What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

నరసింహ లేదా నృసింహ జయంతి.

నరసింహ లేదా నృసింహ జయంతి. 
శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. 
శ్రీ హరి ద్వార పాలకులైన జయవిజయులు శాప వశాన భూమి పై రాక్షసులుగా జన్మిస్తారు. అయితే ఏడు జన్మలు హరి భక్తులుగ కావలెనా లేక మూడు జన్మలు హరి ద్వేషులుగా కావలెనా అన్న శ్రీహరి సూచనకు, విష్ణు సేవకు దూరమవుతున్నామన్న బాధ వలన ద్వేషించినా మూడు జన్మలైతే తక్కువ కాలములో తిరిగి విష్ణు సన్నిధికి చేరవచ్చన్న తలంపుతో వారు మూడు జన్మల ఎడబాటు కోరుతారు. ఆ విధంగా జయవిజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగ పుడతారు. 

శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చు కోవడం కోసం బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శాస్త్రం చే గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు. హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నారద బోధచే తల్లి గర్భం లో నున్నప్పటి నుంచే హరి భక్తుడు అవుతాడు. హరి భక్తి మానమని ప్రహాదుని ఎంత బోధించినా, బెదరించినా, చంప ప్రయత్నించినా మనసు మార్చుకోడు. ఆఖరికి శ్రీ హరి ని చూపగలవా అని ఒక స్తంభమును చూపించి హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నిలదీస్తే "ఇందు గలడందు లేదని సందేహము వలదు .." అని తండ్రికి చెబుతాడు. స్తంభమును హిరణ్య కశిపుడు భేదించాగానే "నరసింహ అవతారుడై" శ్రీ హరి హిరణ్య కశిపుని పట్టి ఎత్తి, గుమ్మం పై కూర్చొని, తొడమీద వేసుకుని, సంధ్యా సమయంలో తన వాడి గోళ్ళను ఆయుధంగా చేసి ఆ దనుజుని చీల్చి చెండాడుతాడు


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML