నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః
హరికేశాయ అంటే పరమేశ్వరుడి స్వరూపం చెప్తున్నారు. పచ్చని కేశములు కలవాడు. పచ్చని కేశములు అనగా వ్యక్తిని కానీ హరికేశా అని వర్ణించాం అంటే నల్లని జుట్టు గలవాడు అని. అంటే పచ్చగా ఉంది జుట్టు పండిపోయిన జుట్టు కాదు. నల్లని జటాజూటం కలిగి ఉన్నటువంటి వాడు.
ఉపవీతినే – యజ్ఞోపవీతం వేసుకొని కూర్చున్నాడట. అందుకే
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్|
ప్రజాపతి అంటే సమస్తములైన ప్రజలకు అంటే జీవకోటికి. ప్రజలు అంటే మానవులు మాత్రమే కాదు. ప్రజ – బాగా పుట్టినవి అని అర్థం. ఈ పుట్టిన వాళ్ళంతా ప్రజ. ఈ జీవకోటి అంతటికీ ఎవడు పతో వాడు ప్రజాపతి. ఈ ప్రజాపతి అనే ఆయనకి సహజంగా ఉందిట యజ్ఞోపవీతం. అంటే మనకి ఒక కర్మ చేయాలి అంటే యజ్ఞోపవీతం వేసి అర్హతని ఇస్తారు. మరి విశ్వకర్మను చేయాలంటే ఆయనకి ఎవరు యజ్ఞోపవీతం వేస్తారు? ఆయనని కన్నవాడు ఎవరైనా ఉంటే యజ్ఞోపవీతం వేస్తాడు. ఆయనే తనంత తాను అయినవాడు కనుక విశ్వకర్మను చేయడానికి యజ్ఞోపవీతంతోనే వచ్చాడట. విశ్వమనే యజ్ఞాన్ని చేయగల అధికారం తనంత తాను పొందాడు కనుక ఉపవీతినే అన్నారు. అలా ఉన్నవాడు
పుష్టానాం పతయే నమః – అంటే ఇక్కడ మనకి బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుణ్ణి వర్ణించారు. అంటే బ్రాహ్మణుడే శివుడాండీ? ఇంకెవరూ కాదా? అని ఇలాంటి ప్రశ్నలు చాలా తొందరగా పుడతాయి. తర్వాత ఏం చెప్తున్నానో వినరు. చాతుర్వర్ణములూ పరమేశ్వర స్వరూపములే. విశ్వంలో గడ్డిపరక నుంచి మహావృక్షం వరకు ఈశ్వరుడు అని చెప్పినప్పుడు చాతుర్వర్ణములూ ఆయన స్వరూపములే. చాతుర్వర్ణములలో సమాజానికి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి జరగాలి. వాడి ద్వారా సమాజానికి అది జరిగినప్పుడు సమాజాన్ని పోషించే పరమేశ్వరుడు ఆ పోషించే శక్తిని ఒక్కొక్క వర్గానికి ఇచ్చి పంపిస్తున్నాడు ఆ జీవుల కర్మగతి ప్రకారంగా. వాడికి ఆ దేహంలో ఆయా శక్తులనిచ్చి బాధ్యతలని పెట్టాడు. అందరూ యజ్ఞాలు చేస్తాం అంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? అందుకు ఒక రకమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది పరమేశ్వరుడు విశ్వంలో అందరికీ పెట్టాడు. మనకే కాదు గ్రహాలలో చాతుర్వర్ణాలు ఉన్నాయి. వృక్షాలలో చాతుర్వర్ణాలు ఉన్నాయి. రాళ్ళల్లో చాతుర్వర్ణాలు ఉన్నాయి. రాళ్ళల్లో చాతుర్వర్ణాలు తెలియాలంటే స్థపతులని అడగండి చెప్తారు. ఏది బ్రాహ్మణ శిల? ఏది క్షత్రియ శిల? ఏది వైశ్య శిల? ఏది శూద్ర శిల? ఏ శిల ఏ శిల్పానికి వాడాలి? ప్రతిదాన్లో ఉంది. బ్రాహ్మణ శిల అంటే జంధ్యం వేసుకొని కూర్చోదు. దానికో స్వభావం ఉంది. వీటన్నిటికీ ఆది ఆయనే. అందుకు పరమేశ్వరుడు చాతుర్వర్ణ స్వరూపుడుగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు.
అన్నానాం పతయే నమః అని చెప్పిన తర్వాత బ్రాహ్మణుడిని ఎందుకు చెప్పారు అంటే ఆ వేదం ధర్మాన్ని విశ్వంలో ప్రతిష్ఠ చేయవలసిన బాధ్యత బ్రాహ్మణుడి మీద ఉన్నది.
ఈ రుద్రాన్ని సక్రమంగా నిత్యం స్వర సహితంగా చదివి ఉచ్చరించి ఆరాధించవలసిన బాధ్యత బ్రాహ్మణులకి ఉన్నది. మిగిలిన వారందరూ రుద్రనమక స్తోత్రం మొదలైనవి చదువుకోవచ్చు. అందుకే వాటిని అందుబాటులో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మహర్షులు లోక క్షేమం కోరుకున్నారు. అందుకే వేదాలను వ్యాసం చేసిన వ్యాసదేవుడే వేదాలలో ఉన్న రుద్రం వైదిక మార్గంలో ఉంటూ వేదాధ్యయన తత్పరులై ఉపనయన సంస్కారం ఉన్న వారికి బాధ్యతగా అప్పగించి అది మిగిలిన వారందరూ ఫలితం పొందడానికి స్తోత్ర రూపంలో అదే భావాల్ని, అవే అక్షరాలని తీసుకొని సమకూర్చారు. అలా ఎవరు చేయగలరు? ఋషే చేయగలరు. ఆయన అలా చేశాడు కదండీ! నేనూ వేదమంత్రాలకి శ్లోకాలు వ్రాసేస్తాను అంటే కుదరదు. ఎవడు దర్శించాడో వాడే దానిని ఎలా modify చేసి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఔషధాన్ని ఏవిధంగా మలచి రోగికి తగ్గట్టు ఇవ్వాలో డాక్టరుకే తెలుసు. అంతేకానీ మనంతట మనం dilute చేయాలా? Densify చేయాలా? మనమెవరం నిర్ణయించగలం? అదేవిధంగా ఋషి మనకి రుద్ర నమకస్తోత్రం మొదలైనవి ఇచ్చారు. ఇవి అన్నీ కూడా అందరూ పారాయణ చేయవచ్చు స్తోత్ర రూపంలో ఉన్నవి. విష్ణు సహస్రం మొదలైనవి వైదికమైన విశ్వ శక్తిని అందరికీ అందజేయడానికి మహర్షులు అందజేసినవి.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment