What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 8 March 2013

మోడీ... నరెంద్ర మోడీ...

మోడీ...
నరెంద్ర మోడీ...

మోడీ కరడుగట్టిన హిందుత్వవాది అన్న సర్వసాధారణ విమర్శ మొదలు, దేశంలో అతి పెద్దముస్లిం అన్న తీవ్ర విమర్శలు వినపడతాయి. కొందరికైతే ఆయన ‘హిందూ హృదయ సమ్రాట్’.
అయోధ్య ఆందోళనతో మొదలైన విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆవిమర్శల ఎదురుగాలిలోనూ నాయకత్వ పటిమకు పదును పెట్టుకున్నవాడు మోడీ. ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీయే అన్నంతవరకు ఆయన ప్రస్థానం సాగింది. సెప్టెంబర్ 7, 1950లో వాద్‌నగర్‌లో పుట్టిన మోడీ జీవితం, ఆలోచన, రాజకీయాలే ఆయన్ను నడుపుతున్నాయన్నమాట వాస్తవం.ఓబీసీల నుంచి వచ్చిన మోడీ చిన్ననాడే ఆ సంస్థ పట్ల ఆకర్షితుడై, అరవై దశకంలో ఇండోపాక్ యుద్ధం వేళ రైల్వే స్టేషన్‌లలో సైనికులకు స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఏబీవీపీలో ఉన్నపుడే రాష్ట్రంలో నవనిర్మాణ్ ఆందోళన వచ్చింది. అరవై దశకంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన యువజన నిరసనల పరంపరకు 1974 నాటి నవనిర్మాణ్ ఆందోళన కొనసాగింపు అనిపిస్తుంది.
నెహ్రూ కుటుంబత్యాగాలకి దేశం బలికావలసి వచ్చిందని కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశాల వేదిక మీద నుంచి ఆయన సంధించిన బాణం వెనుక శక్తి,....దానికి ముందెప్పుడో, ఓ ముస్లిం ప్రతినిధి బృందం ఆలింగనం చేసుకుని లేసు టోపీ పెట్టబోతుంటే నిండు సభలోనూ నిరాకరించడం వెనుక ఉన్న హిందుత్వ భక్తి ఆ ప్రయాణానికి చోదకశక్తులే. మోడీ(త్వ) హిందుత్వను విమర్శించే వారు ఎందరో, ఆయన రాజకీయ సంకల్పాన్ని ప్రశంసించేవారూ అంతమంది ఉన్నారు. రహదారుల విస్తరణలో అడ్డం వచ్చిన దేవాలయాలను కూలగొట్టించాడని వీహెచ్‌పీ అలిగినా మోడీ తొణకలేదు. మోడీకి వ్యతిరేకంగా ఏ చిన్న విమర్శ వచ్చినా జాతీ యమీడియా పనిగట్టుకు ప్రచారం చేసినా బెసకలేదు. నాలుగోసారి (2012) ముఖ్యమం త్రి అయ్యారు. ఆ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి ఆయనే.
మోడీ తన ఆరెస్సెస్ మూలాలను ఏనాడూ దాచలేదు.
అక్టోబర్ 7, 2001లో మోడీ అధికారం చేపట్టారు. నాలుగు మాసాలకే- ఫిబ్రవరి, 2002లో గోధ్రా, అనంతర ఊచకోత జరి గాయి. ఈ పదేళ్లలో మోడీ మీద వచ్చిన కేసులు, తీర్పులు, కమిషన్లు అసంఖ్యాకం. హింసాకాండలో మోడీ పాత్ర ఉన్నదని బహిరంగ ఆరోపణ. దీనిని కాంగ్రెస్, బీజేపీ తమ కు అనుకూలంగా మలుచుకోదలచి రెండూ బొక్కబోర్లాపడ్డాయి. అయినా మోడీ రాష్ట్రం లో తిరుగులేని నాయకుడు. అభివృద్ధే ఆయన మంత్రం. రాజనాథ్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన తరువాత మోడీ ప్రధాని అభ్యర్థిత్వం అంశం ఊపందుకుంది. అద్వానీ సహా నాయకులంతా ఆ పేరే స్మరిస్తున్నారు..@ బహుజన బంధు.

 
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML