What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 4 December 2022

*స్తంభ చతుష్టయం

 *స్తంభ చతుష్టయం.*


*శైవాగమాలలో పూజ ప్రధానంగా రెండు విధములగా చెప్పబడింది అది ఒకటి ఆత్మార్ధపూజ రెండవది పరార్ధ పూజ.తనకోసం తాను చేయునది ఆత్మార్ధపూజనియు. అలాగే లోక కళ్యాణార్ధం, పరులకోసం విద్యుక్తముగా ఆగమోక్తంగా నిర్మించిన దేవస్థానములలో దైవాన్ని శిలారూపకంగా  ప్రతిష్టించి పూజించు దానిని పరార్ధపూజనియు అందురు.*


*ఈవిధంగా పరార్ధ పూజార్ధం నిర్మించిన దేవస్థానాదులలో  ధ్వజస్థంభాన్ని కూడా స్థాపిస్తారు.ప్రధాన దేవతను ఉద్దేశించి జరిగే మహోత్సవాది కైంకర్యములకు సర్వదేవతలకు ఆహ్వానము తెలుపుటకు ఆ దేవత యొక్క వాహనమును ధ్వజపటం గా చిత్రీకరించి అధివాస పూర్వక ప్రాణప్రతిష్ఠ గావించి ధ్వజారోహణ చేస్తారు. శివాలయములో వృషభాన్ని చిత్రీకరించి ధ్వజారోహణం చేస్తారు. ఇందుకుగాను దేవస్థానముల లో జరిగే పూజా కైంకర్యాలలో ధ్వజస్తంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతగలదు.*


*ఈ స్తంభము నాలుగు విధములుగా ఉండునని కపర్దీ సంహిత తెలియజేస్తున్నది.*


*శ్లోకం.*


*మేఖలాసహితంకుర్యాద్ధ్వజస్తంభముదాహృతమ్.*


*నన్దినాసహితంకుర్యా న్నాందికంస్తమ్భముచ్యతే.*


*శూలేనసహితంకుర్యాచ్ఛూలస్తమ్భముదాహృతమ్.*


*దీపార్ధం స్థాపనంకుర్యాద్దీపస్తమ్భముదాహృతమ్.*

           

 *మేఖలా సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని ధ్వజస్తంభమనియు, నంది సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని నంది స్తంభమనియు,త్రిశూల సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని శూలస్తంభమనియు, దీపమును‌ వెలిగించుట కొరకు  స్థాపింపబడినటువంటి స్తంభమును దీపస్తంభమని అందురు.*

                   *కపర్దీ‌ సంహిత (శైవాగమం).*


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML