What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 19 December 2014

పూజాఫలం



పూజాఫలం

ఋణం - అనుబంధం

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః |
ఋణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన ||


పూర్వజన్మల అనుబంధం వలనే పశువులు, భార్య, పిల్లలు, ఇళ్లు, వాకిళ్లు లభిస్తు ఉంటాయి. ఆ ఋణం తీరిపోగానే అవి మనలని విడిచి వెళ్లిపోతుంటాయి. భగవన్నియతితో ఇలా జరిగే వాటికి బాధపడడం వివేకం కాదు. దుఃఖించకూడదు.

పుత్రుడు - మిత్రుడు

రాజవత్పంచ వర్షాణి దశవర్షాణి దాసవత్ |
ప్రాప్తేతు షోడశేవర్షే పుత్రం మిత్ర వదాచరేత్ ||

మన పిల్లలు ఎన్నేళ్ళు ఎలా ఉండాలో (ఉంచాలో) శాస్త్రం నిర్దేశించింది. మొదటి ఐదు సంవత్సరాలు రాకుమారునిగా లాలించాలి. ఆపై పది సంవత్సరాలు పుత్రుణ్ణి ఒక సేవకునిగా భావించి, పనులు చేయిస్తూ, మంచిని చెబుతూ, తన భవిష్యత్తు నిర్మాణం చేయాలి. ఆ కాలంలో ముద్దు, సోమరితనం, అజ్ఞానం ముఖ్యమైన శత్రువులు. వాటిని చేరకుండా జాగ్రత్త పడాలి. కొడుక్కి పదహారేళ్ళు వచ్చేస్తే ఇక ఒక మిత్రుణ్ణి (స్నేహితుని) చూచినట్లుగా చూడాలి. అటువంటి వ్యవహారమే కలిగి ఉండాలి. దండన మరి పనికిరాదు. తిరగబడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లలు స్నేహితుల్లా కలసి మలసి హాయిగా మనోభావాలను పంచుకుంటూ ఆదర్శంగా జీవించమని శాస్త్రం అశ్వాసిస్తున్నది.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML