What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

భూతకృత్

భూతకృత్
౧. భూతములను (ప్రాణికోట్లను, పంచభూతాలను, స్థావరజంగమాలను) కలిగించేవాడు. 'సృష్టికర్త' అని భావం. 'తపసస్తన్మహినాజాయతైకమ్' - అని 'ఋగ్వేదం'. తన మహిమతో జగత్ సృష్టికి హేతువైనవాడని మంత్రార్థం.
'యతోవా ఇమాని భూతాని జాయన్త్॑' (తైత్తిరీయం),
౨. ఈ శబ్దానికి మరో అర్థం. 'భూతనాశకుడు'. 'భూతాని కృన్తతి, కృణోతి'. భూతకోటిని లయం చేయువాడు.
ఇలా ఒకే నామం స్వామియొక్క రెండు కృత్యాలను చెప్తుంది. భూతకారకుడు, భూతలయకర్త - నారాయణుడే. రజోగుణంతో సృష్టించి, తమోగుణంతో లయం చేసే స్వామి. సృష్టికీ, లయకీ నడుమన ఉన్న స్థితి కూడా ఆయన కృత్యమేనని తరువాతి నామం.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML