What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 25 August 2013

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది " శ్రీ మహాకాళేశ్వరస్వామి "

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది " శ్రీ మహాకాళేశ్వరస్వామి "

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది "మహాకాళ లింగము". మద్య భారతదేశమున, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్‌కి 80 కి . మీ దూరంలో ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదీతీరాన " శ్రీ మహాకాళేశ్వర
స్వామి " అను జ్యోతిర్లింగము ఉంది. పూర్వము అవంతదేశము యొక్క రాజధాని ఉజ్జయినిలో ఉజ్జ్వలుడు అను రాజు, అతని సతీమణి బుద్దిమతి,అతని ప్రజలు పరమేశ్వరానుగ్రహముతొ చీకు చింతలు లేక హాయిగా జీవిస్తున్నారు. ఉజ్జ్వలమహారాజు వైభవాన్ని చూచి, పర రాజులు కన్నుకుట్టి దండయాత్రకు వచ్చారు. రక్తపాతం ఇష్టం లేని మహారాజు తన భార్య సహితంగా ఉద్యానము నందలి శివాలయమునకు పోయి, స్వామిని పూజించాడు. ఉజ్జ్వలుని మంచితనానికి ఆనందించిన పార్వతీ పరమేశ్వరులు దర్శనం
ఇచ్చారు. ఆ రాజు దంపతులను దీవించి, శివలింగ ప్రతిష్ట చేసిన, పర రాజులు నీకు సామంతులుకాగలరు అని ఆనతీయగ, ఆ విధముగా చేయుటకు రాజదంపతులు తమ అంగీకారాన్ని తెలియపర్చారు . అంతట మహామంత్రి వచ్చి, "ప్రభూ! యుద్దము చేయుటకు వచ్చిన రాజులందరూ సామంతులుగా ఉండుటకు నిర్ణయించారు" అని తెలియజేసాడు. అవంతీ పురాధీశ్వరుడు ఉజ్జయిని యందు లింగ ప్రతిష్ట చేశాడు. ఈ లింగమును కాళుడు కొలిచినాడు. కాళుడు అంటే యముడు. కాళుడు కొలిచిన ఈ స్వామికి "మహా కాళేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.
 
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML