు కనీసం పలకరించే తీరిక
కూడా లేకపోవటంతో కుమిలిపోయే తల్లిదండ్రులు మరికొందరు... జీవిత చరమాంకంలో
కొడికట్టిపోతున్న వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఆనంద నిలయం.
సేవే పరమావథిగా పనిచేస్తున్న ఆనంద నిలయం హైదరాబాద్ - సిద్దిపేట మార్గంలో
కొమురవెల్లి గేట్‌కు కిలోమీటర్ దూరంలో రాజీవ్ రహదారి చెంతనే వున్నది.
రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి మార్గదర్శకత్వంలో ఆయన సతీమణి శ్రీమతి లత రమణ అధ్యక్షతన 1992లో ఆనందనిలయం ఏర్పాటైంది.
ఆధునిక వసతుల నిలయం...ప్రస్తుతం ఈ ఆనందనిలయంలో మెదక్ జిల్లాకు చెందిన
సిద్దిపేట, గజ్వేల్, సదాశివపేట, కల్వకుంట, హైదరాబాద్, వరంగల్ జిల్లా
పున్నేరు, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 32 వయోధికులు
సేదతీరుతున్నారు. ఆనందనిలయంలో ఆధునిక వసతులతో కూడిన 16 సువిశాలమైన గదులు
వున్నాయి. దంపతులకు కొన్ని గదులు, ఒంటరి పురుషులు, మహిళలకు వేరువేరు గదులు
ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలో కాలక్షేపం చాలా ముఖ్యం. ఆ అవసరాన్ని దృష్టిలో
వుంచుకుని ఒక హాల్‌లో టి.వి. ఏర్పాటు చేశారు. అందరూ ఉమ్మడిగా కూర్చుని
చదువుకునేందుకు వీలుగా ధార్మిక పుస్తకాలతో కూడిన గ్రంధాలయం ఏర్పాటు చేశారు.
డైనింగ్ హాల్‌లో ఒకే సారి 50 మంది భోజనం చేసే వసతి కల్పించారు. భోజన
వసతితో పాటు వారానికి ఒక సారి డాక్టర్‌తో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి,
అవసర మైన మందులు కూడా అందజేస్తున్నారు. అత్యవసర స్థితిలో ఆస్పత్రికి
తరలించేందుకు వీలుగా అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
ఆలయం.. నారాయణ
వనం...ముదిమి వయసులో వున్న వారికి సాంత్వన చేకూర్చేందుకు గాను వృద్దాశ్రమం
సమీపంలో గత ఏడాది వేసవిలో వెంకటేశ్వరాలయం ప్రతిష్ఠ చేశారు. గోశాల
నిర్మాణానికి కూడా భూమి పూజ జరిగింది. ఆలయం ఎదురుగా నారాయణ వనం పేరిట 15
ఎకరాలలో మామిడి తోటను అభివృద్ది పరుస్తున్నారు. వృద్దులకు కాలక్షేపం కోసం
ఇటీవల బనియన్ మేకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జీవితం చరమాంకంలో వయోధికుల
జీవితాల్లో ఆనందాలు నింపుతున్న ఆనంద నిలయం నిర్వాహకులు నిజంగా
అభినందనీయులు..@ బహుజన బంధు.
పచ్చని ప్రకృతి మధ్య అందమైన ఉద్యానవనం...పక్కనే కొలువుదీరిన
వెంకటేశ్వరాలయం.. కాలక్షేపానికి గ్రంథాలయం, టీవీ, ఆట వస్తువులు... వీటిని
ఆనుకునే అందంగా రూపు దిద్దుకున్న నారాయణవనం...ఇవన్నీ హైదరాబాద్‌కు
80కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌రహదారిలో విరాజిల్లుతున్నాయి. చూడబోతే ఇదేదో
పెద్ద కార్పొరేట్ కంపెనీ అథితి గృహంలా వుందే అనుకుంటారేమో? అదో
వృద్ధాశ్రమం. ఎందరో వృద్ధులకు కొత్తఊపిరులు ఊదుతున్న సేవాకేంద్రం.
కనిపెంచిన వారి ఆదరణ కరువైనవారు కొందరు, తమ పిల్లలు జీవితమనే పరుగుపందెంలో
తీరికలేకుండా మారితే దిక్కుతోచని వారు మరికొందరు, ఆస్తిపాస్తులను ధారపోసి
పిల్లల్ని బాగా చదివించి విదేశాలకు పంపితే, వాళ్లకు కనీసం పలకరించే తీరిక
కూడా లేకపోవటంతో కుమిలిపోయే తల్లిదండ్రులు మరికొందరు... జీవిత చరమాంకంలో
కొడికట్టిపోతున్న వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఆనంద నిలయం.
సేవే పరమావథిగా పనిచేస్తున్న ఆనంద నిలయం హైదరాబాద్ - సిద్దిపేట మార్గంలో కొమురవెల్లి గేట్‌కు కిలోమీటర్ దూరంలో రాజీవ్ రహదారి చెంతనే వున్నది. రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి మార్గదర్శకత్వంలో ఆయన సతీమణి శ్రీమతి లత రమణ అధ్యక్షతన 1992లో ఆనందనిలయం ఏర్పాటైంది.
ఆధునిక వసతుల నిలయం...ప్రస్తుతం ఈ ఆనందనిలయంలో మెదక్ జిల్లాకు చెందిన సిద్దిపేట, గజ్వేల్, సదాశివపేట, కల్వకుంట, హైదరాబాద్, వరంగల్ జిల్లా పున్నేరు, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 32 వయోధికులు సేదతీరుతున్నారు. ఆనందనిలయంలో ఆధునిక వసతులతో కూడిన 16 సువిశాలమైన గదులు వున్నాయి. దంపతులకు కొన్ని గదులు, ఒంటరి పురుషులు, మహిళలకు వేరువేరు గదులు ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలో కాలక్షేపం చాలా ముఖ్యం. ఆ అవసరాన్ని దృష్టిలో వుంచుకుని ఒక హాల్‌లో టి.వి. ఏర్పాటు చేశారు. అందరూ ఉమ్మడిగా కూర్చుని చదువుకునేందుకు వీలుగా ధార్మిక పుస్తకాలతో కూడిన గ్రంధాలయం ఏర్పాటు చేశారు. డైనింగ్ హాల్‌లో ఒకే సారి 50 మంది భోజనం చేసే వసతి కల్పించారు. భోజన వసతితో పాటు వారానికి ఒక సారి డాక్టర్‌తో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి, అవసర మైన మందులు కూడా అందజేస్తున్నారు. అత్యవసర స్థితిలో ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
ఆలయం.. నారాయణ వనం...ముదిమి వయసులో వున్న వారికి సాంత్వన చేకూర్చేందుకు గాను వృద్దాశ్రమం సమీపంలో గత ఏడాది వేసవిలో వెంకటేశ్వరాలయం ప్రతిష్ఠ చేశారు. గోశాల నిర్మాణానికి కూడా భూమి పూజ జరిగింది. ఆలయం ఎదురుగా నారాయణ వనం పేరిట 15 ఎకరాలలో మామిడి తోటను అభివృద్ది పరుస్తున్నారు. వృద్దులకు కాలక్షేపం కోసం ఇటీవల బనియన్ మేకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జీవితం చరమాంకంలో వయోధికుల జీవితాల్లో ఆనందాలు నింపుతున్న ఆనంద నిలయం నిర్వాహకులు నిజంగా అభినందనీయులు..@ బహుజన బంధు.

No comments:
Post a Comment