What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 12 March 2016

భీష్మాష్టమి



భీష్మాష్టమి

మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు. భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి పూజామందిరాన్ని, ఇంటికి శుభ్రం చేసుకోవాలి. ఇంటి వాకిలి, పూజామదిరంలో ముగ్గులతో అలంకరించాలి. గుమ్మానికి తోరణాలు కట్టి, గడపలకు పసుపుకుంకుమలు అద్దుకోవాలి. తరువాత తలంటు స్నానం చేసుకుని తెలుపురంగు దుస్తులను ధరించాలి. ఈ దినం అంతా ఉపవాసం ఉండి, మహాభారత గ్రంథాన్ని పఠించాలి, లేకపోతే వినాలి. రాత్రి జాగరణ ఉండాలి. పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలతో తీర్చిదిద్దాలి, తామలపువ్వులు, తులసీ దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యం కోసం పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత సంకల్పం ఈ విధంగా చెప్పాలి … మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రాహ్మణః శ్వేతవరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే స్వగృహే శాకాబ్దే అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే మన్మథ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘ మాసే శుక్ల పక్షే అష్టమ్యాం శుభతిథౌ వాసరస్తూ భౌమవాసర యుక్తాయాం అశ్విని నక్షత్ర యుక్త సాధ్య యోగ భద్ర కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం అష్టమి శుభ థితౌ భీష్మాష్టమి తర్పనార్ఘ్యం అస్య కరిష్యే అపపౌస్పృశ్య.


విష్ణు సహస్రనామాలను మనకు అందించిన భీష్మాచార్యుల వారి అష్టమి రోజున భీష్ముడిని తలచుకుని, ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా 'ఓం నమోనారాయణాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు. పూజ పూర్తయిన తరువాత ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML