*చిత్తజగురుఁడా నీకు శ్రీమంగళం..*
తాళ్లపాక పెదతిరుమలాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
రేకు: 1032-3
సంపుటము: 20-189
రేకు రాగము: లలిత
గానం. *శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు*
రాగం. మధ్యమావతి
చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా
చిత్తములో హరి నీకు శ్రీమంగళం
బంగారుబొమ్మవంటి పడతినురము మీద
సింగారించిన నీకు శ్రీమంగళం
రంగుమీఱఁ పీతాంబరము మొలఁ గట్టుకొని
చెంగలించే హరి నీకు శ్రీమంగళం
వింత నీలములవంటి వెలఁది నీపాదముల
చెంతఁ బుట్టించిన నీకు శ్రీమంగళం
కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా
చింతామణివైన నీకు శ్రీమంగళం
అరిది పచ్చలవంటి అంగన శిరసు మీద
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదలతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం
No comments:
Post a Comment