ఆషాడ అమావాస్య దీనినే చుక్కల అమావాస్య కూడా అంటారు..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷ఈ రోజు ఏం చేయాలి🌷
🌿ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు.
🌸 కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...
🌿హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
🌸 మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది.
🌿దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున
🌸వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య.
🌿ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట.
🌸కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !
🕉️ మనం వండుకున్న ఆహారంలో నుంచి ఒక ముద్ద తీసి బయట పెట్టాలి. కాకులకు పక్షులకు చీమలకు ఆహారం వేయాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు దక్షిణం వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఆరోజు పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారని శాస్త్ర వచనం.
🌿ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం .
🌸కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు.
🌿ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
🌸 ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
--
kishore always with u....!

No comments:
Post a Comment