What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 28 February 2015

సనాతన ధర్మాన్ని పాటించే వారికి భగవద్గీతే ఆదర్శం



ముక్తిర్మోక్షోమహానందః మహానందమే మోక్షము అని అమర కోశం నిర్వచనం. దుఃఖం కొంచమైనా లేని ఆనందమే ముక్తి. సనాతన ధర్మాన్ని పాటించే వారికి భగవద్గీతే ఆదర్శం. అనుసరణీయం. గీత 14వ అధ్యాయం రెండవ శ్లోకంలో భగవానుడిలా చెప్పాడు
ఇదం జ్ఞానము పాశ్రిత్యమమ సాధర్త్య మాగతాః
సర్గేపినోపజాయంతే ప్రలయే నవ్యధంతిచ

ఈ గుణత్రయ విభాగ యోగంలోని జ్ఞానమును పొందినట్లైతే భగవత్సాయుజ్యమును పొంది, సృష్టి సంహారాలకు లోనుకాదు. సాధర్మ్యము అనగా సాయుజ్యమే మోక్షమని గీత నిర్వచించింది. ఇలా 9వ అధ్యాయం చివరి శ్లోకంలోను, 18వ అధ్యాయం 65వ శ్లోకంలోను భగవానుడిలా చెప్పాడు. మన్మనాభవ మద్భ క్తోమద్యాజీ మాం నమస్కుడు, మామే వైష్యసి...నాపై మిక్కిలి ప్రీతి కలవాని మీద నాకు కూడా మిక్కిలి ప్రీతి ఉంటుంది.


ఇది సహజమే గదా! అటువంటి నా భక్తుని ఎడబాటును సహించలేక అతన్ని నా వద్దకు చేర్చు కుంటాను. పరంబ్రహ్మ సాయుజ్యమే మోక్షమని నిశ్చయంగా చెప్పేం గీతా సిద్ధాంతాన్ని రామానుజదర్శనం సమర్ధిస్తూంది. ముక్తుడు పరమపదంలో నారాయనుడితోపాటు అతని కల్యాణ గుణాలను సంతృప్తిగా ఆనందంగా అనుభవిస్తాడు.

రామానుజ దర్శనంలో, తన రక్షణ భారాన్ని భగవంతునిపై ఉంచిన ప్రపన్నుని సర్వ పాపాలను పరిహరించి పరమాత్మ తన స్థానమైన వైకుంఠమున చేర్చుకొను విధానము, 'సంత్సంగాత్ భవ నిస్పృహా గురు ముఖాత్, ముక్త్కోర్చర్ధిన పూర్వపక్ష...' అనే రెండు శ్లోకాల్లో విరింపబడింది.

సత్సంగం వల్ల సంసారములో వివక్తుడై సదాచార్య సమాశ్రయణం చేసి, వారి మంత్రోపదేశానుసారం శ్రియః పతిని శరణాగతి చేసి, ఆగామి కర్మ తామరాకుపైన నీటిబొట్టులా అంటకుండా చేసికొని, నిప్పులో పడిన దూదివలె సంచిత కర్మను భస్మం చేసి, ప్రారబ్ధ శేషమును అనుభవించి, తన ఉపాసనా అతిశయముచే ప్రసన్నుడైన పరమాత్మ ప్రకృతి బంధాన్ని నిశ్శేషం చేయగా, సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంథ్రమును చేధించుకొని వెలుపలికి వచ్చి అర్చిరాది మార్గంలో పయనించి పరమపదం చేర గలడు. ఈ పద్ధతి అంతా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము 24 నుంచి 27వ శ్లోకం వరకు సంగ్రహంగా సూచించబడింది. అదే ముక్తి ఫల స్వరూపం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML