What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

సిమ్హాచలంలో ఉన్నమూర్తిని వరాహ నరసిమ్హమూర్తిగా కొలుస్తాము.

సిమ్హాచలంలో ఉన్నమూర్తిని వరాహ నరసిమ్హమూర్తిగా కొలుస్తాము. సిమ్హాచల స్వామిది ఉగ్రరూపమని,ఆయన్ని శాంతింపచేసేందుకు చందనం పూసి,చందనం పూతతో శివలింగాకారంగా శ్రీ వరాహనరసిమ్హస్వామివారి రూపాన్ని పూజిస్తారు. విశాఖపట్నం జిల్లాలో సిమ్హాచలం ప్రముఖ క్షేత్రం, వేదవేద్యుడు గనుకనే వేదాద్రి,వేదగిరి,వేదాచలం,అంతర్వేది వంటి వేద సంబంధమైన పేర్లున్న ప్రాంతాలలో స్వామి నెలకొన్నాడు. యాదగిరి గుట్ట (వేదగిరి) రంగారెడ్డిజిల్లాలో ఉంది. కరీమ్నగర్ జిల్లాలోకూడా ఆ స్వామి కొలువై ఉన్నారు.
పంచక్రోశక్షేత్రమైన అహోబిలం,కర్నూలు జిల్లా వద్ద ఉంది. ఇక్కడ నవ నరసిమ్హ రూపాలు ఉన్నాయి.
1)కరంద నృసింహ
2)యోగానంద నృసింహ 
3)ఉగ్ర నృసింహ
4) వరాహ నృసింహ
5)ప్రహ్లాదవరద నృసింహ
6)చత్రపఠ నృసింహ
7)మాలోల నృసింహ
8)జ్వాలా నృసింహ
9) పవన నృసింహ
కదరి నరసీమ్హ క్షేత్రం అనంతపురం లో ఉన్నది.
స్వామి ఉగ్ర రూపంలో అవతరించినప్పటికీ, భక్త వరదునిగా,భక్తుల పాలిట కల్ప తరువుగా ఎందరినో కరుణించిన కరుణామూర్తి. 
అందుకే మన మహర్షులు నరసీంహ తత్త్వాన్ని ఇలా చెప్పారు. 
ఆ నాభేర్బ్రహ్మణోరూపం, ఆ గళాద్వైష్ణవం వపుః 
ఆ శీర్షా ద్రుద్రమీశానాం, తదగ్రే సర్వతశ్శివం 
ఆయన దివ్యదేహంలో నాభివరకు బ్రహ్మతత్త్వం,అక్కడి నుండి గళం వరకు విష్ణుతత్త్వం,అక్కడి నుండి శీర్షం వరకు రుద్ర ఈశాన శివతత్వం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అదే నరసిమ్హావతారం. ఆ స్వామి అభయస్వరూపుడు. దుష్టశిక్షణకొరకై అవతరించిన కరుణమూర్తి !


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML