1. సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి.
2. చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము.
3. కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము.
4. బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము.
5. గురువుకు ఉచ్ఛ రాశి కటకము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము.
6. శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య.
7. శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము.
8. పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము.
9. స్త్రీరాశులు :- వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము.
10. ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు.
11. నలుపు :- మకరము, కన్య, మిధునము.
12. పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము.
13. తెలుపు :- వృషభము, కటకము, తుల.
14. బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము.
15. క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు.
16. వైశ్యజాతి :- ముధునము, కుంభము.
17. శూద్రజాతి :- కటకము, కన్య, మకరములు.
18. రాశులు దిక్కులు :-
19. తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు.
20. దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య.
21. ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు.
22. పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం.
23. చరరాశులు:- మేషము, కటకము, తులా, మకరములు.
24. సమరాశూలను ఓజ రాశులు అంటారు
|
No comments:
Post a Comment