What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 23 May 2013

హరి ఓం..
అద్వైతం ఆదిశంకర నిర్మితం. ఏకత్వ భావన ముఖ్యోద్దేశంగా సర్వజన సమానత్వాన్ని పెంచటానికి ఆనాటి హిందూ ద్వేష బౌద్దాన్ని ఎదుర్కోవటానికి రూపొందించబడిన మతం అద్వైత మతం.అంటే ఆత్మ పరమాత్మా ఒక్కటే.రెండు వేరు వేరు కాదు.
ప్రపంచం లో చివరికి ఉండేది శూన్యమే.జీవితం ఆఖరున మనం పట్టుకుపోయ్యేది కుడా శూన్యమే.
మన ఆత్మాభిమానాన్ని పెంచుకుని ఎదుటి వాడి ఆత్మలోని పరమాత్మను నమస్కరించి గౌరవించటం ద్వారా మానవత్వాన్ని సర్వ ప్రాణి సమానత్వాన్ని పెంపొందించటం అద్వైతం యొక్క లక్ష్యం.బుద్దుడు ఎందుకు బౌద్దాన్ని నిర్మించాడు.అసమానత చూపుతున్న ఆనాటి సమాజాన్ని మార్చటానికి క్షత్రియుడైన తను కాషాయ వస్త్రాలు ధరించి మౌని గా మారి మహా యానం ను సమర్దం గా హిందూ సనాతన ధరంభద్దం గానే నడిపాడు.కాని హీన యానం సమయానికి బౌద్ధం హిందూ ధర్మాన్ని ద్వేషించటం ప్రారంభించి వేదాలను నాశనం చెయ్యటం ప్రారంభించింది.ఆకాలంలో వేద రక్షణకై అందరికి అర్ధం అయ్యేలా ప్రస్తానత్రయభాష్యం కోసం అవతరించిన శంకరఅంశగా ఆదిశంకరాచార్యులను భావించటం జరిగింది.అద్వైతాన్ని తర్కవిధానంలో స్తిరీకరించటం జరిగింది.నాలుగు వైపులా నాలుగు శంకర శక్తి పీటాలు స్తాపించటం జరిగింది.
దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన పద్మపాదులు (తూర్పున పూరి లో), హస్తామలకులు (పడమరన ద్వారకలో), తోటకాచార్యులు (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), సురేశ్వరాచార్యులు (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తరువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
శివ కేశవుల ఏకత్వ భావమే అద్వైతం.
శంకర మాయా వాదం.
"బ్రహ్మ సత్యం జగన్మిధ్య
జీవొ బ్రహ్మైవ నా పరః"

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య(శూన్యం).
ఈ జీవుడే బ్రహ్మం.
జీవుడు(ఆత్మ), బ్రహ్మము వేరు కాదు.
- ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది.

తర్క తత్వ వాద సూత్రాలు
(స్వల్పంగా "ఆత్మానాత్మ వివేకం" అను గ్రంధం నుంచి)..,
1.ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
2.కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
3.రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.
4..అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
5.అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
6.అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంటుంది.అందుకుకారణం ఉండదు) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, .
అవివేకం వలన అభిమానం,
అభిమానం వలన రాగాదులు,
రాగాదుల వలన కర్మలు,
కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ),
అందువలన దుఃఖం కలుగుతున్నాయి.
నిష్కామ కర్మ విధానం యొక్క ప్రశక్తి ఇక్కడ ఉంటుంది..
(వివరణ మొత్తం పరిచయం తరువాత)

వజ్ర యానం దశలోని బౌద్ధం నుంచి ఆ కాలం లో హైందవ సంస్కృతిని రక్షించి
ప్రజలలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన దేవుడు,
విశ్వ గురువు,
ఆది గురువైన శివ శంకరుని అంశ
అయిన
శ్రీ ఆది శంకరాచార్యుల జన్మదినం.
ఈ రోజు,
ఒకసారి ఆయన సుందర బాల రూపాన్ని మనస్సులో ముద్రించుకుని పావణం అవుదాము.
హర హర మహా దేవ శంబో శంకర.

http://www.facebook.com/pages/%E0%B0%B5%E0%B1%87%E0%B0%A6%E0%B0%82/393210837430440

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML