What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 19 April 2013

శ్రీరాముని రాజధర్మం :-

ముందుగా మిత్రులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు !

(శ్రీరాముడిని విమర్శించే కరుణానిధిలాంటి వాళ్ళకి, కుహానా మేధావులందరికి చక్కటి సమాధానం !)

శ్రీరాముడు నిండు గర్భిణిగా ఉన్న భార్యను అడవులలో వదలిపెట్టాడని చాలామంది విమర్శించారు ,
సినిమాలు తీసారు ,రాజకీయనాయకులు మైనారిటీవోట్లకోసం కక్కుర్తిపడి శ్రీరాముడిని విమర్శిస్తారు .
కానీ శ్రీరాముడు సీతాదేవికి భర్త మాత్రమేకాదు , ఒక రాజ్యానికి రాజు కూడా !
భర్తగా ఆయనకి ఎలా ధర్మములు , బాధ్యతలు ఉంటాయో ,
రాజుగాకూడా కొన్ని రాజధర్మములు , బాధ్యతలు ఉంటాయి .
అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆయన మామూలు భర్త మాత్రమే !
అందుకే సీతాపహరణం జరిగినప్పుడు చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు .
సీతాదేవిని తిరిగితెచ్చుకోవడానికి ఎన్నెన్నో పాట్లు పడ్డాడు .
ఎవరెవరితోనో స్నేహం చేసాడు , దైవాన్ని ఆశ్రయించాడు , ప్రకృతిని ప్రాధేయపడ్డాడు ,
తిన్నాడో , లేదో , పడుకున్నాడో , లేదో ఎలాగైతేనేం సాధించాడు .
కానీ అయోధ్యకి తిరిగి రాగానే పట్టాభిషేకం జరిగింది . రాజయ్యాడు .
రాజు ప్రధానధర్మము , ప్రజాభీష్టం మేరకు పరిపాలన చెయ్యడం .
ప్రజలకోసం అవసరమైతే , తన వ్యక్తిగతసుఖాలను , సంసారజీవితాన్ని ,
సంసారాన్ని వదలిపెట్టగలిగినవాడే రాజుగా ఉండడానికి అర్హుడు .
ఆరోజు ఆయన రాజ్యంలో కొందరు ప్రజలు , సీతాదేవిని రాణిగా అంగీకరించలేదు .
అప్పుడు రాముడిముందు రెండే కర్తవ్యాలు ఉన్నాయి .
ప్రజాభీష్టం మేరకు సీతను వదలిపెట్టడం , లేదా సీతకోసం ప్రజలను వదలిపెట్టడం .
సీతకోసం ప్రజలను వదలిపెడితే , ప్రజలు అన్యాయమైపోతారు .
ప్రజలకోసం సీతను వదలిపెడితే , ఏ తప్పూ చెయ్యని సీత అన్యాయమైపోతుంది .
ఆరోజు రాముడు ఎటూ తేల్చుకోలేక
ఎంత మధనపడిపోయాడో , ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో , ఎవరికి తెలుసు ?
చివరికి ప్రజలకోసం తనూ , తనభార్య , బలైపోవడానికి సిద్ధపడ్డాడు .
అయినాకూడా , భర్తగా ఆమెను రక్షించాల్సిన తన బాధ్యతను విస్మరించలేదు .
వాల్మీకి ఆశ్రమప్రాంతాలలో వదలిపెట్టమని తమ్ముడికి చెప్పాడు , ఆయన రక్షణలో ఉంటుందని భావించి .
తను కేవలం ప్రజల బాగోగులకోసం ఒంటరిగా మిగిలిపోయాడు .
కొంతకాలం తర్వాత సీతకు కొడుకులైనా తోడున్నారు . కానీ రామునికి ఎవరున్నారు ?
జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయాడు .
ఇదీ శ్రీరాముని కుటుంబం , దేశం కోసం , ప్రజలకోసం చేసిన త్యాగం .
అంతేకాని పదవులు అడ్డం పెట్టుకుని , రకరకాల స్కాములు చేసి , కోట్లు సంపాదించి
" మా కుటుంబం దేశం కోసం త్యాగంచేసింది " అంటే ఎలా ?
శ్రీరాముడు కేవలం ప్రజలకోసం , తనకు వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయినా ,
రాజు ప్రజలమాట మన్నించాలి కాబట్టి , పరమపావని సీతను వదలిపెట్టాడు .
మరి మన ` పక్కింటి పెద్దాయన ' శ్రీరాముడిని విమర్శించడానికి కుర్చీలోంచి ఒంటికాలిమీద లేచిపోతాడు .
అవినీతికి పాల్పడి జైలుపాలైన తన కూతురిని ప్రజాభిప్రాయం మన్నించి ` ఒక్కరోజు ' వదలిపెట్టగలడా ???
కానీ శ్రీరాముడిని మాత్రం నోటికొచ్చినట్లు తిడతాడు .
అడిగేవాడు లేకకానీ ..........!!!

BY: Prl Kumar

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML