What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 25 August 2013

ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం(University)- భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం :-

ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం(University)- భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం :-


ప్రపంచంలోని మొదటి విశ్వవిద్యాలయం మన భారతదేశంలోనే ఉండేది. అదే నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయం బీహార్ లోని పాట్నాకు సమీపంలో ఉంది. 5వ శతాబ్దం నుండి 1197 ADవరకు ఇది అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. ఎంతో మంది హిందువులు, బౌద్ధులు ఇక్కడ చదువుకునేవారు. భారతదేశం నుండేగాక చైనా, గ్రీస్, టర్కీ వంటి దేశాల నుంచి వచ్చే పండితులను కూడా ఈ విశ్వవిద్యాలయం ఎంతో ఆకర్షించేది. దాదాపు 2,000 ఉపాధ్యాయులు, 10,000 విద్యార్ధులు నలందలో ఉండేవారిని చెబుతారు.

1193AD లో దండయత్ర చేసిన భక్తియార్ ఖిల్జి సైన్యం విశ్వవిద్యాలయన్ని సర్వనాశనం చేసింది. నలందలో ఉండే గ్రంథాలయానికి(Library) ఖిల్జీ సైన్యం నిప్పు పెట్టగా అది 6 నెలల వరకు మండుతునే ఉందని చెప్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నలంద విస్వవిద్యాలయం యొక్క గ్రంథాలయంలో ఎంత జ్ఞానసంపద ఉండేదొ !
 
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML