What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 11 April 2013

భరతమాత రుణం తీర్చుకోవాల్సిందే ఆ బాధ్యత నాకే కాదు.. అందరికీ ఉంటుంది: నరేంద్ర మోడీ

ప్రధాని కావాలన్న తన మదిలో కోరికను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మరోసారి పరోక్షంగా బయటపెట్టారు. 'భరతమాత' రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన అన్నారు. "కేవలం మోడీ మాత్రమే కాదు.. ప్రతి పిల్లవాడు, పౌరుడు కూడా భరతమాతకు రుణపడి ఉంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఒక జీవితాన్ని కాపాడినప్పుడల్లా వైద్యుడు భరతమాత రుణం తీర్చుకున్నట్లే. పాఠాలు బోధించినప్పుడల్లా ఉపాధ్యాయులు కూడా అదే చేస్తారు. భరతమాత తన ఆశీస్సులు అందిస్తుందని ఆశిస్తున్నా. ఆ రుణం తీర్చుకోకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్లలేరు'' అని చెప్పారు. ఇటీవలే బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డులో స్థానం పొందిన మోడీ.. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఈ మాటలు చెప్పారు. "మోడీ గుజరాత్ రుణం తీర్చేసుకున్నారు. ఇంకా భరతమాత రుణం తీర్చుకోవాలి'' అని ఆర్‌పీ గుప్తా అనే రచయిత వ్యాఖ్యానించడంతో అందుకు సమాధానంగా మోడీ స్పందించారు. "నరేంద్రమోడీ గుజరాత్ రుణం తీర్చసుకున్నారని, ఇక భరతమాత రుణం తీర్చుకోవాలని జనం అంటున్నారు'' అని ఆయన అన్నారు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML