What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 19 December 2014

నారాయణ వ్రతంలో వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది

నారాయణ వ్రతంలో వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి. ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణగుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.
ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్యమంత్రంగా అందించింది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML