శ్లో. జిగ్వాగ్రే వర్తతే లక్ష్మీ ,జిహ్వాగ్రే మిత్ర బాంధవాః ॥
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః ,జిహ్వాగ్రే మరణం ధృవమ్ ॥
మంచి మాటను లక్ష్మి సంప్రాప్తమగును !
మంచి మాటాడ బంధువుల్ మనను విడరు !
మాట బాగోనిచో కల్గు బంధనంబు !
మాట బాగోనిచో మృతియు మనకు కలుగు!!
నాలుక చివరనే సంపదలు, మిత్రులు, బంధువులు, బంధనం ,చివరకు మరణం కూడా ఉంటాయి. (అందువల్ల నాలుకనుఅదుపులో ఉంచుకొని మాట్లాడాలి.)
మనిషి ఎదుట ఒక మాట మనిషి వెనుక వేరొక మాట మాట్లాడు మితృలు ఏనాటికీ సన్మితృలు కాలేరు.
"మౌనేన కలహం నాస్తి"
No comments:
Post a Comment