బ్రహ్మచర్యము : ఉత్తరగీత
: స్త్రీ సంభోగము లేకయుండుట. మనస్సునందైనను స్త్రీలమీఁదు.
గోరికలేక యుండవలయును. భార్యకలవాఁడయ్యేనేని ఋతుకాలములయందు మాత్ర మామెతోఁ గ్రీడించి తృప్తిఁబొందువాఁడు బ్రహ్మచారిగానే యెన్నఁబడును. దోషములు కాయికదోషమనియు, వాచకదోషమనియు, మానసిక దోషమనియు మూఁడు విధములు.
అందు కాయికము = అన్యస్త్రీని బ్రత్యక్షముగఁ బొందుట కాయికదోషము
వాచకము = అన్యస్త్రీని గోరుచు నన్యస్త్రీలతో సంభాషణమునకు సంతోషించుచు, వారి పొందు లభింపకపోయెనే, యెట్లు సమకూడునని మిత్రులతో నాలోచించు చుండుట వాచకదోషము;
మానసికము = అన్యస్త్రీలను వలచి వారికొఱకై మనసునఁ బరితపించుచు నెవ్వరికిందెలియనీయక లోలోన కృశించుచుండుట మానసిక దోషము. తనభార్య కాక తక్కిన స్త్రీలందఱు దల్లులనియుఁ, దాను వారి కుమారుఁ డనియుఁ దలఁచుచు స్త్రీలమీఁదికోరిక తప్పించుకొనవలయును.
ఋతుకాలము = బహిప్లైనది మొదలు పదునాఱు దినములు. అందు మొదటి నాలుగు దినములు, పదునొకండవ దినము, బదుమూఁడవ దినమును నిందితములు. అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సంక్రాంతి, వ్రతదినములు, సూతకదినములును నిందితములు. కావున నీ దినములయందు స్త్రీ సంపర్కముకూడదు.
మనదీపమని ముద్దుఁబెట్టుకున్నచో మూతికాలును. అట్లే స్వభార్యయైనను ఋతుకాలములయందు దప్ప తక్కిన కాలములయందు సంభోగముకూడదు. శ్రాద్ధమందు భుజించిన బ్రాహ్మణుఁడు తనభార్య కోరినను నాడు సంపర్కముచేయఁగూడదు.
ఋతుస్నానము చేసిన మూఁడు దినములకు లోపలఁ గామాతురుఁడై యుండినను రమింపఁగూడదు. ఒకపడకయందు బవళించుటయును గూడదు. ప్రాతఃకాలము, పగలు, అర్ధరాత్రములు యందును, సంధ్యా కాలములయందును రమింపఁగూడదు. దితి సంధ్యాకాలమున కశ్యపునితో బలాత్కారముగ రమింప హిరణ్యకశిపుఁడు హిరణ్యాక్షులుబుట్టి. సంధ్యాకాలదోషము వలన అతిక్రూరులయిరి కనుక సంధ్యాకాలమందు సంగమము కూడదు. రాత్రికాలమందే స్త్రీసంభోగము కూడునుగాని పగటఁగూడదు.
ప్రాణంవా ఏతే ప్రస్కందన్తి యే దివారాత్యా సంయుజ్యస్తే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రే రత్యాసంయుజ్యక్తే" ప్రశ్నోపనిషత్.
అట్లు కానియెడల నాలుగవ దినమున ననఁగా స్నానము రమింపఁగా నిల్చిన గర్భమందలి శిశువల్పాయువును, దరిద్రమును బొందును. పదునొకండవ దినమున నిల్చిన గర్భ మధర్మ మందిచ్చగల యాడు శిశువును బొందును. పదుమూడవ దినమున నిల్చిన గర్భమున వర్ణసంకరురాలగు కూతురు కలుగును, ఇది నిశ్చయము. ఉపరతివలన నిల్చిన గర్భము స్త్రీయొక్క యాకారచేష్టలు గల నపుంసకుని బొందును; లేకున్నఁ బురుషచేష్టలు గల స్త్రీయైన నిలుచును. ఆఱుమాసములు మిగిలిన గర్భిణి స్త్రీని రమింపఁగూడదు. ఈ బ్రహ్మచర్య నియమమును సమస్తమైనవారును జరుపవలయును.
శ్రీమద్ భగవత్ ఉత్తరగీత
ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధానంతరం చెప్పిన గీత.. దీనిని ఉత్తరగీత అంటారు..
--
kishore always with u....!
No comments:
Post a Comment