What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 14 August 2015

శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది.



శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది.

పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేధ్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేధ్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార ‪#‎వేంకటేశ్వర‬ దీపారాధన. ఈ పూజ చేయడం వల్ల ఎంతోమందికి కోరిన కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నేరవేరాయి.


ఓం నమో వేంకటేశాయ

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML