ఓం
Secrets of Sacred River Ganga-1
గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో రహస్యాలేంటి?
ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని
ధార్మిక గ్రందాహాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.
యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :
1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin) ' అనే బ్రిటిష్ వైద్యుడు (
British physician) గంగా జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక
అన్నాలెస్ డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut Pasteur) లో ఒక
పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని
కలిగించే bacterium Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది కేవలం 3
గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో
(distilled water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. ఇది మన
గంగమ్మ తల్లి శక్తి.
సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్
నుండి తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన
హూగ్లీ నుండి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా
కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా
ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే
ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా (anaerobic
bacteria) వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే
ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది గంగకున్న శక్తి.
ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి
తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది
మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక్తి.
To be continued ..............................

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment