What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 13 February 2015

కలియుగంలో ఆయుష్షు తక్కువ. బుద్ధి తక్కువ, జ్ఞానం తక్కువ. అనేక బాధలు, ఈతిబాధలు, ఉపద్రవాలతో ఉంటారు.

కలియుగంలో ఆయుష్షు తక్కువ. బుద్ధి తక్కువ, జ్ఞానం తక్కువ. అనేక బాధలు, ఈతిబాధలు, ఉపద్రవాలతో ఉంటారు. అనేక కర్మలు చేస్తూ ఉంటారు. వాటివల్ల వచ్చేది సుఖంకాదు సుఖం అనుకుంటారు కానీ దుఃఖాన్నే అనుభవిస్తూ ఉంటారు. కనుక సర్వజీవకోటికీ శుభము, మంగళము, శాంతి, ఆనందము, సంతోషము కలిగేది
"యేనాత్మా సుప్రసీదతి!!" - దేనిచేత మన బుద్ధి ప్రసన్నమవుతుందో స్వామీ నువ్వు సర్వజ్ఞుడవు, వ్యాసానుగ్రహం పొందిన వాడివి. నీయొక్క అనుగ్రహం చేత అది వినదలిచాం అని శౌనకాదులు చెప్పినదానిలో పరమోత్తమమైన ధర్మాన్ని చెప్పమని అడుగగా అప్పుడు సూతులవారు శుకయోగీంద్రునికి నమస్కరించి
యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ!
పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః
తం సర్వభూతహృదయం మునిమానతోస్మి!!
పురాణాలన్నింటిలోకి పరమతత్త్వ స్వరూపమైన, మధురాతి మధురమైన ఆనందదాయకమైన బ్రహ్మతత్త్వాన్ని పిండి పితికినటువంటి గ్రంథమే శ్రీమద్భాగవతం అని చెప్పడం మొదలు పెట్టారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML