What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

గంగోత్పత్తి

ఈ రోజు గంగోత్పత్తి

జ్ఞానం మహేశ్వజరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్ధనాత్ l , అనగా శివుని వద్ద జ్ఞానము మరియు విష్ణువు వద్ద మోక్షమును కోరవలెను.
శంకరుడు జ్ఞానమయుడు అగుట వలన శివుని జట నుంచి ప్రవహించే గంగా నది కూడా సరస్వతి నది మాదిరిగా జ్ఞాన దాయకము అయినది.
- ప.పూ. డా. ఆఠవలె

గంగా నది దశాహరము. అది శారీరిక, వాచిక, మానసికలను కల దశ పాపములను హరిస్తుంది అనగా నాశనము చేస్తుంది.
శారీరిక పాపములు : - ౧. దొంగతనము, ౨. హింస, ౩. పరస్త్రీ గమనము
వాచిక పాపములు :- ౧. అబద్ధములు చెప్పుట, ౨. కఠోరముగా మాట్లాడుట, ౩. నిందించుట, ౪. అసంబద్దముగా, ఆకారణముగా మాట్లాడుట
మానసిక పాపములు :- ౧. ఇతరుల ధనమును దొంగాలిద్దమనే ఆలోచన వచ్చుట, ౨. ఇతరుల గురించి చెడుగా ఆలోచించుట మరియు ౩. దురగ్రహము
- గురుదేవులు డా. కాటేస్వామిజి
(గంగా నది పాపవినాశనము అయినది. అంటే అన్ని పాపములను చేసి ఒక్కసారి మునిగితే పాపములు పోతాయి అని కాదు. చేసిన పాపములకు తీవ్ర పశ్చాత్తాపము చెంది, ఆ పాపములు మల్లి చెయ్యకుండా మనలో గాంభీర్యము నిర్మాణము అవ్వడము చాల అవసరము.)


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML