What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 5 May 2014

వైశాఖ మాసం ప్రారంభం

వైశాఖ మాసం ప్రారంభం 

(ఏప్రిల్ 30, 2014, బుధవారం నుండి మే 28, 2014, బుధవారం వరకు.)

మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి.

కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది. ఆద్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖ మాసానికి మాధవమాసం అని పేరు. అత్యంత పవిత్రమైన మాసంగా
పేరుపొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతిదినమూ పుణ్యదినమే. 

అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన, పూజ, దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.

వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ, గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లోగానీ, చెరువులోగాని, బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.

సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.

ఈ నెలలో వచ్చే పండుగలు

వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి

చైత్రపూర్ణిమ హనుమజ్జయంతిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజు ఆంజనేయస్వామి వారిని సింధూర, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను ధరింపచేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవలెను. 

వైశాఖ శుద్ధ చతుర్దశి - శ్రీనృసింహజయంతి 

హిరణ్యకశిపుడిని అంతమొందించడానికి శ్రీమహావిష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ దినం ఉపవాసంను పాటించి స్వామివారిని పూజించడం లేదా స్వామివారి వ్రతం చేయడంతో పాటు స్వామివారు ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు. 

వైశాఖ పూర్ణిమ - మహావైశాఖి

వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపంను శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు.అలాగే హిరణ్యకశిపుడిని అంతమొందించి ఉగ్రరూపంలో తిరుగుతూ ఉండిన నృసింహస్వామి ఉగ్రరూపాన్ని తొలగించేందుకు శివుడు శరభుడిగా అవతరించిన దినమూ ఇదే. గౌతమ బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టమైన ఈనాడు సముద్రస్నానం చేయడం విష్ణువును పూజించడంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి ఈ దినం ఉన్నతమైనది. 

వైశాఖ శుద్ధ పంచమినాడు జగద్గురువుగా ఖ్యాతి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యులవారికి జన్మదినం. షష్టినాడు విశిష్టాద్వైత మతస్థాపకులు, వైష్ణవభక్త శ్రేష్ఠుడు అయిన శ్రీరామానుజాచార్యులవారు జన్మించారు. అలాగే శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ, నారద జయంతులు కూడా వైశాఖంలోనే కావడం ఈ మాస విశిష్టత. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులన్నీ ఆరోగ్యరహస్యాలు కావడం విశేషం.
 


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML