What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 23 May 2013

గీతం:నారాయణాచ్యుతానందగోవిందహరి
రచన:తాళపాక అన్నమయ
రాగం :మాయామాలవగౌలము

http://myalltimefavouritesongs.blogspot.in/2013/01/naaraayana-achyuta-govinda.html

(పాట వినాలి అనుకునే వారు ఈ లింక్ లోకి వెళ్లి సాహిత్యానికి చివర ఉన్న ప్లేయర్ ఆప్షన్ ని వినియోగించుకోండి.)

చరణము.:-
నారాయణాచ్యుతానందగోవిందహరి
సారముగ నీకు నే శరణంటినీ

నారాయనాచ్యుతానందగోవిందహరి
సారముగ నీకు నే శరణంటినీ

పల్లవి:-
1.
చలువయును వేడియును నటల సంసారంబు
తొలగు సుఖమొకవేళ దుఖమొక వేలా -1

ఫలములివె ఈ రెండు పాపములు పుణ్యములు
పులుపు తీపులు గలిపి బుజియించినట్లు -1

నారాయణాచ్యుతానందగోవిందహరి
సారముగ నీకు నే శరణంటినీ

2.
పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు
తగు మేను పొడ చూపు తనుదానే తొలగు -1

నగియించునొకవేల నలగించునొ వేల
వగరుకారపు విడెము ఉప్పించినట్లూ -1

నారాయణాచ్యుతానందగోవిందహరి
సారముగ నీకు నే శరణంటినీ

3.
ఇహము పరముల బలిమి నెరిగి కల్లయు నిజము
విహరించు బ్రాంతియును విబ్రాంతియును మదిని -1

సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే -1

నారాయణాచ్యుతానందగోవిందహరి
సారముగ నీకు నే శరణంటినే
సారముగ నీకు నే శరణంటినీ
శరణంటినీ....శరణంటినీ...
నారాయణా....నారాయణా
నారాయణా....నారాయణా
నారాయణా..................

http://www.facebook.com/pages/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82/393210837430440

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML