ఇప్పుడు మీరు చూస్తున్నది కేరళ లో చాలక్కూడి లోని పిశారిక్కల్ భగవతి దేవి(భద్రకాళీ) ఆలయానికి సంభంధించినది.. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.. ఇది కేరళలో ఉన్న 108 దుర్గాదేవి గుడులలో ఒకటి.. ఇక్కడ జగన్మాతను తిరుమంధంకుణ్ణు భగవతి (దుర్గాదేవి పేరు) అనే పేరుతో అర్చిస్తారు.. ఈ ఆలయంలో ప్రధానంగా రెండు దేవతా మూర్తులు ఉన్నాయి. మొదటిది వనదుర్గామాత.. రెండవ విగ్రహం భగవతీ దేవిది.. ఇది ప్రధానంగా భద్రకాళీ దేవిని పూజించే ఆలయం... ఇక్కడ వనదుర్గ, భగవతీ దేవితో పాటు వినాయకుడు, శివుడు, భద్రకాళీ దేవిని అర్చిస్తారు..
చాలక్కూడి ప్రాంతం త్రిస్సూర్ కు అంగామలై కు మధ్యలో నేషనల్ హైవే 47 మీద ఉంది.. ఇది త్రిస్సుర్ కు 30 కి.మీ దూరంలో... ఎర్నాకులానికి 50 కి.మీ దూరంలో ఉంది.. కొచ్చిన్ విమానాశ్రయం నుండి 25కి.మీ. దూరంలో రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్నది..

No comments:
Post a Comment