చిదంబర రహస్యం
‘చిత్’ అంటే చైతన్యం. ‘అంబరం’ అంటే నిర్మల ఆకాశం (ఈథర్). చిదంబరం కోవెలలో
తెరవెనుక దాగియున్న ఆ ఓంకారుని నిర్మల చైతన్యమే చిదంబర రహస్యం.
ఈ రహస్యాన్ని సాధారణ మానవమాత్రులు ఛేదించలేరని అంటారు. తత్వాన్వేషణతో ఆత్మ-విచక్షణా ఙ్ఞానాన్ని పొందగలుగుతేనే అది సాధ్యం.
ఎవరైతే మనలో దాగివున్న ఆ పరమాత్ముడి దరిచేరగలుగుతారో వారికే తెరవెనుక నున్న ఆ ఆదికేశవుడి ఉనికీ, పరమార్ధం గోచరిస్తాయని ప్రతీతి....
---
శివదేవుడి ఉనికి రూపాలు 5 రకాలుగా వుంటాయని అంటారు, అవి జల, వాయు అగ్ని,
భూమి, ఆకాశంచిదంబరంలో ఆకాశ, రూపంగా కొలుస్తారు,..చిదంబర రహస్యం, ఓ అద్బుతం,
ఆశ్చర్యం, ఎవరి భావన ప్రకారం, ఆ రూపంలో నిరాకారుడైన ఆ దేవదేవుని రూపం
కన్పిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతికల్గిస్తుంది,..
ఆలయమంతా నాట్యకళాసంబంధమైన శిల్పాలతో అందంగా వుంటుంది,.. ప్రతీ ఒక్కరూ ఒకసారైనా దర్శించాల్సిన క్షేత్రం ,భూలోక కైలాసం,చిదంబరం...
*****
గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం
ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను
తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు
వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు
రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది.
పూజారి తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన
భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.
అందువల్ల చిదంబర రహస్యం
ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన
(భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని,
ముక్తిని అనుభవించగలడు
No comments:
Post a Comment