What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 August 2013

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి

జనకమహీజాని ప్రకృతి - పురుషుడికి బేదం చెప్పండి అని యాజ్ఞవల్క్య మహామునిని అడిగాడు.
యాజ్ఞవల్క్య మహాముని : ఓ దీపిక నుండి అనేక దీవులు ఉద్భవించినట్టు సత్వరజస్తామోగుణ పరిణామాల వల్ల ప్రకృతి నుండి విచిత్ర రూపాలు ఉద్భవిస్తున్నాయి. సంతోషం, ఆనందం, ఆరోగ్యం, క్రోధరాహిత్యం, ఋజత్వం, పరిశుద్ధి, ప్రకషత, సుస్తిరత్వము, అహింస, నిర్మలశ్రద్ద, వినీతి, లజ్జ, శౌచము, సమత, సదాచారము, కార్పణ్య రాహిత్యము, ఆదిగాగలవి సత్వ గుణాలని ఆర్యులు ఉపదేసిస్తున్నారు. దర్పము, క్రోధము, అభిమానము, మాత్సర్యము, కారుణ్య విహీనత, నిరంతర భోగభిలాష, అహంకారము ఆదిగాగలవి రాజసమని, మోహము, మౌర్ఖ్యము ఆదిగాగలవి తామసాలని విజ్ఞులు ఏకగ్రీవంగా వినుతిస్తున్నారు.
తన గుణాల ప్రభావం వల్లనే ప్రకృతి అంతరాత్మలో వేర్వేరు వికృతులు ఉద్భవింపజేస్తున్నది. ఇది దాని సహజ స్వభావము. పురుషుడు చైతన్యాత్మకుడు, ప్రక్రుతి జడ స్వభావం. ప్రకృతి పురుషుని సదా తన గుణాలవైపు ఆకర్షిస్తున్నది. పరతత్వం ప్రక్రుతి గుణాలచే సమాకర్షితమైన యెడల సంసారబద్దమై వేర్వేరు సుకృత, దుష్కృత కర్మలు ఆచరిస్తున్నది..

నాకు ఒక చిన్న సందేహం ఇది మీకు అర్ధమౌతుందా? అర్ధమైతే చెప్పగలను. ఇది వేదాల సర్వం.... మీకు అర్ధంఅవుతుంది అంటేనే ఈ పోస్ట్ తరువాతి బాగం పోస్ట్ చేస్తాను.. లేదంటే ఇంత చెప్పి వ్యర్ధం అవుతుంది.. గోడకి కొట్టిన సున్నం లాగా ఐపోతుంది..

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML