
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 2 June 2015
కొన్ని ముఖ్యమైన విషయాలు.
కొన్ని ముఖ్యమైన విషయాలు.
🔴 ముక్కులు కుట్టిన్చుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.
🔵 ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
🔴 తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి , తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.
🔷 స్త్రీలకు బేసి సంఖ్యా గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.
🔴 సూర్య గ్రహణానికి ముందు ”12 ” గంటల కాలము, చంద్ర గ్రహణానికి ”9” గంటల ముందు కాలము కడుపు కాలిగా ఉంచుకోవలెను.
🔷 శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి మరియు పుట్టిన సమయమునకు సూర్యుడు ఎ రాశిలో ఉంటె అది వారి జన్మ లగ్నం.
🔴 జ్యోతిశాస్త్రం ప్రకారం బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి భుదునకు, ఇనుము శని కి ఇష్టము.
🔷 రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
🔴 యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండు నపుడు పాదరక్షలను తలక్రింద ప్ర్ట్టుకొని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.
🔷 ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
🔴 ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.
🔷 ఇద్దరు ఆడపిల్లలకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి.
🔴 గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకోట్టుచుండురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్తుతులోను స్త్రీలు చేయరాదు.
🔵 వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.
🔴 తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.
బోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.
కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment