What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 November 2014

పరమశివుడి ఎనిమిది మూర్తులతో ఈ జగత్తు నిండివున్నది

పరమశివుడి ఎనిమిది మూర్తులతో ఈ జగత్తు నిండివున్నది. దారమునందు మణుల పూసలవలె ఈ జగత్తంతయు, శివునియందు ప్రతిష్ఠను పొంది, శివుని యందే వ్యాప్తమైయున్నది.
శర్వోభవః తథా రుద్రా ఉగ్రో భీమః పశోః పతిః!
ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః!!
శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అనునవి శివుని యొక్క అష్టమూర్తులు.
భూమ్యంబ్వగ్ని మరుద్ వ్యోమక్షేత్రజ్ఞార్క నిశాకరాః!
అధిష్టితాశ్చ శర్వాద్యైరష్ట రూపై శ్శివస్య హి!!
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు మొదలగు వానిని పై అష్టమూర్తుల స్వరూపములో శివుడు క్రమముగా అధిష్ఠించి ఉన్నాడు.
శివునియొక్క దేహమే ఈ జగత్తు. నీవు నీ దేహములో ఏవిధంగా నఖ-శిఖ పర్యంతం వ్యాపించి ఉన్నావో, శివుడు కూడా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. నీ దేహములో శివుడు ఏవిధంగా అధిష్ఠించి ఉన్నాడో, అదేవిధంగా పంచ భూతాలలో, సూర్యునిలో, చంద్రునిలో, ప్రతి జీవిలోనూ శివుడు అధిష్ఠించి వున్నాడు.
యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీయ యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు”
ఏ రుద్రులు అగ్నియందు, నీటియందు ఔషధులయందు సమస్త భువనములయందు వ్యాపించియున్నాడో, అట్టి రుద్రులకు నమస్కారమని తెలిపినది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML