What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 13 December 2015

శంకరులు జగద్గురువులు. వయస్సైపోయి జీవనసంధ్యలోకి వచ్చి చిట్టచివరి ఊపిరి దగ్గర పడిపోతున్న సమయంలో కూడా భగవన్నామం పలుకకుండా డుకృణ్ కరణే సూత్రాలను వల్లెవేసున్న బ్రాహ్మణునిపై శంకరాచార్యుల వారికి కోపం వచ్చింది.

శంకరులు జగద్గురువులు. వయస్సైపోయి జీవనసంధ్యలోకి వచ్చి చిట్టచివరి ఊపిరి దగ్గర పడిపోతున్న సమయంలో కూడా భగవన్నామం పలుకకుండా డుకృణ్ కరణే సూత్రాలను వల్లెవేసున్న బ్రాహ్మణునిపై శంకరాచార్యుల వారికి కోపం వచ్చింది. అప్రయత్నంగా వారివెంట ఒక శ్లోకం వచ్చింది.
భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే!
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్ కరణే!!
ఇది శంకరాచార్యులవారు ప్రయత్నపూర్వకంగా వ్రాసిన స్తోత్రం కాదు. దేవతామూర్తిని చూసి చేసిన స్తోత్రమూ కాదు. శిష్యులను ఉద్ధరించడంకోసం ఉపదేశాంతర్గతంగా చెప్పిన స్తోత్రమూ కాదు. కేవలం వృద్ధబ్రాహ్మణుని చర్యను చూసి అసహ్యించుకొన్న శంకరుల నోటివెంట వచ్చిన ఆ స్తోత్రం తలమానికమై నాటినుంచి నేటివరకు ఎక్కడ చూసినా ఆస్తోత్రానికి ఎంత ప్రఖ్యాతి వచ్చిందంటే దానికి శంకరాచార్యులు పెట్టిన ప్రత్యేక పేరు ఏమీ లేదు. తరువాతి కాలంలో అది సంగీతంలోకి వెళ్ళిపోయి మొట్టమొదటి "భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే!" అనేదాన్ని పల్లవి క్రింద పాడతారు.
ఆ కోపంలో శంకరాచార్యులు చెప్పినటువంటివి పన్నెండు శ్లోకాలున్నాయి. శంకరాచార్యుల వారి వెనుక వస్తున్న పధ్నాలుగుమంది శిష్యులు ఒక్కొక్క శ్లోకం చెప్పారు. 14 + 12 = 26. చిట్టచివర శంకరాచార్యుల వారు ఆశీఃపురస్సరంగా ఇంకొక నాలుగు శ్లోకాలు చెప్పారు. మొత్తం ముప్ఫై శ్లోకాలు. వీటిని పాటగా పాడుకుంటూ ప్రతిశ్లోకం చెప్పిన తరువాతా మళ్ళీ మొదటి శ్లోకం పల్లవిగా అంటాం. మొట్టమొదట పన్నెండు శ్లోకములను కలిపి ద్వాదశ మంజరీక స్తోత్రము అంటారు. పధ్నాలుగు మంది శిష్యులు చెప్పిన శ్లోకాలను చతుర్దశ మంజరీక స్తోత్రము అంటారు. శంకరులు చెప్పినవి మొదట 12, చివర 4. మనం భగవంతునికి చేసే ఉపచారములు పదహారు. భారతదేశంలో పుట్టిన యే మనిషికైనా అంత్యేష్టితో కలిపి పదహారే సంస్కారములు. ఆఖరికి మనం పూజచేసినా సరే పదహారో ఉపచారం దగ్గరికి వచ్చేసరికి మంత్రపుష్పాన్ని చెప్తాం. అప్పటివరకూ ద్వైత భావనతో భగవానుడు వేరు నేను వేరు అని చేసిన పూజ చిట్టచివరికి "నాన్య పంథాయ నాయ విద్యతే" భగవానుడు ఎక్కడో లేడు "నీవార శూక వత్త న్నీ పీతా భాస్వత్య ణూ పమా"- ఇక్కడే ఉన్నాడు అని తనలోనే భగవానుని దర్శనం చేస్తాడు. పదహారవ ఉపచారం దగ్గరికి వచ్చేసరికి అంతటా భగవానుడు ఉన్నాడనే రహస్యాన్ని తెలుసుకొనడంతో పూర్తవుతుంది. జ్ఞానసిద్ధి. శంకరాచార్యులు వారి ప్రయత్నం లేకుండానే పదహారుగా పూర్తయ్యాయి. ఏదైనా స్తోత్రం చేసినప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది. కానీ చిత్రం శంకరులు చెప్పిన శ్లోకాలకు ద్వాదశ మంజరీక స్తోత్రమనీ, శిష్యులు చెప్పి శ్లోకాలకు చతుర్దశ మంజరీక స్తోత్రమనీ, మొత్తం ముప్ఫై శ్లోకాలకు కలిపి మోహముద్గరమనీ పేరు. గుర్రాన్ని కొట్టే కొరడాకి ముద్గరమని పేరు. మనం అజ్ఞాన జనితమైన మోహం చేత కేవలం దేహమే నేను అనే భ్రాంతితో జీవితం గడిపేస్తుంటాం. అటువంటి మోహానికి ఆ శ్లోకాలు ముద్గరం. ఆ శ్లోకపు కొరడా దెబ్బ తగిలిందా ఎంతటివాడికైనా మోహం విరిగిపోవలసిందే అన్నారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML