లేపాక్షీ దేవాలయ నిర్మాణం శ్రీ కృష్ణదేవరాయల వంశానికి చెందిన సాళువ నరసింహరాయల కాలంలో విరూపాక్షుని ఆధ్వర్యంలో జరిగింది... ఇది ఎన్నో అద్భుతాలకు నిలయం..
ఇప్పుడు మీరు చూస్తున్న మూడు చిత్రాలలో మొదటిది.. వేళ్ళాడే స్థంభం పూర్తి రూపం...
అంటే ఈ స్థంభం కేవలం పై కప్పు ఆధారంగా చేసుకుని వేళ్ళాడుతూ ఉంటుంది...
క్రింద నేల నుండి ఒక సెంటీమీటరు ఖాళీ (మూడవచిత్రాన్ని చూడండి)ఉంటుంది...
ఆ ఖాళీ నుండి మన చీర కొంగును ఇవతల నుండి అవతలకు(రెండవ చిత్రంలో చూపినవిధంగా) చాలా సులభంగా దూర్చవచ్చన్న మాట...
మన హిందూ దేవాలయాలను పూర్తిగా కొల్లగొట్టాలని వచ్చిన కొంత మంది తురుష్కులు ఈ స్థంభాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారట... అయితే వారి ప్రయ
త్నంలో ఆలయం క్రుంగటం కనపడిందట..
ఒకవేళ ఆ స్థంభాన్ని తొలగించినట్లయితే పూర్తిగా ఆలయం నేలమట్టమవుతుంది..
ఆ ప్రయత్నం లో అంతా సమాధి అవుతారని భయపడి వెనక్కు తగ్గారట...
ఎందుకంటే ఆలయ పూర్తి భారం(గరిమనాభి) ఈ స్థంభం దగ్గర వచ్చే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఎంతటి నిర్మాణ కౌశలత్వం(ఇంజనీరింగ్ ఎఫిసియెన్సీ) అంతటి కౌశల్యాన్ని చూసిన తురుష్కులకు నోట మాట రాలేదట.. చివరికి ఏమీ చేయలేక కనపడిన విగ్రహాన్నెల్లా ధ్వంసం చేసారు కానీ..
ఈ స్థంభాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు...
వీలుంటే లేపాక్షీ ఆలయాన్ని దర్శించండి... ఇది అనంతపురం జిల్లా...హిందుపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఇంకా మరెన్నో విశేషాలు ఈ ఆలయంలో ఉన్నాయి


No comments:
Post a Comment