What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

వ్యాస మహర్షి జయంతి..

ఈ రోజు వ్యాస మహర్షి జయంతి..

వ్యాసోచ్చిస్టం జగత్ సర్వం l
అంటే ఇప్పుడు వరకు వచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని కూడా వ్యాసుని ఎంగిలే అంటే ఆయన రాసిన నుండి వచ్చినవే అని అర్థము..
వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.

సత్యవతికి జన్మించిన వాడే కృష్ణద్వైపాయన వేద వ్యాసుడు. వేద వ్యాసుడు పుట్టగానే తల్లికి నమస్కరించి, కృష్ణజినదండ, కమండలము ధరించి తల్లితో "అమ్మా నాతో పని కలిగినప్పుడు తప్పక తలంపుము" ఆక్షణమే నీ దగ్గరకు వచ్చి నీ పనిని పూర్తి చేసెదను అని తెలిపి లోక హితార్ధమై తపోవనములకు పోయి ఘోర తపము చేసెను. వేద వ్యాసుని వద్ద ఎందరో ఋషులు శిష్యులుగా చేరి విద్యార్జన చేసిరి...


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML