ఓం
ఉగాది పండుగలో ఉన్న వైజ్ఞానిక అంశాలేంటి?
ఉగాది వసంత ఋతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలరకాల వ్యాధులు వ్యాపిచే సమయమిది. అనేక మంది వీటి బారిన
పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన ఋషులు "యమద్రంస్టలు" అన్నారు.
యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం
చేస్తాడని అర్దం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్యజాగ్రత్తలు బాగా తీసుకోవాలి.
ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా అదే.
ఉగాది పచ్చడి ఒక
మహాఔషధం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజూ మాత్రమే కాదు ఉగాది మొదులుకొని శ్రీ
రామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజు స్వీకరించాలి. ఈ విధంగా
9/15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ
సంవత్సరం మొత్త రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో
ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను
దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణలు కలిగింది. కఫము, వాతము,
పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఉగాది పచ్చడి. మనకొచ్చే రోగాలలో
చాలాశాతం రోగాలు వీటివల్లే వస్తాయి.
ఉగాది రోజు చేసే తైలాభ్యంగన
స్నానం(శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం)
శరీరంలో ఉన్న టాక్సిన్స్(విష పదార్ధాలు)ను తొలగిస్తుంది.
ఉగాది
కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం.
ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం
చేయడం వలన మన చుట్టు వాతావరణం నుంచి మన రోగాలు సంక్రమించే అవకాశం
తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీ-సెప్టిక్, యాంటీ-బయోటిక్ లక్షణలు కలిగినవి.
మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకీ రోగకారక క్రిములు
రాకుండా ఆపేస్తాయి.
ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజుల పాటూ
వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీ రామచంద్ర మూర్తిని విశేషంగా
పూజిస్తాం/ అందరూ తప్పక పూజించాలి. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో
రోజుకోక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే, ఒక్క రోజు
కాదు, దాదాపు 15 రోజుల పాటు అంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన
చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.
మొత్తంగా చూస్తే ఉగాదిపచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది,
కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు చస్తాయి. ఉగాదిస్నానం శరీరంలో మలినాలను,
విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు
సంక్రమించకుండా రక్షిస్తాయి. 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన,
పుష్టకరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఞానిక
అంశాలను మాత్రమే.
చూశారా! మన ఋషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే
అందులో ఎన్ని అంశాలుంటాయో. అందుకే హిందువైనందుకు గర్వించండి. హిందువుగా
జీవించండి. పర్యావరణాన్ని రక్షించండి. తోటివారికి సహాయం చేయండి.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
No comments:
Post a Comment