What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 5 May 2014

కుల నిర్మూలన.. ఆర్థిక సమానత్వంతోనే సామాజిక సమానత్వాన్ని సాధించగలం.. @ బహుజనబంధు.

కుల నిర్మూలన.. 
ఆర్థిక సమానత్వంతోనే 
సామాజిక సమానత్వాన్ని సాధించగలం..
..
భారతదేశంలో ఏదైనా సాధ్యమౌతుంది. కానీ కుల నిర్మూలను రాజకీయంగా అంత తొందరగా జరగదు. ఎందుకంటే..? కుల నిర్మూలన గురించి మాట్లాడేది రాజకీయ నాయకులు మాత్రమే. కుల నిర్మూలన' అనేది సామాజిక అవసరంగా కాకుండా, రాజకీయ అసరంగా ముందుకు వచ్చింది. కుల నిర్మూలన' ఒక సామాజిక సమస్యగా కాకుండా ఒక రాజకీయ అవసరంగా కమ్యునిస్టులు, అంబేద్కర్ లాంటి నాటి సామాజిక మేధావులు ముందుకు తెచ్చారు. ఇదోక అపహాస్యపు కోణం. మరో నిజ కోణం ఏమనగా... భారతీయ సమాజంలో కులం..' అనేది కొందరికి సామాజిక హోదా, గౌరవస్థానం. మరి కొందరికి కులం.' అనేది సామాజిక ప్రతిబంధకం, అవమానం. కుల నిర్మూలన..' అనగానే ఈ రెండు సామాజిక పార్శవాలు స్థబ్దతగా ఉంటున్నాయి. ఉంటాయి. కాబట్టి ఈ విభిన్నమైన స్వభావం కలిగిన సమూహాల మధ్య ఇట్లాంటి సామాజిక/ రాజకీయ సంస్కరణ సాధ్యం కాదు. కాబట్టి కులాల మధ్య సామాజిక, రాజకీయ అంతరాన్ని తగ్గించగలిగినప్పుడు, సామాజిక సమ సమాజం దానంతట అదే పురుడు పొసుకుంటుంది. తద్వారా ఆర్థిక సమ సమాజం ఏర్పడుతుంది. ఆర్థిక సమ సమాజంలో సామాజిక అంతరాలు నశించిపోయి Cosmopolitan Society ఏర్పడుతుంది. అంటే Metropolitan Society(The Most Urban Society) ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే కులం తన సామాజిక స్వభావాన్ని, ఉనికిని కోల్పోయి, దానంతట అదే నశిస్తుంది. ఆర్థిక సమానత్వంతోనే భారతీయ సమాజంలో సామాజిక సమానత్వాన్ని సాధించగలం..@ బహుజనబంధు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML