What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 27 November 2014

రాధ పరాశక్తి స్వరూపిణి. వేద ఉపనిషత్తులలో, వేద భాగాలలో రాధ ప్రస్తావన ఉంది. (రాదా దేవి పేరు భాగవతం లో, భరతం లో లేదు కేవలం బృందావనం లో ఉన్నది ఎందుకు ??)

రాధ పరాశక్తి స్వరూపిణి. వేద ఉపనిషత్తులలో, వేద భాగాలలో రాధ ప్రస్తావన ఉంది. పురాణాలలో - దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం - వంటివి రాధా శక్తిని వర్ణించాయి. పరాశక్తి ప్రధానంగా ఐదు పూర్ణ శక్తులుగా భాసిస్తోంది. అవి - ౧. దుర్గ ౨. లక్ష్మి ౩. సరస్వతి ౪. గాయత్రి ౫. రాధ. ఇందులో రాధ అనుగ్రహం అత్యంత దుర్లభం. పరమాత్మయొక్క హ్లాదినీ శక్తి, ప్రేమానందశక్తి - రాధాదేవి.
మంత్ర శాస్త్ర విషయాల్లో రాధామంత్రాలు చాలా ఉన్నాయి.
ఇప్పటికీ ఆ ఉపాసకులు అనేకమంది ఉన్నారు. రాధాకృష్ణ సాక్షాత్కారం పొందిన మహాత్ములు చాలామంది సనాతనకాలం నుండి ఉన్నారు.
నారాయణ తత్త్వం గోలోకంలో కృష్ణురూపంగా నిత్యం ఉన్నది. పరమ పురుషుడు శ్రీకృష్ణుడయితే, పరాశక్తి రాధ అయ్యింది. రాసమండలానికి అధిష్టాన దేవత- రాసేశ్వరి అయిన రాధ.
వ్యాసదేవుడు ఒక చోట చెప్పనిది మరోచోట వివరిస్తారు. ఒకచోట క్లుప్తంగా చెప్పినదానిని మరోచోట విస్తృతంగా అందిస్తారు. అలాగే ఒకచోట గూఢంగా చెప్పిన విషయం మరోతావున ప్రకటంగా చెప్పబడుతుంది. ఏది ఎందుకు? అనేదాిని సంప్రదాయ ధోరణిలో పరిశీలించాలి.
ఋషుల రచనలను మామూలు రచనలుగా, మామూలు సాహితీ పరిశోధలుగా పరిశీలించడం తగదు. ఉపాసనా సంప్రదాయం, యోగ సంప్రదాయం, ధార్మికరీతి, తాత్త్విక రహస్యం దాగి ఉన్నవే ఋషి రచనలు.
భాగవతంలో రాధ చెప్పబడింది. కానీ అందులో గూఢ నాయిక. గోపికలలో ఒకతెగా అవతరించి, మొత్తం గోపికలందరినీ రాసలీలలో ప్రవేశింపజేసిన కృష్ణుని ప్రేమశక్తి రాధ. ఆ మాటకొస్తే భాగవతంలో ఏ గోపిక పేరూ ప్రస్తావించలేదు. కనుక రాధ ప్రస్తావన లేదని అనడమూ సబబు కాదు. కృష్ణ ప్రేమలో వారికంటూ భిన్నమైన వ్యక్తిత్వం లేదు. అంతా గోపికాశక్తే.
రాధను కల్పిత పాత్ర అనడం నాస్తికత్వమే. కృష్ణ, రామాదులను కూడా కల్పిత పాత్రలనేవారు ఉన్నారు కదా! రాధ నిస్సందేహంగా దేవతామూర్తి, ఇంకా చెప్పాలంటే పరిపూర్ణ పరాశక్తి.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML